Showing posts with label జాతీయం. Show all posts
Showing posts with label జాతీయం. Show all posts

Sunday, 6 October 2013

పాలకుడి వినాశనం...


హైదరాబాద్: భూకబ్జా దారులు పంజరాల్లో ఎక్కడో ఒక రైతు నలిగిపోతూనే ఉన్నాడు...! ఒకప్పుడు పచ్చని పంట పొలాలతో....!రైతన్నల రెక్కల కష్టంతో ...! ఆ భూములు పులకరించి పోయేవి..!అన్నదాతల చెమట చుక్కల తాకిడికి పరవసించి పోయేది...!కానీ నేడు ఆ పచ్చదనం లేదు..!దుక్కి దున్ని నారు పోసి ... నీరు పెట్టే రైతన్న ఇలాకాలో భూ బకాసురులు చొరపడ్డారు..!అన్యాయంగా వారి భూములను స్వాధీనం చేసుకుని రైతన్నను నట్టేట ముంచేత్తారు...! ఈ వారం భూ బకాసురుల కాలికింద నలిగిన గ్రామం.... ఇంబ్రహీం పట్నం మండలం ఆదిబట్ల గ్రామం. నగరాల్లోని పార్కులు … భవనాలను మింగేసిన బకాసురులను పల్లేలంటే ఒక లెక్క కాదు..!నిత్యం రైతన్న చెమట చుక్కతో తడిచే ఆ గ్రామంలో.... రైతులు తమ కున్న చిన్నపాటి భూములను సాగు చేసుకుంటు తమ జీవనాన్ని సాగించే వారు.. దీంతో అక్కడ బకాసుర కన్ను పడింది.స్వాధీనం చేసుకుంటే  అడిగే నాదుడు లేడని పాలకులకు తెలిసినంత మరెవరికి తెలియకపోవచ్చు.....! అధికారులు  కొత్త కొత్త పేర్లతో కంపెనీలకు స్వాగతం పలికారు. జనానికి ఇదొక  మహోదయం అని నమ్మ బలికి నేల తల్లి సాక్షిగా.. సామాన్యుల భూములను అన్యాక్రాంతం చేశారు.'' పచ్చని పొలాలకు డబ్బు ర్కెలు వచ్చి ఎటో ఎగిరి పోయాయి... దీంతో పచ్చని పొలాలు ఎండి పోయి పచ్చనోట్లతో బకాసుర నోట్లో పడ్డాయి''..వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇక్కడ  కంపెనీలు వెలిశాయి... ఏరో స్పేస్ ఇంజనీరింగ్ కంపెనీలకు 340ఎకరాలను ప్రభుత్వం లాంచనంగా అప్పచెప్పింది. దీంతో రైతుల వద్ద భూములు స్వాధీనం చేసుకున్నారు. భూములను తీసుకునే  టప్పుడు కంపెనీలు రైతులకు హామీల వర్షం కురిపించారు. ఇక రైతునుంచి పొలాలు వారి చేతిలోకి పడ్డాక... రైతులను నట్టేట ముంచారు.. హామీల వర్షం కురిపించిన ప్రభుత్వం,  రైతులను పట్టించుకునేదే లేదు..!అక్కడ ఎకరాకు కనీసం ధర 30లక్షలు పలికింది. కానీ ప్రభుత్వం మాత్రం ఎకరాకు 5లక్షల చొప్పున వారికి ఇచ్చింది.

దీన స్థితిలో రైతన్నా...!
ఇప్పుడు రైతన్న ఆ గ్రామంలో ఎక్కి ఎక్కి ఏడుస్తున్నాడు..! ఇటు నష్ట పరిహారం అందక.. అటు పోయిన భూమితిరిగి రాక దీనావస్థ స్థితిలో ఉన్నాడు... కాయాకష్టం చేసుకుంటు కడుపు నింపుకునే వారు.. ఇప్పుడు ఆ భూములు లేక చేప పిల్లలా తల్లడిల్లి పోతున్నారు.. ఇందంతా పక్కకు పెడితే... స్వాధీన పరుచుకున్న భూముల్లో ఏమైనా కంపెనీలు వచ్చిఉంటే అక్కడ నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించేవి..!కానీ అక్కడ కంపెనీలు లేవు... స్వాధీన పరుచుకున్న 340 ఎకరాల్లో ఇప్పుటికి రెండు కంపెనీలు మాత్రమే వచ్చాయి... ఇంకో రెండు కంపెనీలు ప్రతిపాదనలో ఉన్నాయి. ఆ కంపెనీలు వచ్చిఉంటే చుట్టుపక్కల వారికి ఉద్యోగ అవకాశాలు వచ్చేవి.. గ్రామ అవసరాలు తీరేవి..!కానీ అలా జరగలేదు.. అర కొర నష్ట పరిహారంతో రైతులు కుదేలైపోయారు.. పొలాలు పోగొట్టుకుని ఇటు  గ్రామం గ్రామమే మోసపోయింది. ఇదిలా ఉంటే నష్ట పోయిన రైతుల్లో ఆరు కుంటుంబాలకు ఒక్క పైసా కూడా ఇప్పటి వరకు అందలేదు.. కొందరి కుటుంబాలకు ఎకరాకు 5లక్షలు నష్టపరిహారం అంధింది. కేవలం ఆరు కుటుంబాలకు మాత్రమే రాకుంటే వారు ఎవరికి చెప్పుకుంటారు.వారి గోడు పట్టించుకునే వారు ఎవరు..ఎమ్మార్వోను కలిసారు.. లోకల్ ఎమ్మెల్యేలను కలిశారు, ఎవ్వర్నీ కలిసినా ఏమీ ప్రయోజనం లేదు..వారికి చివరికి శూన్య హస్తాలు శుశ్క వాగ్ధానాలు మాత్రమే మిగిలాయి.. వారి సమస్య మాత్రం తీరలేదు.మూడు సంవత్సరా క్రితం భూములు కోల్పోయి నష్ట పరిహారం రాక ఇప్పటకి రైతన్న దిక్కులు చూస్తున్నాడు. పరిహారం కోసం అధికారుల చుట్ట తిరిగి వారికి విసుకు వచ్చేసింది.

Wednesday, 11 September 2013

పరుగుల దాహంతో ఉన్నాడు...



ఢిల్లీ: రెండేళ్ల నుంచి సచిన్ ఖాతాలో సెంచరీలు లేకపోవడంతో , సింహం ఆకలితో ఉన్నట్టే నని భారత మాజీ ఓపెనర్ చేతన్ చౌహాన్ అభిప్రాయపడ్డాడు. మాస్టర్ వయస్సు మీదపడుతున్నా తనలో ఇంకా క్రికెట్ ఆడే సత్తా ఉందని తెలిపాడు. తన రిటైర్మెంట్ పై వస్తున్న ఊహాగానాలను కొట్టిపారేశారు. ఈవిషయాన్ని సచిన్ కే వదిలేయాలని ఆయన అన్నారు. మరో వైపు భారత జట్టులోకి సీనియర్ ఆటగాళ్లు సెహ్వాగ్, గంభీర్, జహీర్ లు మళ్లీ జట్టులోకి వస్తారని ఆశాభావం వ్యక్తంచేశారు. కోహ్లీలో చక్కని క్రికెటర్ ఉన్నాడని అతను మునుముందు దేశానికి మంచి పేరు సంపాదిస్తాడని అన్నాడు. అతన్ని భావి కెప్టెన్ గా చౌహాన్ అభివర్ణించాడు.  

Sunday, 1 September 2013

ఆసియా కప్ సొంతం చేసుకున్న కొరియా..



మలేషియా: దక్షిణ కొరియా ఆసియా కప్ ను ఎగరేసుకు పోయింది. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్ పై కొరియా 4-3గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. లీగ్ దశలో దక్షిణ కొరియాను మట్టి కరిపించిన భారత్, ఫైనల్లో మాత్రం ఆ ప్రభావం చూపలేక పోయింది. అయితే ఇప్పటికే భారత్ ప్రపంచ కప్ కు అర్హత సాధించడంతో ఆ జట్టు ఊపిరి పీల్చుకుంది. వరుస మ్యాచ్ లో విజయంసాధించి ఫైనల్ ట్రోపి తీసుకొస్తారని ఆశించిన అభిమానులకు నిరాశే మిగిలింది. 2007 చెన్నై లో జరిగిన టోర్నీలో విజేతగా నిలిచి, ఆ తర్వాత ఘోరంగా విఫలమైంది. ఆ టోర్నీలో భారత్ ఏడో స్థానంలో నిలబెట్టుకుంది. అయితే ఈ ఏడాది మాత్రం అనూహ్య విజయాలతో దూసుకుపోయినా, ఫైనల్లో మాత్రం చేతులెత్తేసింది. కానీ అభిమానులకు ఊరట నిచ్చే అశం...ప్రపంచ కప్ కు  అర్హత సాధించడం...!

రిటైర్మెంట్ కోసమేనా....!


ముంబై: సచిన్ టెండూల్కర్ తన 200వ టెస్టు మ్యాచ్ ను స్వదేశంలోనే ఆడనున్నాడు...  ఈ మెరకు బిసిసిఐ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆదివారం సాయంత్రం సర్వ సభ్య సమావేశమైన బిసిసిఐ, భారత్ వెస్టిండీస్ టెస్టు మ్యాచ్ షెడ్యూల్ ను ఖరారు  చేశారు. రెండు టెస్టు మ్యాచ్ లు, ఐదు వన్డే మ్యాచ్ ల సిరీస్ కోసం వెస్టిండీస్ కు ప్రతిపాదన పంపింది. అయితే ఈ ఏడాది చివర న  భారత్ సౌతాఫ్రికా తో టెస్టు సిరిస్ ఆడటానికి వెళ్లనుంది. అయితే సౌతాఫ్రికా టూరు కంటే ముందు భారత్ లోనే వెస్టిండీస్ తో టెస్టు సిరిస్ నిర్వహించాలని చూస్తుంది. ఈ సవరణ భారత క్రికెట్ లెజండర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ గురించేనని తెలుస్తుంది. సౌతాఫ్రికా టూరు తరువాత టెస్టు క్రికెట్ కు గుడ్ బై చెపుతాడని వస్తున్న కథనల నేపథ్యంలో, ఇప్పుడు వెస్టిండీస్ సిరిస్ సచిన్ కోసమేనని బిసిసిఐ చెప్పకనే చెప్పడంతో, ఆతని  రిటైర్మెంట్ పై  ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే క్రికెట్ నిపుణులు మాత్రం సచిన్ ఎక్కడైనా, ఏ దేశంలోనైనా ఆడగలడని ప్రత్యేకించి సచిన్ కోసం టెస్టు షెడ్యూల్ మార్చాల్సిన పనిలేదని వారు అభిప్రాయపడుతున్నారు. కానీ కొందరు మాత్రం సచిన్ కు స్వదేశంలో నే సగర్వంగా రిటేర్ మెంట్ ప్రకటించే సువర్ణ అవకాశం దొరికిందని అంటున్నారు. ఏదేమైనా సచిన్ భారత్ క్రికెట్ కు చేసిన సేవలను గుర్తించి, బిసిసిఐ ఈ నిర్ణయం తీసుకుందని అభిప్రాయాలు వెలువడుతున్నాయి.


పాక్ వన్డే సిరిస్ కైవసం...



హరారే: మూడు మ్యాచ్ ల వన్డే సిరిస్ ను పాకిస్తాన్ కైవసం చేసుకుంది. జింబాంబ్వే తో జరుగుతున్న ఈ సిరిస్ పాక్ 2-1తేడాతో సిరిస్ ను ఎగరేసుకుపోయింది.శనివారం హరారే స్పోర్స్ట్ క్లబ్ వేదికగా జరిగిన మూడో వన్డే పాకిస్తాన్ 108పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 50ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 260పరుగులు చేసింది. మిస్బా (67), అహ్మద్ షెహజాద్ (54)అర్థ సెంచరీతో చెలరేగారు. అయితే మిగతా బ్యాట్ మెన్స్ పర్వాలేదనిపించిన చివర్లో సర్ఫార్రాజ్ అహ్మద్ (22) వేగంగా ఆడాడు. జింబాంబ్వే బౌలర్లలో టెండి చతరాకు మూడు వికెట్లు దక్కాయి. అనంతరం 261పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాంబ్వే ఏమాత్రం విజయం వైపు దూసుకుపోకుండా చతికీలపడింది. 40ఓవర్లలో 152పరుగులు చేసి ఆలౌటై ఓడింది. వాలర్ (48)తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. పాక్ బౌలర్లలో మహ్మద్ హఫీజ్, అబ్దుల్ రెహమాన్ , అజ్మల్ తలా రెండేసి వికెట్లు తీశారు. 67పరుగులు చేసిన మిస్బాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ , హాఫీజ్ కు ప్లేయర్ ఆఫ్ ద సిరిస్ అవార్డులు అభించాయి. 

''హాట్ షాట్'' అదుర్స్...


:. మొదటి టైటిల్ కైవసం...
:. హైదరాబాద్ సంచలనం...
:. సైనా ఆట అద్భుతం...
ముంబై: హైదరాబాద్ హాట్ షాట్ తొలి ఐబిఎల్ టైటిల్ ను అందుకుంది. శనివారం ముంబై సార్థార్ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో హైదరాబాద్ తిరుగులేని విజయం సాధించింది. దీంతో తొలి ఐబిఎల్ టైటిల్ దిక్కించుకున్న టీంగా హైదరాబాద్ హాట్ షాట్ చరిత్ర సృష్టించింది. అవధె వారియర్స్ పై తిరుగులేని అధిపత్యాన్ని ప్రదర్శించిన సైనా కో అండ్ టీం....టైటిల్ ఎగరేసుకుపోవడంలో కీలక పాత్ర పోషించారు. మొదట పురుషుల సింగిల్స్ లో హైదరాబాద్ ఆటగాడు తనాంగ్ సాంగే...అవధె వారియర్స్ ఆటగాడు శ్రీకాంత్ పై 21-10, 21-20,తేడాతో విజయం సాధించాడు. అనంతరం జరిగిన మహిళల సింగిల్స్ లో సింధూ పై సైనా 21-15, 21-17తేడాతో విజయం సాధించింది. అయితే ఇంకో మ్యాచ్ మిగిలుండగానే హైదరాబాద్ టైటిల్ ను చేజిక్కించుకుంది.
తిరుగులేని సైనా...
ఐబిఎల్ తొలి సిజన్ నుంచి తిరుగులేని ఆదిపత్యాన్ని ప్రదర్శిస్తున్న సైనా నెహ్వాల్ ....ఫైనల్లో సైతం అదే జోరును కొనసాగించింది. ఐబిఎల్ లో సైనా అత్యుత్తమ షట్లర్ గా కొనసాగింది. జట్టు ఆడిన ప్రతీ మ్యాచ్ లోను బరిలోకి దిగి..అన్నింట్లోనూ నెగ్గిన ఏకైక క్రీడాకారిణి ఆమే. నెహ్వాల్ మొత్తం 7విజయాలు సాధించింది. సైనా కాకుండా ఆడిన ప్రతీ మ్యాచ్ లో నెగ్గిన క్రీడా కారుడు చాంగ్ వీ మాత్రమే . ఐతే అతను 4 సింగిల్స్, ఓ మిక్స్ డ్ డబుల్స్ మాత్రమే ఆడాడు.
విజేతలకు ఫ్రైజ్ మనీ...

తొలి ఐబిల్ గెలిచిన హైదరాబాద్ హాట్ షాట్ రూ 3.25 కోట్లు దక్కించుకుంది. అయితే ఈ టోర్నిలో రన్నరప్ గా నిలిచిన అవధె వారియర్స్ కు 1.75 కోట్లు చేజిక్కించుకుంది. అంతే కాకుండా ఈ టోర్నీలో అత్యంత వేగవంతమైన సర్వీస్ 279 కిలో మీటర్లలో ముంబయి ఆటగాడు ఇవనోవ్ కొట్టాడు...........

Saturday, 31 August 2013

ఆ ఇద్దరి లో ...గెలుపెవరిది...?


ముంబై: ఐబిఎల్ (ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్) తుది సమరానికి నేడు తెరలేవనుంది. మరి కొద్ది గంటల్లో విజేత ఎవరనేది తేలిపోనుంది. ఎన్ ఎస్ సిఎ స్టేడియంలో జరిగే ఫైనల్లో హైదరాబాద్ హాట్ షాట్, అవధె వారియర్స్ అమీతుమి తేల్చుకోనున్నాయి. అయితే తొలి ఐబిఎల్ లీగ్ ఎవరు విజేతగా నిలుస్తారని ప్రేక్షలు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ టోర్నిలో మొదటి నుంచి ఓటమన్నది తెలియన సైనా నెహ్వాల్ ...ఫైనల్లో హాట్ ఫేవరెట్ గా భరిలోకి దిగుతోంది. మరో పక్క యువతార సింధూ...సంచలనాలు సృష్టిస్తుండటంతో అవధె వారియర్స్ ను కూడ తక్కువ అంచన వేయలేం.!ప్రపంచ స్థాయి క్రీడా కారులను ఓడించిన సింధూ ..మంచి ఫామ్ కొనసాగిస్తుంది. అయితే ఒక వేళ్ల ఫైనల్లో సింధూ నిరాశ పర్చినా.. పురుషుల సింగిల్స్, డబుల్స్ లో , మంచి ఆటగాళ్లు ఉండటం అవధె వారియర్స్ కు కలిసొచ్చే అంశం..హైదరాబాద్ కు పెద్ద బలం సైనా నెహ్వాల్.. పురుషుల సింగిల్స్ లో అజయ్ జయరామ్ గెలుపు పైనే హైదరాబాద్ జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. డబుల్స్ లో షెమ్ గో, వాహ్ లిమ్ , మిక్స్ డ్ లో తరుణ్ కోనా..గాద్రె ఫామ్ లో ఉండటం హైదరాబాద్ హాట్ షాట్ కి కలిసొచ్చే అంశం. ఇద్దరు స్టార్ క్రీడా కారిణిలు తలపడుతున్న ఈ ఫైనల్, హోరాహోరిగా సాగుతుందనడంలో సందేహం లేదు.. రాత్రి 8గంటలకు ఈ మ్యాచ్ మొదలవనుంది.



Thursday, 29 August 2013

'శ్రీ' పై దాదా చలోక్తులు...



కోల్ కతా: ఐపిఎల్-6 లో40 లక్షల రూపాయల మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడిన శ్రీశాంత్, ఆడబ్బు మొత్తం ఏం చేస్తాడని మాజీ కెప్టెన్ సౌరప్ గంగూలీ అన్నారు..  బుధవారం ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఫిక్సింగ్ పై పలు సూచనలు చేశారు. శ్రీశాంత్ ఫిక్సింగ్ పాల్పడ్డాడో! లేదో! తనకు తెలియదని ...ఒక వేళ్ల ఆ పని చేసి ఉంటే నిజంగా మూర్ఖత్వమే అవుతుందని అభిప్రాయపడ్డారు.శ్రీశాంత్ డబ్బులే లక్ష్యంగా పెట్టుకుంటే ఒక్క టెస్టు ఆడితే ఆ మొత్తం వస్తుందన్నాడు. మూడు టెస్టుల మ్యాచ్ లో ఇరవై వికెట్లు తీసి ఉంటే దానికి డబుల్ రెట్లు డబ్బు వచ్చేదని తెలిపాడు. మరో వైపు ఫిక్సింగ్ వ్యవహారం భారత క్రికెట్ ను దెబ్బ తీయదని అన్నాడు... ఒక చెరువులో , లేదా ఒక నదిలో మంచి చేపలు ఉంటాయి... చెడు చేపలు ఉంటాయి... కానీ చెడు చేపల వల్ల ఆ నది మొత్తం పాడు కాదు కదా....!అని తెలిపారు. అదేవిదంగా భారత్ క్రికెట్ వ్యవస్థలో చాలా మంది మంచి వారు ఉన్నారు. చెడ్డ వారు ఉన్నారు. అంత మాత్రాన క్రికెట్ వ్యవస్థ దెబ్బ తినదని అభిప్రాయపడ్డారు.    

Sunday, 21 July 2013

భార్యను కడతేర్చిన భర్త

శ్రీకాకుళం: భార్యను కడతేర్చి మృత దేహాన్ని కాలువలో పడేసిన ఘటన సంతకవిటి మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...కాకరాపల్లిలో నివాసముంటున్న అనంతరావు శనివారం సాయంత్రం భార్యను చంపి మృత దేహాన్ని కాలువలో పడేశాడు. అనంతరం ఏమీ తెలియని అమాయకుడిలా తన భార్య కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే అతనిపై ముందునుండి అనుమానంతో ఉన్న గ్రామస్తులు, బంధువులు, తన వ్యవహార శైలి పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.  విచారణ చేపట్టిన పోలీసులు అనంతరావే ఈ హత్య చేశాడని తేల్చారు. దీంతో అతనిని కఠినంగా శిక్షించాలని బాధితురాలి బంధువులు, గ్రామ ప్రజలు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు.

'చిరు'ని కలిసిన అఖిలేష్

హైదరాబాద్: ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవిని కలిశారు. రెండు రోజుల రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఆయన సిఎం, ప్రతిపక్షనేతతో పాటు రాష్ట్రంలోని పలువురు నేతలతో భేటీ అయ్యారు. నగరంలో జరిగే అఖిల భారత యాదవ మహాసభ జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొనే ముందు ఆయన చిరును కలిశారు. ఇదే సమయంలో అఖిలేష్‌ యాదవ్‌ను పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ, మంత్రులు గంటా, వట్టి వసంత కుమార్‌ కలిశారు.  

ఐదేళ్ల బాలికపై వృద్దుడు అత్యాచారం

ఆదిలాబాద్‌ : అభం శుభం తెలియని ఐదేళ్ల బాలికపై 70 ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. స్థానికంగా కలకలం రేపిన ఈ సంఘటన భైంసా పట్టణంలో ఆదివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... జిల్లాలోని భైంసా పట్టణంలో కొర్వగల్లీకి చెందిన షేక్‌ మానామ్‌ అనే 70 ఏళ్ల వృద్ధుడు అదే కాలనీకి చెందిన ఐదేళ్ల బాలికకు మాయమాటలు చెప్పి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని షేక్ మానామ్‌ను అదుపులోకి తీసుకున్నారు.