
ఆదిలాబాద్ : అభం శుభం తెలియని ఐదేళ్ల బాలికపై 70 ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. స్థానికంగా కలకలం రేపిన ఈ సంఘటన భైంసా పట్టణంలో ఆదివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... జిల్లాలోని భైంసా పట్టణంలో కొర్వగల్లీకి చెందిన షేక్ మానామ్ అనే 70 ఏళ్ల వృద్ధుడు అదే కాలనీకి చెందిన ఐదేళ్ల బాలికకు మాయమాటలు చెప్పి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని షేక్ మానామ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
No comments:
Post a Comment