Showing posts with label సినిమా. Show all posts
Showing posts with label సినిమా. Show all posts

Thursday, 10 October 2013

''షేర్ ఖాన్'' ఇక లేరు....!

హైదరాబాద్: తెలుగు సినీ కళామ తల్లి మరో నటుడ్ని కోల్పోయింది. కాలేయ వ్యాధితో రియల్ స్టార్ శ్రీహరి బుధవారం సాయంత్రం హఠాన్మరణం చెందారు. ముంబైలోని ఓ షూటింగ్ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీహరి హఠాత్తుగా కిందపడిపోయారు. దీంతో హుటాహుటిన ముంబైలోని లీలావతి ఆసుపత్రికి తరలించారు. దీంతో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు.. అయితే తెలుగులో 100పైగా సినిమాల్లో నటించిన శ్రీహరి మంచి ఆర్టిస్ట్ గాను మంచి నటుడుగాను పేరుతెచ్చుకున్నాడు. అతని మృతి పట్ల సినీ పరిశ్రమ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తంచేసింది.. ఇలాంటి నటుడ్ని మళ్లీ పొందడం చాలా కష్టమని పలువురు ప్రముఖులు ఆవేదన వ్యక్తంచేశారు.
రియల్ స్టార్ .....!
శ్రీహరి చిన్నపట్టినుంచి సినిమాల్లో నటించాలని అతని తపన.. కానీ పేదరికం అతన్ని వెంటాడింది.... !సినిమా చూస్తూ తను హీరో స్థాయికి ఎప్పుడు ఎదుగుతానో! అని కలలు కనేవాడు. ఎంతమంది స్నేహితులు హేలన చేసిన తన కలను మాత్రం వీడలేదు. ఎదో నమ్మకం! ఎక్కడో ఆశ! తనను సినీ పరిశ్రమ హక్కున చేర్చుకుంటుందని నమ్మకం, అతన్ని ముందుకు నడిపించింది. దీంతో అతనికి పోలీస్ జాబ్ వచ్చినా కూడా దాన్ని వదులుకుని సినిమాలో నటించడానికి ట్రైన్ ఎక్కేశాడు. మొదటగా చిన్న చిన్న క్యారెక్టర్స్ తో సినీమాలో కనిపించినా... హీరో కావాలనే తపన మాత్రం సడలలేదు.! రోజు ఆల్భమ్ పట్టుకుని తిరుగ సాగాడు సినిమా వాళ్లు కనిపిస్తే చాలు … వాళ్ల చేతిలో కొన్ని ఫోటోలు పెట్టాల్సిందే. అప్పుడే వంగవీటి మోహనరంగ ''చైతన్యరథం'' సినిమా తీస్తున్నారని తెలిసింది. వాళ్లకు ఓ హీరో కావాలి. కొత్తవాళ్లను చూస్తున్నారట ఆ విషయం శ్రీహరికి చేరింది. ఆ హీరో నేనే అని కలలు కంటూ అక్కడ వాలిపోయాడు. శ్రీహరి కండలు గుండెల్లో ధైర్యం వాళ్లకూ ఇంకెముంది! తనకు తెలిసిన విద్యలన్నీ ప్రదర్శించాడు గురువుగారి సినిమా బయటకు వచ్చేస్తే ఇక అవకాశాలు వెల్లువెత్తుతాయి అనుకొన్నాడు. కానీ అవకాశాలు రాలేదు.
తొలిసారి హీరోగా....
హీరోగా తొలిసారి కెమెరా ముందుకు వచ్చాడు.. అదీ తనకు ఇష్టమైన పోలీస్ అవతారంలో శ్రీహరి ఏమిటీ ! హీరో ఏమిటీ! అని నొసలు చిట్లించారంతా ఇక విలన్ వేషాలూ గోవిందా.. అన్నవాళ్ళు ఉన్నారు. కానీ పోలీస్ విడుదలయ్యాక ఆ మాట మళ్లీ వినబడలేదు. పోలీస్ అంటే ఇలానే ఉండాలి అని పలువురి ప్రశంసలు అందుకున్నాడు... మన రియల్ స్టార్. అతను కన్న కలలు సాకారమైనాయి.. ఇక మిగిలింది సమాజ సేవ.. అని తన కూతురు పేరిట ఓ ఫౌండేషన్ ఏర్పాటేచేశాడు. కొన్ని గ్రామాలను దత్తతకు తీసుకుని వాటికి నీటి సరఫరా చేస్తున్నాడు. ఈ విధంగా సమాజ సేవలోనూ తన ముద్ర వేసుకున్నాడు. తను రాబోయే రోజుల్లో రాజకీయాలోకి వస్తాని చేప్పిన అనది కాలంలోనే తిరిగిరాని లోకాలకు వెల్లిపోయాడు.....!


''కమ్ముకుంటున్న కారు మబ్బులు నిన్ను మింగేశాయని విర్రవీగుతున్నాయి రా... నువ్వు ఉదయించే సూర్యుడివని వాటికి తెలియదు.... ఈరోజుఅస్తమించవచ్చు గాక, ఈ చీకటి బ్రతుకుని చీల్చుకుంటూ మళ్లీపుడతావురా... మళ్లీపుడతావ్...'''

Friday, 30 August 2013

ఫైనల్లో వారియర్స్....


బెంగళూరు: ఐబిఎల్ రెండో సెమీ ఫైనల్ ముగిసింది. ఫైనల్స్ లో హైదరాబాద్ హాట్ షాట్ కు దీటైన ప్రత్యర్థిని నేనే అంటూ... అవధె వారియర్స్ రంగం సిద్ధం చేసుకుంది. అయితే గురువారం జరిగిన రెండో సెమీ ఫైనల్స్ లో ముంబై మాస్టర్స్ ను అవధె వారియర్స్ 3-2 చిత్తుగా ఓడించింది. మహిళల సింగిల్స్ లో యువతార సింధూ మరో సారి మెరిసింది. కళ్లు చెదిరే స్మాష్ లతో ప్రత్యర్థిని చిత్తు చేసింది. 21-16, 21-13 తో వరుస గేమ్ ల్లో బాన్ పై విజయం సాధించింది. మరో వైపు పురుషుల సింగిల్స్ లో లీ చాంగ్ వీ (ముంబయి మాస్టర్స్)21-15,21-7తో గురు సాయిదత్ అవధె వారియర్స్ ను వరుస గేమ్ లల్లో ఓడించి జట్టుకు 1-0 అధిక్యాన్ని అంధించాడు. అయితే పురుషుల డబుల్స్ లో ముంబై మాస్టర్స్ ఓడిపోవడంతో ...2-2తో సమం చేశాడు . ఫలితం తేలే మిక్స్ డ్ డబుల్స్ లో కిడో-పియా గెలిచి అవధె వారియర్స్ ను ఫైనల్స్ కు చేర్చాడు..దీంతో శనివారం ముంబయిలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

మరో సారి దూకుడుగా.....

పివి సింధూ మరో సారి మెరిసింది. టిన్ బాన్ తో గేమ్ లో సింధూ ఆరంభం నుంచి దూకుడుగా ఆడింది. ప్రత్యర్థి ఎత్తులను గమనిస్తూ... గ్రౌండ్ మొత్తం ఆడించింది. చక్కని ప్లేస్ మెంట్స్ ఆడుతూ..ప్రత్యర్థిని 21-13 తో రెండో గేమ్ తో పాటు మ్యాచ్ ను కూడా కైవసం చేసుకుంది

Wednesday, 28 August 2013

మువ్వన్నెలను ముద్దాడిన క్రీడా కారులు...


హైదరాబాద్: భారత దేశం! మువ్వన్నెల జండాను ప్రపంచ వేదికలపై రెపరెపలాడించిన ఎందరో క్రీడా కారులున్నారు. నాటీ హాకీ మాంత్రికుడు, థ్యాన్ చంద్ నుంచి ఇప్పటి క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ వరకు ఎందరో ఎందరో వీరులను కన్నది మన పుణ్య దేశం...!కానీ థ్యాన్ చంద్ తరువాత ఇప్పటికి భారత హాకీ జట్టులో మరో థ్యాన్ చంద్ లాంటి ఆటగాడు లేకపోవడం దురదృష్ట కరం..!అంటే నేటి రాజకీయ క్రీడాల్లో ....దేశ క్రీడలు ఏవిదంగా శాషిస్తున్నాయో తెలుసుకోవచ్చు..!ఏక చక్రాదిపత్యంగా భారత్ ను మూడు సార్లు స్వర్ణాలు ముద్దాడిన థ్యాన్ చంద్, ఆయన పుట్టిన రోజు ప్రతి ఏట ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవంగా గుర్తించి, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చినవారిని సన్మానిస్తారు. మన భారత ప్రభుత్వం. అయితే భారత్ ప్రపంచ జనాభాలో రెండో అతిపెద్ద దేశం. కానీ ప్రపంచ క్రీడా రికార్డుల ప్రకారం ఎంతో వెనుక బడి ఉంది. 1928 ఆస్టర్ డ్యాం నుంచి ఇప్పటి వరకు కేవలం హాకీ ద్వార మాత్రమే భారత్ మూడు స్వర్ణాలు సాధించింది. మరో వ్యక్తి గత విభాగాల్లో సైతం స్వర్ణ పథకాలు సాధించే స్థాయికి ఎదిగింది. అయితే వంద కోట్లకు పైగా భారత పౌరులున్నా...కేవలం అతి తక్కువ మంది క్రీడా కారులు మాత్రమే భారత దేశానికి పేరు  ప్రతిష్టలు తెచ్చిపెట్టారు.
మతంగా క్రికెట్.....!
క్రికెట్ పుట్టింది ఇంగ్లాండులో అయితే దాన్ని హక్కున చేర్చుకుంది మాత్రం భారత్, ఎందుకంటే తొలిసారిగా భారత్ 1983లో కపిల్ దేవ్ సారథ్యంలో ప్రపంచ కప్ ను ముద్దాడింది. అప్పటి నుంచి ఇండియాలో క్రికెట్ పై మక్కువ ఏర్పడింది. ఇప్పటి వరకు దాన్ని ఓ మతంగా ఆరాదిస్తున్నారంటే అతిశయోక్తి కాదు....
మువ్వన్నెలను ఎగుర వేసిన 'మాంత్రికుడు'...
అయితే మన జాతీయ క్రీడా హాకీ, ఒలింపిక్ చరిత్రలో భారత్ ఇప్పటి వరకు తొమ్మిది బంగారు పథకాలు సాధిస్తే... అందులో కేవలం హాకీ ద్వారా వచ్చినవి మూడు.అంటే అప్పట్లో హాకీ మాంత్రికుడు ఎంత మాయ చేశాడో అర్థం అవుతుంది. భారత హాకీ ని భారత ఆటగాడు థ్యాన్ చంద్ ను వేరిచేసి చూడటం సాధ్యం కాని పని , థ్యాన్ చంద్ దేశానికి చేసిన ఎనలేని సేవను గుర్తిస్తు ప్రతి ఏట థ్యాన్ చంద్ పుట్టిన రోజున ఆగస్టు 29న దేశ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈరోజున రాజీవ్ కేల్ రత్న, ద్రోణా చార్య, అర్జున, ధ్యాన్ చంద్ అవార్డులతో క్రీడా కారులను సన్మానిస్తారు.
క్రికెట్ పై ఆదరణ....
అయితే భారత్ లో ఎక్కువగా ఆదరిస్తున్న క్రీడా క్రికెట్ మాత్రమే ...! భారత్ తొలి కెప్టెన్ తెలుగు తేజం సికే నాయుడు నుంచి ప్రపంచ కప్ ను సాధించి పెట్టిన కపిల్ దేశ్ , సునీల్ గవాస్కర్, అనీల్ కూంబ్లే, సచిన్ టెండూల్కర్, వివిఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీ, ధోనీ, విరాట్ కోహ్లీ ఇలా ఎందో ఆల్ టై గ్రేడ్లను అంధిచిన ఘనత భారత్ కు దక్కుతుంది. అయితే క్రికెట్ ఎంత మంది యువ ఆటగాళ్లు వచ్చినా...! అందరు సచిన్ తరువాతే నని చెప్పుకోవాలి. మన దేశంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఓ దేవుడిగా కొలుస్తారు. ఇంకా చెప్పాలంటే సచిన్ భారత్ క్రీడా రంగానికే ఓ ఐకాన్ ప్లేయర్ గా వెలుగు వెలిగుతున్నాడు. తన ఆట తో అంతగా మాయ చేశాడు ఈ లిటిల్ మాస్టర్, సచిన్ ప్రపంచ బ్యాట్ మెన్స్ లో ఓ నెంబర్ వన్ ప్లేయర్ గా కొనసాగుతున్నాడు. అంతే కాదు భారత్ కు ప్రపంచ కప్ అందించాలని కలలు కన్నాడు... పరితపించాడు... సుదీర్ఘ కాలం పాటు వేచి చూశాడు..! చివరికి 2011లో తన కల సకారం చేసుకున్నాడు... , కలలు కనండీ ..వాటిని సాకారం చేసుకోవడానికి పరితపించడండీ... అని సచిన్ ప్రపంచానికి చెప్పకనే చెప్పాడు..!తన ఆట తీరుతో ఎందరో అభిమానులను చొరకొన్న సచిన్, తరువాత అంతటి పేరు ప్రత్యేకతలు సంపాధించాడు.. కూల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ...ఇతను ఇండియాను రెండు ఫార్మాట్ లల్లో విశ్వ విజేతలు నిలిపాడు. టెస్టుల్లో ఇండియాను నెంబర్ వన్ ర్యాంక్ కు చేర్చిన ఘనత అతనికే సొంతం!

ఒలింపిక్ దీరులు...
అయితే వ్యక్తి గ విభాగాల్లోను భారత్ ను విశ్వ విజేతలు గా నిలిచిన వారు చాలా మంది ఉన్నారు. చెస్ విభాగంలో విశ్వనాద్ ఆనంద్ ఇప్పటి వరకు ఐదు సార్లు ప్రపంచ కప్ లను సొంతం చేసుకుని రికార్డు సృష్టించాడు. ఇక బ్యాడ్మింటన్ లో ప్రకాశ్ పడుకునే ఎన్నో అరుదైన రికార్డులను సొంతం చేసుకున్నాడు.. ఆదరణ ప్రోత్సాహం ఏ మాత్రం లేని రోజుల్లోనే 1980లో ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ టైటిల్ ను సొంతం చేసుకున్న క్రీడా కారుడిగా చరిత్ర సృష్టించారు. అంతే కాదు ప్రకాశ్ ఓ వరల్డ్ కప్ టైటిల్ ను సాధించి పెట్టారు. బ్యాడ్మింటన్ లో ఇప్పటి వరకు ఎందరో బ్యాడ్మింటన్ లు వస్తున్నారు. పోతున్నారు. కానీ ప్రకాశ్ పదుకునే లాంటి వారు ఇప్పటికి దేశానికి దొరకలేదు. అయితే 28ఏళ్ల తరువాత భారత దేశానికి బంగారు పథకం అంధించి అరుదైన రికార్డు సృష్టించాడు అభినవ్ బింద్ర, 2008 బీజింగ్ ఒలింపిక్ లో పది మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో భింద్రా గోల్డ్ మెడల్ సాధించాడు.. ఇప్పటి వరకు భారత దేశం మొత్తం 29పథకాలుమాత్రమే సాధించ కలిగింది. ఇందులో 9 బంగారు పథకాలు, ఆరు వెండి పథకాలు.11కాంస్య పథకాలు ఉన్నాయి . ఇక ఒలింపిక్ టెన్నిస్ పురుషుల విభాగంలో లియాండ్ ఫేస్ కాంస్య పథకం సాధించాడు. 2000సిడ్నీ  ఒలింపిక్స్ లో మనతెలుగు తేజం కరుణం మల్లీశ్వరీ వేయిట్ లిఫ్టింగ్ విభాగంలో పథకం సాధించింది. 2012 భారత్ ఒలింపిక్స్ లో భారత్ ఏకంగా ఆరు పథకాలు సాధించింది. భారత దేశానికి వచ్చిన అత్యదిక ఒలింపిక్ పథకాలు ఇవే కావడం విషేశం..
కబడ్డీ హవా....

ఇక మన దేశంలోనే పుట్టిన కబడ్డీ హవా కొనసాగుతోంది. కబడ్డీలో నెంబర్ వన్ మన భారత జట్టే..!2004నుంచి 2012వరకు జరిగిన ఐదు ప్రపంచ కప్ టైటిల్స్ ను మన దేశమే సొంతం చేసుకుంది. ఈ విషయం ఎక్కువ మందికి తెలియదు. 2012లో వరల్డ్ కప్ ను సైతం భారత జట్టే సొంతం చేసుకుంది. ఇక బిలీయర్డ్స్ లోని భారత్ కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ పేరు వింటే గుర్తుకొచ్చే క్రీడా కారుడు పంకజ్ అద్వానీ , ఇప్పటి వరకు రికార్డు లెవల్లో పంకజ్ అద్వాని ఏడు సార్లు ప్రపంచ కప్ ను సొంతం చేసుకున్నాడు. ట్రాక్ అండ్ ఫీల్డ్ లో అశ్వని నాచప్ప.. పేరు తెచ్చిపెట్టారు... ఏది ఏమైనా కొంత మంది క్రీడా కారులు మాత్రం..భారత్ పేరు ప్రతిష్టలు నిలబెడుతూ వస్తున్నారు...... ఆగస్టు 29ప్రపంచ క్రీడా దినోత్సవాన్ని పురష్కరించుకుని ఇక నైనా మన దేశంలో క్రీడా అభివృద్ది సాధించాలని అశిద్దాం.................. మీ ....!
 

Sunday, 21 July 2013

భార్యను కడతేర్చిన భర్త

శ్రీకాకుళం: భార్యను కడతేర్చి మృత దేహాన్ని కాలువలో పడేసిన ఘటన సంతకవిటి మండలంలో చోటుచేసుకుందివివరాల్లోకి వెళ్తే...కాకరాపల్లిలో నివాసముంటున్న అనంతరావు శనివారం సాయంత్రం భార్యను చంపి మృత దేహాన్ని కాలువలో పడేశాడు. అనంతరం ఏమీ తెలియని అమాయకుడిలా తన భార్య కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడుఅయితే అతనిపై ముందునుండి అనుమానంతో ఉన్న గ్రామస్తులుబంధువులుతన వ్యవహార శైలి పై పోలీసులకు ఫిర్యాదు చేశారు విచారణ చేపట్టిన పోలీసులు అనంతరావే ఈ హత్య చేశాడని తేల్చారు. దీంతో అతనిని కఠినంగా శిక్షించాలని బాధితురాలి బంధువులు, గ్రామ ప్రజలు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు.

ఐదేళ్ల బాలికపై వృద్దుడు అత్యాచారం

ఆదిలాబాద్‌ అభం శుభం తెలియని ఐదేళ్ల బాలికపై 70 ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడుస్థానికంగా కలకలం రేపిన ఈ సంఘటన భైంసా పట్టణంలో ఆదివారం జరిగిందిపోలీసుల కథనం ప్రకారం... జిల్లాలోని భైంసా పట్టణంలో కొర్వగల్లీకి చెందిన షేక్‌ మానామ్‌ అనే 70 ఏళ్ల వృద్ధుడు అదే కాలనీకి చెందిన ఐదేళ్ల బాలికకు మాయమాటలు చెప్పి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడుబాలిక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారుపోలీసులు కేసు నమోదు చేసుకుని షేక్ మానామ్‌ను అదుపులోకి తీసుకున్నారు