హైదరాబాద్:
తెలుగు సినీ
కళామ తల్లి మరో నటుడ్ని
కోల్పోయింది. కాలేయ
వ్యాధితో రియల్ స్టార్ శ్రీహరి
బుధవారం సాయంత్రం హఠాన్మరణం
చెందారు. ముంబైలోని
ఓ షూటింగ్ కార్యక్రమంలో
పాల్గొన్న శ్రీహరి హఠాత్తుగా
కిందపడిపోయారు. దీంతో
హుటాహుటిన ముంబైలోని లీలావతి
ఆసుపత్రికి తరలించారు.
దీంతో చికిత్స
పొందుతూ ఆయన తుది శ్వాస
విడిచారు.. అయితే
తెలుగులో 100పైగా
సినిమాల్లో నటించిన శ్రీహరి
మంచి ఆర్టిస్ట్ గాను మంచి
నటుడుగాను పేరుతెచ్చుకున్నాడు.
అతని మృతి
పట్ల సినీ పరిశ్రమ తీవ్ర
దిగ్ర్భాంతి వ్యక్తంచేసింది..
ఇలాంటి నటుడ్ని
మళ్లీ పొందడం చాలా కష్టమని
పలువురు ప్రముఖులు ఆవేదన
వ్యక్తంచేశారు.
రియల్
స్టార్ .....!
శ్రీహరి
చిన్నపట్టినుంచి సినిమాల్లో
నటించాలని అతని తపన..
కానీ పేదరికం
అతన్ని వెంటాడింది....
!సినిమా చూస్తూ
తను హీరో స్థాయికి ఎప్పుడు
ఎదుగుతానో! అని
కలలు కనేవాడు. ఎంతమంది
స్నేహితులు హేలన చేసిన తన
కలను మాత్రం వీడలేదు.
ఎదో నమ్మకం!
ఎక్కడో ఆశ!
తనను సినీ
పరిశ్రమ హక్కున చేర్చుకుంటుందని
నమ్మకం, అతన్ని
ముందుకు నడిపించింది.
దీంతో అతనికి
పోలీస్ జాబ్ వచ్చినా కూడా
దాన్ని వదులుకుని సినిమాలో
నటించడానికి ట్రైన్ ఎక్కేశాడు.
మొదటగా చిన్న
చిన్న క్యారెక్టర్స్ తో
సినీమాలో కనిపించినా...
హీరో కావాలనే
తపన మాత్రం సడలలేదు.!
రోజు ఆల్భమ్
పట్టుకుని తిరుగ సాగాడు సినిమా
వాళ్లు కనిపిస్తే చాలు … వాళ్ల
చేతిలో కొన్ని ఫోటోలు
పెట్టాల్సిందే. అప్పుడే
వంగవీటి మోహనరంగ ''చైతన్యరథం''
సినిమా
తీస్తున్నారని తెలిసింది.
వాళ్లకు ఓ
హీరో కావాలి. కొత్తవాళ్లను
చూస్తున్నారట ఆ విషయం శ్రీహరికి
చేరింది. ఆ
హీరో నేనే అని కలలు కంటూ అక్కడ
వాలిపోయాడు. శ్రీహరి
కండలు గుండెల్లో ధైర్యం
వాళ్లకూ ఇంకెముంది! తనకు
తెలిసిన విద్యలన్నీ ప్రదర్శించాడు
గురువుగారి సినిమా బయటకు
వచ్చేస్తే ఇక అవకాశాలు
వెల్లువెత్తుతాయి అనుకొన్నాడు.
కానీ అవకాశాలు
రాలేదు.
తొలిసారి
హీరోగా....
హీరోగా
తొలిసారి కెమెరా ముందుకు
వచ్చాడు.. అదీ
తనకు ఇష్టమైన పోలీస్ అవతారంలో
శ్రీహరి ఏమిటీ ! హీరో
ఏమిటీ! అని
నొసలు చిట్లించారంతా ఇక విలన్
వేషాలూ గోవిందా.. అన్నవాళ్ళు
ఉన్నారు. కానీ
పోలీస్ విడుదలయ్యాక ఆ మాట
మళ్లీ వినబడలేదు. పోలీస్
అంటే ఇలానే ఉండాలి అని పలువురి
ప్రశంసలు అందుకున్నాడు...
మన రియల్
స్టార్. అతను
కన్న కలలు సాకారమైనాయి..
ఇక మిగిలింది
సమాజ సేవ.. అని
తన కూతురు పేరిట ఓ ఫౌండేషన్
ఏర్పాటేచేశాడు. కొన్ని
గ్రామాలను దత్తతకు తీసుకుని
వాటికి నీటి సరఫరా చేస్తున్నాడు.
ఈ విధంగా సమాజ
సేవలోనూ తన ముద్ర వేసుకున్నాడు.
తను రాబోయే
రోజుల్లో రాజకీయాలోకి వస్తాని
చేప్పిన అనది కాలంలోనే
తిరిగిరాని లోకాలకు
వెల్లిపోయాడు.....!
''కమ్ముకుంటున్న
కారు మబ్బులు నిన్ను మింగేశాయని విర్రవీగుతున్నాయి రా...
నువ్వు
ఉదయించే సూర్యుడివని వాటికి
తెలియదు.... ఈరోజుఅస్తమించవచ్చు
గాక, ఈ
చీకటి బ్రతుకుని చీల్చుకుంటూ
మళ్లీపుడతావురా...
మళ్లీపుడతావ్...'''
మందల కృష్ణ రియల్ స్టార్ శ్రీహరి మృతిపై టపా బాగా వ్రాశారు!పథికులకు నీడనిచ్చే పచ్చని చెట్టులాంటి వాడు హీరో శ్రీహరి!అతి మద్యపానం అతని ఉసురు తీసింది!లివర్ చెడిపోయింది!నాకు మీ గుండె కళంతో ...బ్లాగ్ శీర్షిక నచ్చలేదు!అయితే అది కలంతో ఉండాలి లేదా గళంతో ఉండాలి!కాని మధ్యలో ఈ కళంతో ఏమిటి!?
ReplyDelete