Showing posts with label క్రీడ. Show all posts
Showing posts with label క్రీడ. Show all posts

Wednesday, 7 May 2014

కటక్ లో చెన్నై కటకట...!

కటక్: ఐపిఎల్-7లో భాగంగా పంజాబ్, చెన్నై మధ్య జరుగుతున్న మ్యాచ్ లో పంజాబ్ సూపర్ విక్టరీ సాధించింది.44పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. విధ్వంసకర మ్యాక్స్ వెల్ మరో సారి తన ప్రతాపాన్ని చూపించడంతో మొదటగా పంజాబ్ నిర్ణీత 20ఓవర్లకు 231పరుగులు చేసింది. మ్యాక్స్ వెల్ 38బంతుల్లోనే ఆరు ఫోర్లు, ఎనమిది సిక్సర్లతో 90పరుగులు చేసి తన విశ్వరూపం చూపించాడు. వీరేంద్ర సెహ్వాగ్ (30), మిల్లర్ (47), బేయిల్ (40) రాణించడంతో భారీ స్కోర్ చేయగలిగింది. 232పరుగుల అతి పెద్ద లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై కి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఐదు పరుగులకే ఆ జట్టు తొలి వికెటు కోల్పోయింది. డూప్లీయస్ ఒక్కడే 52 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. మిగతా బ్యాట్స్ మెన్స్ ఎవరూ రాణించక పోవడంతో 187పరుగులే చేయగలిగింది. పంజాబ్ బౌలర్లలో జాన్సన్ కి రెండు వికెట్లు దక్కాయి. 90పరుగులు ఒక్క వికెట్ తీసిన మ్యాక్స్ వెల్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.  

Sunday, 10 November 2013

క్రికెట్ పిచ్చోడు...



ముంబై: ఇండియా మ్యాచ్ లంటే అభిమానులు మొత్తం స్టేడియంలో కిక్కిరిసి పోతారు....! బంతి వికెట్ ను గిరాటేసినా..... బ్యాట్ బంతిని బాదినా స్టేడియం మొత్తం అభిమానుల హంగామా....అరుపులు చూస్తాం....! ఈ హంగామా, అరుపుల మధ్య ఓ క్రికెట్ పిచ్చోడు! ఒంటి నిండా జాతీయ జెండా రంగు...!చేతిలో రెపరెపలాడే మువ్వన్నెల జెండా! ప్రతీ షాట్ కి అతని చేతిలో జెండా రెపరెపలాడుతోంది... వికెట్ పడ్డప్పుడు...అదే జెండా నింగిలో సాలామ్ చేస్తుంది.... భారత క్రికెట్ మ్యాచ్ లు ఎక్కడ జరిగినా ఆ పిచ్చోడు ఆ స్టేడియంలో ఉంటాడు.... అతనే సుదీర్ చౌదరి....సచిన్ వీరాభిమానైన ఇతను భారత క్రికెట్ మ్యాచ్ లు ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోతాడు. ప్రతీ మ్యాచ్ ను ఆస్వాదిస్తాడు... ఆనందిస్తాడు.. మ్యాచ్ ఓడినప్పుడు కుంగిపోతాడు.
ఖర్చుమొత్తం అతనే....!
అయితే భారత మ్యాచ్ లంటే టికెట్లు దొరకవు, పైగా స్వదేశంలో అంటే అస్సలు దొరకవు . మరీ ఇతనికి ఏ విధంగా టికెట్ దొరుకుతాయని అందరికి సర్వసాధారణంగా డౌట్ వస్తుంది... అవును ఇతను ఎక్కడికి పోయినా ఆ ఖర్చును మొత్తం సచిన్ టెండూల్కర్ భరిస్తాడు. ఆ మ్యాచ్ లో సచిన్ ఉన్నా లేకున్నా సుదీర్ చౌదరి మాత్రం స్టేడియంలో ఉంటాడు.. ఇతనికి ప్రయాణ ఖర్చులు, స్టేడియం టికెట్ ఖర్చులు, మొత్తం సచిన్ చూసుకుంటాడు. దీంతో భారత మ్యాచ్ లు ఎక్కడ జరిగినా వింత వింత విన్యాసాలతో తనకున్న క్రికెట్ అభిమానాన్ని చాటుకుంటూ అప్పుడప్పుడు కెమరాకు క్లిక్ మనిపిస్తాడు.
నిద్రలేని రాత్రులు....

ప్రపంచ కప్ భారత్ గెలవాలని కలలు కన్నాడు సుదీర్ చౌదరి. కపిల్ సారథ్యంలో వచ్చిన కప్ మళ్లీ ఈ సారి భారత్ వశం కావాలని కోరుకునే వాడు. దానికి తగినట్టుగానే వరల్డ్ కప్ సమయంలో టీం ఇండియా కప్ గెలవాలని తన నెత్తిపై కప్ ఆకారంలో కటింగ్ చేయించుకున్నాడు... క్రికెట్ పై , దేశం పైఉన్న అభిమానమే తనను ఈ విధంగా చేయిస్తుందని చౌదరి చెప్తున్నాడు

క్రికెట్ రూపం మార్చుకుంటుందా....!


హైదరాబాద్: అంతర్జాతీయంగా క్రికెట్ రూపం మార్చుకుంటుంది... కొత్త కొత్త నిబంధనలతో క్రికెట్ సరికొత్తగా తయారవుతోంది. ఒకప్పుడు 5రోజుల క్రికెట్ అంటే కచ్చితంగా ఐదవ రోజు దాని ఫలితం తేలేది...కానీ ఇప్పుడు దాని రూపం మారింది. టెస్టు క్రికెట్ సైతం వన్టేలాగా తయారవుతోంది. ఇప్పుడున్న టెస్టు క్రికెట్ లు మూడు రోజుల్లో ఫలితాలు తేలిపోతున్నాయి. దీంతో అంతర్జాతీయ టెస్టు క్రికెట్ ఫాస్టు క్రికెట్ లాగా తయారైంది. దీనిపై చాలా మంది సీనియర్లు టెస్టు క్రికెట్ ను అంతరించిపోకుడా కాపాడాలని, అంతర్జాతీయ క్రికెట్ మండలికి ఎన్ని సలహాలు చేసినా టెస్టు ఉనికిని మాత్రం కాపాడలేకపోతున్నారు.
ఫాస్ట్ పుడ్ లా పొట్టి ఫార్మెట్...
టీ20ల వల్ల టెస్టు క్రికెట్ భవితవ్వం అంతరించిపోతుందనడంలో సందేహం లేదు... ధనాధన్ ఈ మార్ ధన్ లో దంచుడే పనిగా పెట్టుకుని నైతికతో కూడి ఆటను మర్చిపోతున్నారు. టీ20 ఫార్మెట్ అంటే 20 ఓవర్లలో ఎంత ఎక్కువ పరుగులు రాబట్టుకుంటే అంత విజయ అవకాశాలు ఉంటాయని వారి అభిప్రాయం. దీని తోనే ప్రతీ బాల్ ను బౌండరీ తరలించాలని కొట్టుడే పనిగా పెట్టుకున్నారు. దీంతో వన్డేలు, టెస్టు క్రికెట్ కు వచ్చేసరికి కనీసం గంట సేపు గీజులో నిలదొక్కుకోలేని పరిస్థితి నేటి ఆటగాళ్లలో ఉంది. ఈ క్రమంలో టెస్టులకు చాలా మంది ఆటగాళ్లు గుడ్ బై చెప్పి వన్టేలు.. టీ20 మాత్రమే ఆడుతున్న క్రికెటర్లు ఉన్నారు. ఈ మూడు గంటల టీ20లపై ఆదరణ అభిమానుల్లో రోజు రోజుకు ఎంత పెరుగుతుందో టెస్టు క్రికెట్ కు అంతే స్థాయిలో ఆదరణ తగ్గుతోందనడం విస్మరించలేము..
అదే కోరుకుంటున్న అభిమానులు....

నేటితరం క్రికెట్ అభిమానులు టీ20లను ఎక్కువగా ఆస్వాదిస్తున్నారు. నిమిషం సమయాన్ని కూడా వృధా చేయని ఈ రాకెట్ యుగంలో క్రికెట్ అభిమానులు ఎక్కువగా టీ20లపై ఎక్కువ మోజు పడుతున్నారు. టెస్టు క్రికెట్ లను , వన్డేలను మరిచి మరుగున పడేస్తున్నారన్నది పక్కా వాస్తవం...ఉదాహరణ కుతీసుకుంటే ఒకప్పుడు వన్డేలల్లో 300 పరుగులు చేస్తే... పక్కా విజయం అని నమ్మిన వారు. ఇప్పుడు 400మార్కు స్కోరును చేసినా విజయం వరిస్తుందో లేదో నని నమ్మకం లేదు. అంటే టీ20 ప్రభావం ఎంత ప్రభావం పడిందో మనం ఇక్కడ చూడోచ్చు... మరో వైపు ఓ ఫార్మెట్ నిరూపించుకున్న ఆటగాళ్లు ఇంకో ఫార్మెట్ లో నిరూపించుకోవడం లేదు. ఉదాహరణకు టీ20 స్పెషలిస్ట్ గా పేరు సంపాధించుకున్న యుసుఫ్ పఠాన్ లాంటి క్రికెటర్లు దనాధన్ క్రికెట్ లో కొద్దిగా మేరిసినా... తరువాత అన్ని ఫార్మెట్ లల్లో విఫలమయ్యారు. క్రికెటర్ అన్న వాడు అన్ని ఫార్మట్ లో రాణించాలి... ప్రతిభను ఉపయోగించుకోవాలి... క్రికెట్ ను ఆస్వాధించండీ.... టెస్టులను కాపాడండీ....!

Saturday, 2 November 2013

'వీ'రోహితం


                           డబుల్ సెచరీతో చెలరేగిన  రోహిత్ శర్మ....!

బెంగళూర్: భారత నయా ఓపెనర్ రోహిత్ శర్మ వీర విహారం చేశాడు.. ఆస్ట్రేలియా తో జరుగుతున్న ఏడో వన్డేలో డబుల్ సెంచరీ తో చెలరేగి పోయాడు. 158బంతులో 209 పరుగులు చేసి అంతర్జాతీయ క్రికెట్ లో డబుల్ సెంచరీ చేసిన మూడో క్రికెటర్ గా రోహిత్ రికార్డు సృష్టంచాడు.దీంతో సచిన్, సెహ్వాగ్ సరసన రోహిత్ నిలిచాడు. అయితే ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆసీస్ తన నిర్ణయానికి భారీ మూల్యం చెల్లించుకుంది.భారత ఓపెనర్స్ ఆస్ట్రేలియా బౌలర్స్ లకు చుక్కులు చూపిస్తూ భారీ భాగసామ్యాన్ని నెలకోల్పారు. దీంతో తొలి 19ఓవర్స్ లో ఓపెనర్స్ 112 పరుగులు సాధించారు. 60పరుగుల చేసిన ధావన్, డోహర్తి బౌలింగ్ లో వెనుదిరిగాడు. ఆతరువాత వచ్చిన విరాట్ పరుగులేమి చేయకుండా పెవిలియన్ చేరాడు. తరువాత వచ్చిన రైనా కాసేపు ఆ కట్టుకున్న పెద్దగా పరుగులు చేయలేక ఔటయ్యాడు. యూవరాజ్ సైతం మరో సారి విఫలమయ్యాడు. దీంతో ధోనీతో కలిసి రోహిత్ చక్కని ఇన్నింగ్స్ ను కొనసాగించాడు. ఎడా పెడా సిక్స్ లు ఫోర్లు కొడుతూ ఆస్ట్రేలియా బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. ఏకంగా ఇన్నింగ్స్ లో 16 సిక్స్ లు భాదిన ఏకైక క్రికెటర్ గా రోహిత్ రికార్డుల కెక్కాడు.
సిసలైన ఇన్నింగ్...

'' ప్రతిభ ఉంది కానీ నిర్లక్ష్యం …! ఆడగలడు కానీ నిలదొక్కుకోలేడు..!ఎన్ని అవకాశాలు ఇచ్చిన నిరూపించుకోడు...! ఇది నిన్నమెన్నటి వరకు రోహిత్ పై తరుచు వినిపించే విమర్శలు . తన ప్రతిభను చూసిన క్రికెటర్లు ఇతన్ని ప్రోత్సహించారు. ఐపిఎల్ లో అద్భుతాలు చేసి భారత జట్టులోకి వచ్చిన రోహిత్ నిజంగా విమర్శలు తగ్గట్టే ఉండేవాడు. నిలకడలేమి ! ఎన్ని అవకాశాలు ఇచ్చిన నిరూపించుకోక పోవడం ఇలా రోహిత్ ప్రస్థానం సాగింది. కానీ భారత జట్టుకు సీనియర్స్ ఓపెనర్స్ దూరం కావడంతో వారి స్థానాలను భర్తి చేయడానికి రోహిత్ ఓపెనర్ అవతారమెత్తాడు. ఈ అవకాశాన్ని రెండు చేతుల ఓడిసి పట్టుకున్న రోహిత్ దానికి తగ్గట్టుగానే రానిస్తూ మన్ననలు అందుకున్నాడు. దీనికి తోడు ఆస్ట్రేలియా తో జరుగుతున్న ఏడు వన్డేల సిరీస్ కు ఓపెనర్ గా శివతాండవం చేస్తున్నాడు.    

Friday, 1 November 2013

వెస్టిండీస్ సిరీస్ కు కుర్రాళ్లు...


ముంబై: వెస్టిండీస్ తో జరగనున్నటెస్టు సిరిస్ కు భారత జట్టును బుధవారం బిసిసిఐ ప్రకటించింది. ఈ జట్టులో మొత్తం కుర్రాలకు చోటు కల్పిస్తూ బిసిసిఐ టీం ను ప్రకటించింది. అయితే సచిన్, ధోనీ తప్పా ఈ సిరిస్ ఎవరూ టెస్టు అనుభవం లేక పోవడం విశేషం. అయితే వన్డేలోనూ దుమ్ము దులుపుతున్న కుర్రాళ్లు టెస్టుల్లోను ఏ విధంగా రాణిస్తారో చూడాలి...!
సెహ్వాగ్, గంభీర్ లకు దక్కని చోటు..
అయితే టెస్టు సిరిస్ కు భారత జట్టులోకి సీనియర్స్ ని తీసుకుంటారని అందరు భావించారు. ఈ అనుమానాలను పటాపంచలు చేస్తు బిసిసిఐ టీం ను ప్రకటించింది. దీంతో భారత జట్టులోకి మళ్లీపునరాగమనం చేయాలనుకున్న సెహ్వాగ్ , గంభీర్ లకు నిరాషే మిగిలింది.
మరో సారి నమ్మకం...
ఇటీవల పేలవ ఫాం లేమితో భాద పడుతున్న ఇషాంత్ షర్మకు సెలక్టర్స్ మరో అవకాశాన్ని ఇచ్చారు. ఒక్క సారి విఫయమైనంత మాత్రాన ప్రతిభ ఉన్న ఆటగాళ్లను పక్కకు పెట్టాల్సిన పని లేదని బిసిసిఐ తెలిపింది. మరో ఆటగాడు రోహిత్ షర్మ ఇతను వన్డేలో ఓపెనర్ గా దూసుకుపోతున్నాడు. అయితే ఇతను పై నమ్మక ముంచిన సెలక్షన్ కమిటి టెస్టులోను తన సత్తా చాటుకుంటాడని భావిస్తున్నారు.
సచిన్ కు చివరి టెస్టు సిరీస్ ...
ఇక సచిన్ సెలక్షన్ చేయడం సెలక్షన్ కమిటికి ఉండక పోవచ్చు సచిన్ ఈ సిరిస్ తరువాత అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్తాడన్న సంగతి తెలిసిందే. అయితే దీన్ని దృష్టింలో పెట్టుకుని సెలక్షన్ కమీటీ మొత్తం యువకుల తో కూడిన జట్టును ప్రకటించింది . దీంతో మంచి ఫాం కొనసాగిస్తున్న కుర్రాలతో , ఇదే ఊపును టెస్టు సిరిస్ లో కొనసాగించి సచిన్ కు సగౌర్వంగా వీడ్కోలు పల్కాలని జట్టు యోచిస్తుంది .

జట్టు వివరాలు. ధోనీ( కెప్టెన్) ధావన్, రోహిత్ , పుజారా, సచిన్, కోహ్లీ, రహానే, విజయ్, భువనేశ్వర్, ఇషాంత్ , అశ్విన్, ఓజా, మిశ్రా, షమీ, ఉమేష్ యాదవ్.,

Saturday, 12 October 2013

''ఇక ఆడలేను అలసి పోయాను....!


హైదారబాద్ : భారత క్రికెట్ చరిత్రలో ఒక శకం ముగీయనుంది. పరుగుల రారాజు..! క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ టెస్టు ఫార్మాట్ కు గుడ్ బై చెప్పనున్నాడు.. ఈ నిర్ణయమై బిసిసిఐ తో చర్చించి తన నిర్ణయాన్ని ప్రకటించాడు..అయితే 2012లో వన్డే క్రికెట్ కు వీడ్కోలు పలికిన సచిన్...ఎన్నో రికార్డులు, మరెన్నో అవార్డులు అందుకున్నాడు... 16ఏళ్ల ప్రాయంలో తన కెరీర్ ను ప్రారంభించిన సచిన్ ఎవ్వరికి అందని ఎత్తుకు ఎదిగాడు .. 198టెస్టు మ్యాచ్ లు ఆడిన సచిన్ టెండూల్కర్ 200 వ టెస్టు మ్యాచ్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నాడు. అయితే క్రికెట్ లేని జీవితాన్ని ఊహించుకోవడం కష్టమని తెలిపాడు. తన సుదీర్ఘ కెరీర్ కు సహాకరించిన అభిమానులకు , బిసిసిఐ కి, మరియు కుటుంబ సభ్యులకు అతను కృతజ్ఞతలు తెలిపాడు.
సచిన్ లేని స్థానాన్ని ఊహించగలమా....!
దిగ్గజ క్రికెటర్లు రాహుల్ ద్రావిడ్ , వివిఎస్ లక్ష్మణ్, సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ తరువాత భారత జట్టును ఊహించలేము. అయితే ఇప్పుటికే వివిఎస్, రాహుల్ ద్రావిడ్ భారత క్రికెట్ కు గుడ్ బై చెప్పగా..!సచిన్ మాత్రం ఇన్నాళ్లు ఆటను ఆస్వాధిస్తు కొనసాగాడు. అయితే సచిన్ తరువాత భారత జట్టులో ఆస్థానాన్ని భర్తీ చేయలగల సమర్థుడు దాదాపు లేరనే చెప్పాలి.. భవిష్యత్తులో సచిన్ రికార్డులను తిరగ రాసే వారు ఉండరని చెప్పాలి... ఎందుకంటే.. ట్వీ20క్రికెట్ వచ్చిన తరువాత ఆటలోను, ఆటగాళ్లలోనూ భారీ తేడా వచ్చింది. దాదాపు అతి తక్కువ సమయంలో ఎక్కువ పరుగులు చేయాలి అనే భావంతో నేటి క్రిడా కారులు ఉన్నారు. దీంతో నేడు టెస్టు క్రికెట్ ఆడే ఆటగాళ్లు వేళ్ల మీద లెక్క పెట్టాల్సిన పరిస్థితి మన భారత క్రికెట్ లో ఉంది. ఒక్క క్రికెటర్ కూడా గంట పాటు గ్రీజులో ఉంటే అతి పెద్ద గొప్పే అవుతోంది. మరీ ఇలాంటి పరిస్థితిలో ఐదు రోజుల సాంప్రదాయ క్రికెట్ లో నిలదొక్కుకుని ఆడే ఆటగాళ్లను బూతద్దం పెట్టి వెతికినా దొరకనే చెప్పాలి..!అయితే ద్రావిడ్ , సచిన్ , లక్ష్మణ్ లాంటి వారు టెస్టు క్రికెట్ కు చేసిన సేవ అమోహం. భారత టెస్టుక్రికెట్ వారు ఐకాన్ ప్లేయర్ గా ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు వాళ్లు భారత క్రికెట్ కు చేసిన సేవ...
సచిన్ ప్రస్థానం....!
ప్రపంచ క్రికెట్ చరిత్రలో ప్రఖ్యాతి గాంచిన భారత ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా భారత 'బ్రాడ్ మెన్' సచిన్ టెండూల్కర్ అనే చెప్పాలి.చిన్న పిల్లల మొదలు పండు ముసలి దాక సచిన్ ఓ ఆదర్శంగా ఉన్నాడు. అయితే 1973లో జన్మించిన ఇతను 16ఏళ్ల ప్రాయంలో ప్రపంచ క్రికెట్ కు పరిచయమైయ్యాడు. ఈనాడు భారత్ అనధికార జాతీయ ఆటగా కొనసాగుతుందంటే క్రికెట్ దేవుడి పాత్ర మరువరానిది. అయితే భారత జట్టుకు ఎన్నో విజయాలు అందజేసిన ఈ ముంబయి కి చెందిన బ్యాట్ మెన్ ను పొగడని వారు ఉండరు.. అతను మైదానంలోకి అడుగు పెడుతున్నాడంటే చాలు రికార్డులు బద్దలు కొట్టాల్సిందే.. బౌలర్లకు అతని బ్యాట్ ఒక యమ పాషంలా కనిపించేది. ఫీల్డర్లకు ఆ బంతి బయంకరంగా దూసుకోచ్చేది. అలాంటి దిగ్గజం క్రికెట్ కు దూరమౌతున్నాడంటే క్రికెట్ అభిమానుల గుండెలు బద్ధలు కాక తప్పదు మరీ...


ఐ మిస్సుయు సచిన్....!

Sunday, 6 October 2013

ఇద్దరు స్టార్లు కలిసిన వేల....!!!




ఢిల్లీ: ఇద్దరు ఆల్ టైం గ్రేడ్ క్రికెటర్లు కలిస్తే....! అభిమానులకు పండగే...! అలాంటి అరుదైన సంఘటన ఢిల్లీ ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో జరిగింది. వెస్టిండీస్ ఆల్ టైంగ్రేట్ బ్రియన్ లారా...!మరొకరు ఇండియన్ గాడ్ సచిన్ టెండూల్కర్ ..!ఇద్దిరు స్టేడియంలో ఒకరి పై ఒకరు పొగడ్తల వర్షం కురిపించుకున్నారు. తనకు లారా అంటే చాలా ఇష్టమని తన బ్యాటింగ్ విన్యాసాలతో తనును మయిమరిపించాడని సచిన్ వ్యాఖ్యనించారు..!!లారాను మొదటి సారిగా 1989లో చూశానని అప్పుడు తన బ్యాటింగ్ చూసుకుంటు ఉండిపోయానని గుర్తు చేసుకున్నాడు... మరో వైపు లారా సైతం సచిన్ గురించి ప్రస్తావిస్తు సచిన్ నేటి యువ క్రికెటర్లకు ఎంతో ఆదర్శ ప్రాయుడని తెలిపారు.. నిత్యం ఆటను ఆస్వాదించే సచిన్ అంటే తనకు ఎంతో ఇష్టమని కొనియాడారు... ఈ విదంగా ఇద్దరు గ్రేడ్లు ఒకరి గురించి ఒకరు ప్రస్తావించుకుంటు పాత జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు. ఈ సంఘటన స్టేడియంలోని అభిమానులకు , ఇటు టీవీ ప్రేక్షకులకు చూడముచ్చటగా అనిపించింది..!

Friday, 20 September 2013

ఐపిఎల్ జోరు కొనసాగుతుందా....!


రాంచీ: ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్ జట్టు సభ్యులు 2013 చాంపియన్ లీగ్ కు సన్నాహకాలు ప్రారంభించింది. ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్ రాంచీ లో తన తొలి మ్యాచ్ ఆడ నుంది. అయితే ఇప్పటికే ధోనీ బృందం రాంచీలో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. అయితే ట్వీ20 మ్యాచులో మొదటి సారి రాంచీ స్టేడియంలో ధోనీని ఆయన అభిమానులు వీక్షించనున్నారు. తన సొంత నగరంలో రాంచీ లో ధోనీకి పెద్ద యెత్తున అభిమానులు ఉన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ రాంచీలో మూడు మ్యాచ్ లు ఆడనుంది. మొదటి మ్యాచ్ లో ఈ నెల 22వ తేదీన దక్షిణాఫ్రికా టైటాన్స్ తో తలపడనుంది.
 

వంద శాతం అర్హుడు... గుంగూలీ..


కోల్ కతా: భారత ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ మళ్లీ ఇండియా జట్టులోకి రావడం ఖాయమని భారత మాజీ కెప్టెన్ సౌరప్ గంగూలీ అన్నారు. యువరాజ్ తన ఫామ్ అందుకోవడం తనకు ఆశ్చర్యానికి గురిచేయలేదని తెలిపాడు.. యువి అప్పటికి ఇప్పటికి గొప్ప క్రికెటరని కొనియాడారు. అయితే ప్రస్తుతం కుర్రాలతో కూడిన జట్టు భాగుందని అదే విధంగా యువి కూడా మిడిలార్డర్ లో కీలకంగా కానున్నాడని వివరించారు.
గంగూలీ పేస్ లకు అవార్డులు...

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ, టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ లకు ప్రభుత్వం జీవిత సాఫల్య పురస్కారాలను ప్రధానం చేయనుంది. ఈ అవార్డును ఎంపిక ఆనందం వ్యక్తం చేసిన దాదా నా జీవితంలో ఇది గొప్ప సాఫల్యం అన్నాడు. వయస్సు పై పడుతున్నా... పేస్ అద్భుతఫామ్ ను కొనసాగిస్తుండటంపై స్పందిస్తూ... 40 అనేది ఓ సంఖ్య మాత్రమే నేనైతే ఇంకా చాలాకాలం ఆడాలని అంటా నని అతని ఫిట్ నెస్ ను కొనియాడాడు. ఈనెల 28న జరిగే ప్రత్యేక కార్యక్రమంలో దాదా, పేస్ లకు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ పుట్ బాల్ కోచ్ సభాష్ బో వ్రిక్ కు గురు రత్న అవార్డును అందజేస్తారు..  

Wednesday, 11 September 2013

సిఎల్టీ20కి పాక్ ఔట్...




బెంగళూర్: ఛాంపియన్స్ లీగ్ టీ20 2013టోర్నమెంట్ ప్రారంభానికి ముందే పాకిస్తాన్ కి షాక్ తగిలింది. భారత ప్రభుత్వం వీసా నిరాకరించడంతో పాకిస్తాన్ ఛాంపియన్స్ లీగ్ లో పాలు పంచుకోవడంలేదు. పాక్ కు చెందిన జట్టుకు వీసా ఇవ్వక పోవడం ద్వారా ఛాంపియన్స్ లీగ్ నిర్వామకులకు ఎదురు దెబ్బతగిలింది. సిఎల్టీ 20 కి పాకిస్తాన్ జట్టు పైసలాబాద్ వోల్వ్స్ అర్హత సాధించింది. ఈ జట్టుకు మిస్భావుల్ హక్ సారథ్యం వహిస్తున్నాడు. అయితే ఆ జట్టు ఆటగాళ్లుకు భారత ప్రభుత్వం తాజాగా వీసానిరాకరించింది. దీంతో ఆ జట్టు టోర్నీ నుంచి వైదొలగింది. అయితే దీనికి కారణం లేకపోలేదు.. భారత పాక్ సరిహద్దుల్లో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో పాక్ ఆటగాళ్లుకు వీసాలు నరాకరించినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత పరిస్థితిలో పాక్ ఆటగాళ్లుకు భద్రత కల్పించడం పెద్ద సమస్య అవుతోందని ప్రభుత్వం భావిస్తోంది

పరుగుల దాహంతో ఉన్నాడు...



ఢిల్లీ: రెండేళ్ల నుంచి సచిన్ ఖాతాలో సెంచరీలు లేకపోవడంతో , సింహం ఆకలితో ఉన్నట్టే నని భారత మాజీ ఓపెనర్ చేతన్ చౌహాన్ అభిప్రాయపడ్డాడు. మాస్టర్ వయస్సు మీదపడుతున్నా తనలో ఇంకా క్రికెట్ ఆడే సత్తా ఉందని తెలిపాడు. తన రిటైర్మెంట్ పై వస్తున్న ఊహాగానాలను కొట్టిపారేశారు. ఈవిషయాన్ని సచిన్ కే వదిలేయాలని ఆయన అన్నారు. మరో వైపు భారత జట్టులోకి సీనియర్ ఆటగాళ్లు సెహ్వాగ్, గంభీర్, జహీర్ లు మళ్లీ జట్టులోకి వస్తారని ఆశాభావం వ్యక్తంచేశారు. కోహ్లీలో చక్కని క్రికెటర్ ఉన్నాడని అతను మునుముందు దేశానికి మంచి పేరు సంపాదిస్తాడని అన్నాడు. అతన్ని భావి కెప్టెన్ గా చౌహాన్ అభివర్ణించాడు.  

చాన్స్ ను అందిపుచ్చుకుంటారా...!


ముంబై: ఒంటి చేత్తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చగల ఆటగాళ్లు..! జట్టుకు ఎన్నో చిరస్మరణీయమైన విజయాలందించిన దిగ్గజాలు ! కానీ నేడు జట్టులో చోటుకోసమే పోరాడాల్సిన పరిస్థితి.. ఫామ్ లేమితో టీం ఇండియాలో చోటు కోల్పోయిన సీనియర్లు జహీర్, గంభీర్, సెహ్వాగ్, వీరు ముగ్గురు తిరిగా జట్టులోకి రావాలని తీవ్రంగా శ్రమిస్తున్నారు. దీని కోసం విదేశాల్లో శిక్షణ పొంది వచ్చారు. కానీ వీళ్లు ఒకప్పుడు జట్టులో స్టార్ ఆటగాళ్లుగా వెలుగు వెలిగారు. ఒకరు 2011ప్రపంచ కప్ లో బౌలింగ్ విభాగంలో పెద్దన్న పాత్ర పోషించాడు. గంభీర్, సెహ్వాగ్ ప్రపంచలోనే అత్యుత్తమ ఓపనింగ్ బ్యాటింట్స్ మెన్ గా పేరుతెచ్చుకున్నారు. కానీ వారి ఉనికి కనుమరుగైపోతోంది. జాతీయ జట్టులోకి రావడానికి శ్రమించాల్సివస్తుంది. జట్టులో కుర్రాల్ల పోటీ ఎక్కువగా ఉండటంతో ఎంతటి ఆటగాడైనా ఫామ్ లేకపోతే జట్టునుంచి ఉద్వాసన తప్పడంలేదు. మాజీలు మాత్రం సీనియర్ల సేవలను మరవోద్దంటూ చేసిని ప్రకటనకో! లేక మరే అవకాశమో! తెలియదు కానీ... సీనియర్లకు మరో చాన్స్ బిసిసిఐ ఇచ్చింది. త్వరలో స్వదేశంలో జరిగే వెస్టిండీస్ సిరీస్ కోసం భారత్ ఎ జట్టుకు బిసిసిఐ ప్రకటిచింది. ఇందులో సీనియర్ ఆటగాళ్లకు పిలుపునిచ్చింది.
ఇద్దరి మధ్యే పోటీ....
భారత ఓపెనింగ్ బ్యాట్ మెన్ గా పేరు ప్రక్యాతలు తెచ్చుకున్న ఢిల్లీ బాంబులు....సెహ్వాగ్, గంభీర్ ల మధ్యే పోటీ ఉంటుంది. ఎందుకంటే, ఇప్పటికే భారత జట్టులో ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ గా నయ సంచలనం ధావన్ ఇరగదీస్తున్నాడు. అయితే ఇతనికి రెండో ఎండ్ లో మరో ఓపెనర్ పెద్దగా రాణించక పోవడంతో వారి స్థానంలో గంభీర్, లేదా సెహ్వాగ్ ఎంపికయ్యే అవకాశం ఉంది. కానీ ఇద్దరు మళ్లీ ఓపెనింగ్ గా చూడాలంటే వారు వెస్టిండీస్ తో జరగనున్న అనధికార మ్యాచ్ లో మాత్రం రాణించాల్సి ఉంటుంది.
జహీర్ ఈజీ చాన్స్...

గత కొద్దికాలంగా ఫిట్ నెస్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్న జహీర్ ఖాన్ కు తిరిగి భారత జట్టులోకి రావడానికి మార్గం సుగమంగానే కనిపిస్తోంది. పేస్ బౌలింగ్ విభాగానికి సరైన నాయకుడు లేకపోవడంతో జహీర్ కు చోటు కాయంగా కనిపిస్తుంది

ఒలింపిక్ కొత్త అధ్యక్షుడు...




దుబాయ్: అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం నూతన అధ్యక్షుడిగా జర్మనీకి చెందిన 59ఏళ్ల థామస్ బాచ్ ఎన్నికయ్యారు. మాజీ అధ్యక్షుడు జాక్వస్ రోగే స్థానంలో ఈయన నియమితులులయ్యారు. అయితే ఈయన ఈ పదవిలో కనీసం ఎనిమిదేళ్లు కొనసాగే అవకాశం ఉంది.

కొత్త చరిత్ర....సెరెనా.



న్యూయార్క్: ఈ టోర్నిలో కచ్చితమైన ఫేవరెట్ గా బరిలోకి దిగిన ప్రపంచ నంబర్ వన్ సెరెనా అంచనాలను నిజం చేసింది. గత ఏడాది ఫైనల్లో నమోదైన ఫలితాన్ని పునరావృతం చేసింది. వరుసగా రెండో ఏడాది అజరెంకాను ఓడించింది. ఐదోసారి యూఎస్ ఓపెన్ టైటిల్ ను హస్తగతం చేసుకుంది. ఈ క్రమంలో ఓపెన్ శకం మొదలయ్యాక యూఎస్ ఓపెన్ టైటిల్ నెగ్గిన పెద్ద వయస్కురాలిగా సెరెనా 31ఏళ్ల 347 రోజులు కొత్త చరిత్ర సృష్టించింది. ఇంతకాలం మార్గరెట్ కోర్ట్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది

ద్రావిడ్ పాఠాలు...



బెంగళూరు: భారత జట్టుకు రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం ద్రావిడ్ సమాజ సేవతో తన వంతుగా దూసుకుపోతున్నాడు. తనలో ఉన్న గొప్పక్రికెట్ లక్షణాలను ఇతరులకు అంధించాలని తపనే తనను ముందుకు నడిపిస్తోంది. ఈ స్టార్ ఆటగాడు 25 మంది అనాథ పిల్లలకు క్రికెట్ మెళకువలు నేర్పించాడు. మంగళవారం ఏర్పాటు చేసిన క్యాంప్ విత్ ద చాంప్, కార్యక్రమంలో భాగంగా అతను రోజంతాయ పిల్లలకు క్రికెట్ పాఠాలు చెబుతూ గడిపాడు ఈ ఎస్ పీ ఎన్ క్రిక్ ఇన్ఫో, టెలికామ్ బ్రాండ్ ఐడియా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఆటకు సంబంధించిన ప్రాథమికాంశాలను నేర్చుకోవాలనుకునే వారికి నియమ నిబంధనలను తెలియజేస్తూ కొన్ని వీడియోలను రూపొందించారు. మరో వైపు సెహ్వాగ్ , జహీర్, గంభీర్ లాంటి సీనియర్ ఆటగాళ్లు జాతీయ జట్టులోకి తిరిగి వస్తారని ద్రావిడ్ అశాభావం వ్యక్తం చేశాడు. విండీస్ తో తలపడే భారత్ '' జట్టులో ఈ ముగ్గురికి చోటు దక్కింన సంగతీ తెలిసిందే. అయితే ఈ అవకాశాన్ని వాళ్లు సద్వినియోగం చేసుకోవాలని సూచించాడు

సత్తా చాటేందుకు మరో చాన్స్...



విశాఖ: ఫామ్ లేమితో భారత జట్టుకు దూరమైన సీనియర్ ఆటగాళ్లు యువరాజ్, సెహ్వాగ్, గంభీర్, జహీర్ ఖాన్, తమ సత్తా చాటేందుకు మరో చాన్స్ రానుంది... సొంత గడ్డపై వెస్టిండీస్ -ఎ తో జరగనున్న అనధికార టెస్టు, వన్డే, మ్యాచ్ లకోసం ఈస్టార్ ఆటగాళ్లకు మరో చాన్స్ ఇవ్వాలని బిసిసిఐ బావించింది. దీనిలో భాగంగా... మొత్తం మూడు టెస్టులకు గానూ, రెండు టెస్టులకు గౌతమ్ గంభీర్, సెహ్వాగ్, జహీర్ ఖాన్ లకు ఎంపిక చేశారు. మూడు టెస్టులకు గానూ కాశ్మీర్ అల్ రౌండర్ పర్వేజ్ రసూల్ ఒక్కడే ఎంపికయ్యారు. వన్డే జట్టు కెప్టెన్ గా యువరాజ్ సింగ్ వ్యవహరించనున్నాడు. అయితే ఈ సిరీస్ లు ఇప్పుడు సెప్టెంబర్ 15నుంచి 21వరకు బెంగళూరు లో జరగనున్నాయి. అదే నెల 25నుంచి అక్టోబర్ 12 వరకు మైసూర్ షిమోగా, హుబ్లీలలో జరగనున్నాయి.  

Sunday, 8 September 2013

ఇప్పట్లో సచిన్ రిటైర్ కాడు...రవిశాస్త్రి..

ముంబై: అభిమానుల కోరిక మేరకు సచిన్ టెండూల్కర్, వచ్చే ఏడాది ఇంగ్లాండ్ తో జరిగే లార్డ్స్ టెస్టు వరకు కొనసాగుతాడని భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి అన్నారు. అయితే సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ పై వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో రవిశాస్త్రి ఇలాంటి సంచలన వ్యాఖ్యాలు చేశాడు. ముంబై లో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన రవిశాస్త్రి మీడియాతో మాట్లాడారు.. సచిన్ టెండూల్కర్ ఆటను కొనసాగించాలని అన్నారు. వచ్చే ఏడాది సచిన్ లార్డ్స్ లో ఆడాలనుకుంటున్నాడని ఆయన తెలిపారు. కాగా మరో మాజీ భారత క్రికెట్ క్రీడా కారుడు కపిల్ దేవ్ సినియర్లు తమ వ్యక్తి ప్రయోజనాలు పక్కన పెట్టి రిటైర్మెంట్ పై నిర్ణయం తీసుకోవాలనడం గమనార్హం...


భారత్ తో సిరీస్ లేక పాక్ విలవిల....



ఇస్లామాబాద్: భారత్ పాకిస్తాన్ మ్యాచ్ లు లేకపోవడంతో పాకిస్తాన్ బోర్డు ఆర్థికంగా భారీగా నష్ట పోయింది. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ లంటే అభిమానులకు ఎప్పుడు పండగే... అయితే ముంబై బాంబు పేలుళ్ల తర్వాత ఆ దేశంతోగానీ ఆ దేశ వేదికలపై ఆడవద్దని భారత క్రికెట్ బోర్డు నిర్ణయించింది. దీంతో 2008 నుంచి పాకిస్తాన్ ద్వైపాక్షిక సిరీస్ లు జరగలేదు. దీంతో పాకిస్తాన్ బోర్డు కు భారీగా నష్టం వాటిళ్లిందని ఆ దేశం క్రికెట్ బోర్డు వెళ్లడించింది. గత డిసెంబర్ లో భారత పర్యటనలో ఎలాంటి లాభాపేక్ష లేకుండా సిరీస్ ఆడామని ఆ తర్వాత కనీసం తటస్ట వేదికలపై అయినా సిరీస్ ఆడదామంటూ ప్రతిపాదించినా భారత్ నుంచి స్పందన రాలేదని వివరించారు. ద్వైపాక్షిక సిరీస్ ఆడేందుకు భారత్ తిరస్కరించడం వల్ల ప్రసార కర్త దుబాయ్ కు చెందిన తాజ్ ఎంటర్ టైన్ మెంట్ నెట్ వర్క్ చానెల్ కు పిసిబి 10.5కోట్లు చెల్లించాల్సిఉంటుంది

Saturday, 7 September 2013

హుర్రే....ముర్రే...!


న్యూయార్క్: యుఎస్ ఓపెన్ లో అతిపెద్ద సంచలనం పురుషుల సింగిల్స్ డిఫెండింగ్ చాంపియన్ ఒలింపిక్ హీరో ఆండీ ముర్రేకు షాక్ హాట్ ఫేవరేట్ గా టైటిల్ నిలబెట్టుకుంటాడనుకున్న అందరి అంచనాలను తారుమారు చేస్తూ...ఈ బ్రిటన్ కింగ్ క్వార్టర్స్ లోనే ఇంటిబాట పట్టాడు స్విట్జర్లాండ్ కు చెందిన టాప్ టెన్ ఆటగాడు స్టానిస్లాస్ వారింకా 6-4, 6-3,తో విబుల్డన్ విజేత, మూడో సీడ్ ముర్రేను బోత్తాకొట్టించి సంచలన విజయాన్ని అందుకున్నాడు. గతంలో ఫెదరర్, జొకోవిచ్ లాంటి స్టార్లను చిత్తుచేపసిన ముర్రే ఇక్కడ మాత్రం వారింకా ధాటికి వరుససెట్లలో కంగుతిని టోర్నీ నుంచి నిరావగా నిష్ర్కమించాడు. రెండు గంటలా 15 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్ లో ఆరంభసెట్ మినహా మరేదశ లోనూ వారింకాకు పోటీ ఇవ్వలేకపోయిన ముర్రే...మ్యాచ్ లకు గాను ఇలా ఒక్క బ్రేక్ పా యింట్ ను కూడా దక్కించుకోకపోవడం ముర్రే 15 విన్నర్లతో సిరిపెట్టుకోగా,, వారింకా ఏకంగా 45 విన్నర్లతో విరుగుకుపడ్డాడు. వరుసగా గత ఆరు గ్రాండ్ స్లామ్స్ లో సెమీఫైనల్ చేరిన ముర్రేకిదే అత్యంత చెత్త ప్రదర్శన కూడా ఈ ఏడాది. ఆరంభ గ్రాండ్ స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ లో రన్నరప్ గా నిలిచిన ముర్రే గాయంతో ఫెంచ్ ఓపెన్ కు దూరమైనా వింబుల్డన్ లో విజేతగా నిలిచి అద్భుతఫామ్ తో యుఎస్ ఓపెన్ లో అడుగుపెట్టాడు. కానీ ఇక్కడ ఏమాత్రం అంచనాలు లేని తొమ్మిదోసీడ్ వారింకా దెబ్బకు చిత్తయ్యాడు వారింకాకిదే తొలి గ్రాండ్ స్లామ్ సెమీ ఫైనల్ కావడం విశేషం. శనివారం జరిగే సెమీస్ లో తనకు ఎదురుపడతాడనునకున్న ముర్రే నిష్క్రమణతో టాప్ సీడ్ జొకోవిచ్ కు ఫైనల్ ప్రపంచ నెంబర్ వన్ నొవాక్ జొకోవిచ్ తో వారింకా అమీతుమి తేల్చుకోనున్నారు.
జొకోజోరు....

ఇక సోమీస్ లో తనకు ఎదురుపడతాడనుకున్న ముర్రే నిష్ర్కమణతో టాప్ సీడ్ జొకోవిచ్ కు ఫైనల్ మార్గం సులువైనట్లే ఈ సెర్భియా యోధుడు టోర్నీలో తన జైత్రయాత్రను కొనసాగిస్తూ క్వార్ట ర్ ఫైనల్ లో అధిగమించి 2011 విన్నర్ అయిన జొకోవిచ్ 6-3 రష్యా 6-2, 3-6, 6-0 తో రష్యాకు చెందిన 21వ సీడ్ మైకేల్ యోజ్నీపై విజయంసాధించి సెమీఫైనల్లో ప్రవేశించాడు. జొకో కింది వరుసగా 14వ గ్రాండ్ స్లామ్ సెమీస్ కావడం విశేషం కాగా. తొలిసారి గ్రాండ్ స్లామ్ సెమీస్ చేరిన వారింకాతో ముఖా ముఖి పోరులో 11-2 రికార్డుతో జొకోవిచ్ దే ముందంజ అందులోనూ, గతేడాది ఇక్కడే నాలుగో రౌండ్లో జొకో చేతిలో ఓడిన వారింకాకు ఈ సీజన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ లో నూ సెర్భియా స్టార్ చేతిలో పరాభవమే ఎదురైంది. ఆ తర్వాత జరిగిన రెండు గ్రాండ్ స్లామ్స్ లోనూ క్వార్టర్స్ దాటలేకపోవడం వారింకాకు ప్రతికూలాంశమే ఈ నేపథ్యంలో జోరుమీదున్న జొకోవిచ్ ను వారింకా ఏ మేరకు ప్రతిఘటిస్తాడన్నది వేచిచూడాలి. మరో సెమీఫైనల్లో స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ తో ఫ్రాన్స్ సీడెడ్ క్రీడాకారుడు రిచర్డ్ గాస్కెట్ తలపడనున్నాడు

Friday, 6 September 2013

ధూమపాన నియంత్రన ప్రచారకర్త..ద్రావిడ్.



న్యూఢిల్లీ: మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ కొత్త అవతార మెత్తాడు. జాతీయ పొగాకు ఉత్పత్తుల వాడకానికి వ్యతిరేకంగా ద్రావిడ్ ప్రచార కర్తగా వ్యవహరించనున్నాడు. ఈ మేరకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ' ఈ సందర్భంగా కుంటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి సీకే మిశ్రా మాట్లాడుతూ.... ధూమపానాన్ని నియంత్రించలేకపోతున్నామని ఆయన అన్నారు. తాము అనుకున్న లక్ష్యాలను చేరుకునే వరకు దీనిపై తమ పోరాటం కొనసాగిస్తామని అన్నారు