Sunday 10 November 2013

క్రికెట్ పిచ్చోడు...



ముంబై: ఇండియా మ్యాచ్ లంటే అభిమానులు మొత్తం స్టేడియంలో కిక్కిరిసి పోతారు....! బంతి వికెట్ ను గిరాటేసినా..... బ్యాట్ బంతిని బాదినా స్టేడియం మొత్తం అభిమానుల హంగామా....అరుపులు చూస్తాం....! ఈ హంగామా, అరుపుల మధ్య ఓ క్రికెట్ పిచ్చోడు! ఒంటి నిండా జాతీయ జెండా రంగు...!చేతిలో రెపరెపలాడే మువ్వన్నెల జెండా! ప్రతీ షాట్ కి అతని చేతిలో జెండా రెపరెపలాడుతోంది... వికెట్ పడ్డప్పుడు...అదే జెండా నింగిలో సాలామ్ చేస్తుంది.... భారత క్రికెట్ మ్యాచ్ లు ఎక్కడ జరిగినా ఆ పిచ్చోడు ఆ స్టేడియంలో ఉంటాడు.... అతనే సుదీర్ చౌదరి....సచిన్ వీరాభిమానైన ఇతను భారత క్రికెట్ మ్యాచ్ లు ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోతాడు. ప్రతీ మ్యాచ్ ను ఆస్వాదిస్తాడు... ఆనందిస్తాడు.. మ్యాచ్ ఓడినప్పుడు కుంగిపోతాడు.
ఖర్చుమొత్తం అతనే....!
అయితే భారత మ్యాచ్ లంటే టికెట్లు దొరకవు, పైగా స్వదేశంలో అంటే అస్సలు దొరకవు . మరీ ఇతనికి ఏ విధంగా టికెట్ దొరుకుతాయని అందరికి సర్వసాధారణంగా డౌట్ వస్తుంది... అవును ఇతను ఎక్కడికి పోయినా ఆ ఖర్చును మొత్తం సచిన్ టెండూల్కర్ భరిస్తాడు. ఆ మ్యాచ్ లో సచిన్ ఉన్నా లేకున్నా సుదీర్ చౌదరి మాత్రం స్టేడియంలో ఉంటాడు.. ఇతనికి ప్రయాణ ఖర్చులు, స్టేడియం టికెట్ ఖర్చులు, మొత్తం సచిన్ చూసుకుంటాడు. దీంతో భారత మ్యాచ్ లు ఎక్కడ జరిగినా వింత వింత విన్యాసాలతో తనకున్న క్రికెట్ అభిమానాన్ని చాటుకుంటూ అప్పుడప్పుడు కెమరాకు క్లిక్ మనిపిస్తాడు.
నిద్రలేని రాత్రులు....

ప్రపంచ కప్ భారత్ గెలవాలని కలలు కన్నాడు సుదీర్ చౌదరి. కపిల్ సారథ్యంలో వచ్చిన కప్ మళ్లీ ఈ సారి భారత్ వశం కావాలని కోరుకునే వాడు. దానికి తగినట్టుగానే వరల్డ్ కప్ సమయంలో టీం ఇండియా కప్ గెలవాలని తన నెత్తిపై కప్ ఆకారంలో కటింగ్ చేయించుకున్నాడు... క్రికెట్ పై , దేశం పైఉన్న అభిమానమే తనను ఈ విధంగా చేయిస్తుందని చౌదరి చెప్తున్నాడు

No comments:

Post a Comment