Thursday 12 December 2013

దేశ భవిష్యత్తే యువత....!


ఛీ... ఈదేశాన్ని మార్చలేము...! ఈ రాజకీయ నాయకులను మార్చలేము..! మనకెందుకురా బాబు ఈ రాజకీయాలు....!మన పనేందో మనం చూసుకుందాం..! ఇది తరుచుగా వినిపించే మాటలు... రాజకీయాలపై , దేశ అవినీతి పై విసుగు చెందిన వారు తరుచు మాట్లాడే మాటలు...! కానీ ఇక ముందు ఆ మాటలు రావేమో... దేశ భవిష్యత్తును శాషించే ఆయుధాలు రానున్నాయి... అవే యువ ఓటర్స్.... అవునూ ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా 15వేల కోట్ల మంది యువ ఓటర్లు ఈ సారి కొత్త గా ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు...!నిద్రలేచిన మొదలు ట్విటర్లు, ఫేస్ బుక్ లతో బిజీగా గడిపే ఈ యువతరం తమ అమూల్యమైన ఓటుతో దేశభవిష్యత్తును తిరగ రాయనున్నారనడంలో సందేహం లేదు.!అయితే చుట్టు రాజకీయ వాతావరణం గమనిచంలేని ఈ యువతరం ఎక్కువగా ఎక్కడ ఆకర్షితులవుతారన్నది ముఖ్యం...!
చరిత్ర తిరగ రాయగలరా...!

యువతరం తలుచుకుంటే చేయలేనిది ఏది లేదు...!ఇది అనేక దేశ చరిత్రలో కూడా కనిసిస్తుంది. నెత్తురు మండే శక్తులు నిండిన ఈ కుర్రాళ్లు...అవినీతికి ప్రత్యామ్నాయంగా నిలుస్తారు..! అయితే మన దేశంలో ప్రతీ ముగ్గురులో ఒక యువకుడున్నాడు. అంటే రాబోయో రోజుల్లో దేశం యువ దేశంగా మారనుంది . దీంతో సగటు భారతీయుని వయస్సు 29ఏళ్లు కానున్నాయి. దీంతో 2014లో దేశ భవిష్యత్తును రాజకీయ నాయకుల తలరాతలను మార్చేది మాత్రం యువతే అని చెప్పవచ్చు.... దీనికి నిదర్శనం ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే చెప్తున్నాయి... ఢిల్లీలో మాత్రం ఈ ప్రభావం మరీ ఎక్కువగా పడింది. నిర్భయ ఉదంతం... పెరిగిన ధరలు యువ ఓటర్లను భాగా ప్రభావం చూపాయి...

No comments:

Post a Comment