Saturday 8 February 2014

మరో స్వాతంత్య్రం కోసం పోరాడాల్సిన సమయమిది.!

హైదరాబాద్: నేడు రాజకీయాలు బురదలో చిక్కుకున్న పందిలా దయారయ్యాయి. ఏ దేశ చరిత్ర చూసిన ఏముంది గర్వకారణం...!పరదేశ పరాయణత్యం అన్న శ్రీశ్రీ చందంగా ఉంది నేడు దేశ రాజకీయాలు. వార్డు నెంబర్ నుంచి ప్రధాన మంత్రి పదవి వరకు దోచుకోవడమే పనిగా పెట్టుకుని తన రాజకీయ మనుగడను సాగిస్తున్నారు. ఈలాంటి రాక్షస రాజ్యంలో పేదల ఆకలి తీరేదెప్పుడు...! మనకు స్వాతంత్య్రం వచ్చి 65ఏళ్లు గడుస్తున్నా ఇంకా ఆకలి ! ఆకలి అంటూ పేదవాడి అరుపులు ఆగలేదు. మరెప్పుడు ఈ 65ఏళ్ల స్వతంత్య్ర భారతం ప్రగతి పథంలో దూసుకుపోయేది. మరెప్పుడు యువత కళ్లల్లో ఉద్యోగ క్రాంతి కనబడేది.
ప్రజా సామ్యం పై నమ్మకం పోయింది....!
రాజకీయ పార్టీలపై నేటి యువత పూర్తిగా విశ్వాసం కోల్పోయింది. రాజకీయ వ్యవస్థకు దూరంగా ఉండాలని నేటి యువత ఆలోచన! అయితే స్వాతంత్య్ర కోసం ప్రాణాలు పణంగా పెట్టిన నాటీ యువత అల్లూరి సీతా రామరాజు, భగత్ సింగ్ లాంటి వారు అప్పట్లో యువతను మెల్కోల్పారు. కానీ నేటి యువతలో ఆనాటి స్ఫూర్తి కొరవడింది. రాజకీయాలంటే అంటరానివిగా చూస్తున్న వారి ఆలోచనల్లో ఇప్పుడిప్పుడే గొద్దిగా మార్పు వస్తుంది. ఈ రాజకీయాలను మార్చే శక్తి తమకే ఉందని గ్రహించిన యువత మరో స్వాతంత్ర్యానికి పూనుకోవాల్పిన అవసరం ఎంతైనా ఉందని వారు భావిస్తున్నారు.
యువతను టార్గెట్ చేసిన పార్టీలు
తమ పార్టీల దశా దిశను మార్చేది యువతనే అని గ్రహించిన పార్టీలు ఇప్పుడు ప్రధాన దృష్టి యువతపైనే పెట్టింది. సాధ్యమైనంత వరకు యువతను ఆకట్టుకునే విధంగా ప్రకటనలు చేస్తుంది. నిన్నటికి మొన్న దేశ రాజకీయాలకు బయం పుట్టించిన ఢిల్లీ ఎన్నికలు ఇప్పుడు పార్టీలకు నిద్ర పట్టనివ్వకుండా చేస్తున్నాయి. 2014లో ఏ విధంగానైనా ఢిల్లీ పీఠాన్ని అధిరోహించాలని చూస్తున్న బిజెపి, నరేంద్ర మోడి ఇమేజ్ ను కూడకట్టే పనిలో నిమగ్నమైంది. కాంగ్రెస్ మాత్రం ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఆచితూచి స్పంధిస్తుంది. ఈ రెండు ప్రధాన పార్టీల సంగతి ఈ విధంగా ఉంటే ప్రాతీయ పార్టీలు ఈ సారి మాత్రం సత్తా చాటాలని ఉవ్విర్లూరుతున్నాయి. ఏది ఏమైనా కాంగ్రెస్, బిజెపి లకు ప్రత్యామ్నాయంగా ఏ పార్టీలైనా థార్డ్ ఆప్షన్ గా ఉంటే యువత మాత్రం అక్కడ మొగ్గుచూపుతుందని చెప్పవచ్చు.
ప్రధానం కానున్న సోషల్ మీడియా...!
నేటి యువత 47శాతం సోషల్ మీడియాని భాగా వాడుతున్నారు. ఇది గమనించిన రాజకీయ పార్టీలు సోషల్ మీడియా ద్వారా యువతను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియాని ప్రచార మాధ్యమంగా ఉపయోగిస్తున్నారు. నిన్నటికి నిన్న దేశ రాజధానిలో కొత్త చరిత్ర లిఖించింది యువతే అన్న విషయం మనం మర్చిపోకూడదు. ఇది ఈ నాటి రాజకీయాల్లో కొత్త అధ్యయనం. ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరుపున పోటీ చేసి గెలిచిన వారంతా యువతే కావడం మనం గమనించాలి. అవినీతికి వ్యతిరేకంగా సాగిన ప్రచారం చూస్తే, వారి విజయం యువతలో మరింత ఆశలు పెరుగుతున్నాయి. ఇలాంటి యువత వట్టి పోకూడదు. ఓటేనే బ్రహ్మాస్త్రంతో నవ చరిత్ర సృష్టించాలి.
కాలయాపన మానండీ ....!కాలాన్నితిరగరాయండీ..!
నేటి యువతకు లైఫ్ అంటే సెలబ్రేషన్. క్లబ్ లు, పబ్ లు సినిమాలు, షికార్లు, టీవి ఇంటర్నెట్, సెల్ఫోన్ లతో కాలక్షేపం . మారుమూల పల్లెలకి ఈ వాతావరణం వచ్చేసింది. తినడానికి తిండి లేక పోయినా ఇంట్లో టీవి, చేతిలో సెల్పోన్ ఉండటం సాధారనమైపోయింది. కానీ ప్రజల్లోకి , ప్రజా సమస్యల్లోకి చొచ్చుకుపోయింది మాత్రం లేదు..

కుళ్లు పట్టిన రాజకీయాలను కడగేయాల్సింది మనమే...!కళ్లు తెరిచి దేశ భవిష్యత్తును లిఖించాల్సింది మనమే..!

No comments:

Post a Comment