Sunday 10 November 2013

క్రికెట్ పిచ్చోడు...



ముంబై: ఇండియా మ్యాచ్ లంటే అభిమానులు మొత్తం స్టేడియంలో కిక్కిరిసి పోతారు....! బంతి వికెట్ ను గిరాటేసినా..... బ్యాట్ బంతిని బాదినా స్టేడియం మొత్తం అభిమానుల హంగామా....అరుపులు చూస్తాం....! ఈ హంగామా, అరుపుల మధ్య ఓ క్రికెట్ పిచ్చోడు! ఒంటి నిండా జాతీయ జెండా రంగు...!చేతిలో రెపరెపలాడే మువ్వన్నెల జెండా! ప్రతీ షాట్ కి అతని చేతిలో జెండా రెపరెపలాడుతోంది... వికెట్ పడ్డప్పుడు...అదే జెండా నింగిలో సాలామ్ చేస్తుంది.... భారత క్రికెట్ మ్యాచ్ లు ఎక్కడ జరిగినా ఆ పిచ్చోడు ఆ స్టేడియంలో ఉంటాడు.... అతనే సుదీర్ చౌదరి....సచిన్ వీరాభిమానైన ఇతను భారత క్రికెట్ మ్యాచ్ లు ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోతాడు. ప్రతీ మ్యాచ్ ను ఆస్వాదిస్తాడు... ఆనందిస్తాడు.. మ్యాచ్ ఓడినప్పుడు కుంగిపోతాడు.
ఖర్చుమొత్తం అతనే....!
అయితే భారత మ్యాచ్ లంటే టికెట్లు దొరకవు, పైగా స్వదేశంలో అంటే అస్సలు దొరకవు . మరీ ఇతనికి ఏ విధంగా టికెట్ దొరుకుతాయని అందరికి సర్వసాధారణంగా డౌట్ వస్తుంది... అవును ఇతను ఎక్కడికి పోయినా ఆ ఖర్చును మొత్తం సచిన్ టెండూల్కర్ భరిస్తాడు. ఆ మ్యాచ్ లో సచిన్ ఉన్నా లేకున్నా సుదీర్ చౌదరి మాత్రం స్టేడియంలో ఉంటాడు.. ఇతనికి ప్రయాణ ఖర్చులు, స్టేడియం టికెట్ ఖర్చులు, మొత్తం సచిన్ చూసుకుంటాడు. దీంతో భారత మ్యాచ్ లు ఎక్కడ జరిగినా వింత వింత విన్యాసాలతో తనకున్న క్రికెట్ అభిమానాన్ని చాటుకుంటూ అప్పుడప్పుడు కెమరాకు క్లిక్ మనిపిస్తాడు.
నిద్రలేని రాత్రులు....

ప్రపంచ కప్ భారత్ గెలవాలని కలలు కన్నాడు సుదీర్ చౌదరి. కపిల్ సారథ్యంలో వచ్చిన కప్ మళ్లీ ఈ సారి భారత్ వశం కావాలని కోరుకునే వాడు. దానికి తగినట్టుగానే వరల్డ్ కప్ సమయంలో టీం ఇండియా కప్ గెలవాలని తన నెత్తిపై కప్ ఆకారంలో కటింగ్ చేయించుకున్నాడు... క్రికెట్ పై , దేశం పైఉన్న అభిమానమే తనను ఈ విధంగా చేయిస్తుందని చౌదరి చెప్తున్నాడు

క్రికెట్ రూపం మార్చుకుంటుందా....!


హైదరాబాద్: అంతర్జాతీయంగా క్రికెట్ రూపం మార్చుకుంటుంది... కొత్త కొత్త నిబంధనలతో క్రికెట్ సరికొత్తగా తయారవుతోంది. ఒకప్పుడు 5రోజుల క్రికెట్ అంటే కచ్చితంగా ఐదవ రోజు దాని ఫలితం తేలేది...కానీ ఇప్పుడు దాని రూపం మారింది. టెస్టు క్రికెట్ సైతం వన్టేలాగా తయారవుతోంది. ఇప్పుడున్న టెస్టు క్రికెట్ లు మూడు రోజుల్లో ఫలితాలు తేలిపోతున్నాయి. దీంతో అంతర్జాతీయ టెస్టు క్రికెట్ ఫాస్టు క్రికెట్ లాగా తయారైంది. దీనిపై చాలా మంది సీనియర్లు టెస్టు క్రికెట్ ను అంతరించిపోకుడా కాపాడాలని, అంతర్జాతీయ క్రికెట్ మండలికి ఎన్ని సలహాలు చేసినా టెస్టు ఉనికిని మాత్రం కాపాడలేకపోతున్నారు.
ఫాస్ట్ పుడ్ లా పొట్టి ఫార్మెట్...
టీ20ల వల్ల టెస్టు క్రికెట్ భవితవ్వం అంతరించిపోతుందనడంలో సందేహం లేదు... ధనాధన్ ఈ మార్ ధన్ లో దంచుడే పనిగా పెట్టుకుని నైతికతో కూడి ఆటను మర్చిపోతున్నారు. టీ20 ఫార్మెట్ అంటే 20 ఓవర్లలో ఎంత ఎక్కువ పరుగులు రాబట్టుకుంటే అంత విజయ అవకాశాలు ఉంటాయని వారి అభిప్రాయం. దీని తోనే ప్రతీ బాల్ ను బౌండరీ తరలించాలని కొట్టుడే పనిగా పెట్టుకున్నారు. దీంతో వన్డేలు, టెస్టు క్రికెట్ కు వచ్చేసరికి కనీసం గంట సేపు గీజులో నిలదొక్కుకోలేని పరిస్థితి నేటి ఆటగాళ్లలో ఉంది. ఈ క్రమంలో టెస్టులకు చాలా మంది ఆటగాళ్లు గుడ్ బై చెప్పి వన్టేలు.. టీ20 మాత్రమే ఆడుతున్న క్రికెటర్లు ఉన్నారు. ఈ మూడు గంటల టీ20లపై ఆదరణ అభిమానుల్లో రోజు రోజుకు ఎంత పెరుగుతుందో టెస్టు క్రికెట్ కు అంతే స్థాయిలో ఆదరణ తగ్గుతోందనడం విస్మరించలేము..
అదే కోరుకుంటున్న అభిమానులు....

నేటితరం క్రికెట్ అభిమానులు టీ20లను ఎక్కువగా ఆస్వాదిస్తున్నారు. నిమిషం సమయాన్ని కూడా వృధా చేయని ఈ రాకెట్ యుగంలో క్రికెట్ అభిమానులు ఎక్కువగా టీ20లపై ఎక్కువ మోజు పడుతున్నారు. టెస్టు క్రికెట్ లను , వన్డేలను మరిచి మరుగున పడేస్తున్నారన్నది పక్కా వాస్తవం...ఉదాహరణ కుతీసుకుంటే ఒకప్పుడు వన్డేలల్లో 300 పరుగులు చేస్తే... పక్కా విజయం అని నమ్మిన వారు. ఇప్పుడు 400మార్కు స్కోరును చేసినా విజయం వరిస్తుందో లేదో నని నమ్మకం లేదు. అంటే టీ20 ప్రభావం ఎంత ప్రభావం పడిందో మనం ఇక్కడ చూడోచ్చు... మరో వైపు ఓ ఫార్మెట్ నిరూపించుకున్న ఆటగాళ్లు ఇంకో ఫార్మెట్ లో నిరూపించుకోవడం లేదు. ఉదాహరణకు టీ20 స్పెషలిస్ట్ గా పేరు సంపాధించుకున్న యుసుఫ్ పఠాన్ లాంటి క్రికెటర్లు దనాధన్ క్రికెట్ లో కొద్దిగా మేరిసినా... తరువాత అన్ని ఫార్మెట్ లల్లో విఫలమయ్యారు. క్రికెటర్ అన్న వాడు అన్ని ఫార్మట్ లో రాణించాలి... ప్రతిభను ఉపయోగించుకోవాలి... క్రికెట్ ను ఆస్వాధించండీ.... టెస్టులను కాపాడండీ....!

Saturday 2 November 2013

'వీ'రోహితం


                           డబుల్ సెచరీతో చెలరేగిన  రోహిత్ శర్మ....!

బెంగళూర్: భారత నయా ఓపెనర్ రోహిత్ శర్మ వీర విహారం చేశాడు.. ఆస్ట్రేలియా తో జరుగుతున్న ఏడో వన్డేలో డబుల్ సెంచరీ తో చెలరేగి పోయాడు. 158బంతులో 209 పరుగులు చేసి అంతర్జాతీయ క్రికెట్ లో డబుల్ సెంచరీ చేసిన మూడో క్రికెటర్ గా రోహిత్ రికార్డు సృష్టంచాడు.దీంతో సచిన్, సెహ్వాగ్ సరసన రోహిత్ నిలిచాడు. అయితే ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆసీస్ తన నిర్ణయానికి భారీ మూల్యం చెల్లించుకుంది.భారత ఓపెనర్స్ ఆస్ట్రేలియా బౌలర్స్ లకు చుక్కులు చూపిస్తూ భారీ భాగసామ్యాన్ని నెలకోల్పారు. దీంతో తొలి 19ఓవర్స్ లో ఓపెనర్స్ 112 పరుగులు సాధించారు. 60పరుగుల చేసిన ధావన్, డోహర్తి బౌలింగ్ లో వెనుదిరిగాడు. ఆతరువాత వచ్చిన విరాట్ పరుగులేమి చేయకుండా పెవిలియన్ చేరాడు. తరువాత వచ్చిన రైనా కాసేపు ఆ కట్టుకున్న పెద్దగా పరుగులు చేయలేక ఔటయ్యాడు. యూవరాజ్ సైతం మరో సారి విఫలమయ్యాడు. దీంతో ధోనీతో కలిసి రోహిత్ చక్కని ఇన్నింగ్స్ ను కొనసాగించాడు. ఎడా పెడా సిక్స్ లు ఫోర్లు కొడుతూ ఆస్ట్రేలియా బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. ఏకంగా ఇన్నింగ్స్ లో 16 సిక్స్ లు భాదిన ఏకైక క్రికెటర్ గా రోహిత్ రికార్డుల కెక్కాడు.
సిసలైన ఇన్నింగ్...

'' ప్రతిభ ఉంది కానీ నిర్లక్ష్యం …! ఆడగలడు కానీ నిలదొక్కుకోలేడు..!ఎన్ని అవకాశాలు ఇచ్చిన నిరూపించుకోడు...! ఇది నిన్నమెన్నటి వరకు రోహిత్ పై తరుచు వినిపించే విమర్శలు . తన ప్రతిభను చూసిన క్రికెటర్లు ఇతన్ని ప్రోత్సహించారు. ఐపిఎల్ లో అద్భుతాలు చేసి భారత జట్టులోకి వచ్చిన రోహిత్ నిజంగా విమర్శలు తగ్గట్టే ఉండేవాడు. నిలకడలేమి ! ఎన్ని అవకాశాలు ఇచ్చిన నిరూపించుకోక పోవడం ఇలా రోహిత్ ప్రస్థానం సాగింది. కానీ భారత జట్టుకు సీనియర్స్ ఓపెనర్స్ దూరం కావడంతో వారి స్థానాలను భర్తి చేయడానికి రోహిత్ ఓపెనర్ అవతారమెత్తాడు. ఈ అవకాశాన్ని రెండు చేతుల ఓడిసి పట్టుకున్న రోహిత్ దానికి తగ్గట్టుగానే రానిస్తూ మన్ననలు అందుకున్నాడు. దీనికి తోడు ఆస్ట్రేలియా తో జరుగుతున్న ఏడు వన్డేల సిరీస్ కు ఓపెనర్ గా శివతాండవం చేస్తున్నాడు.    

Friday 1 November 2013

వెస్టిండీస్ సిరీస్ కు కుర్రాళ్లు...


ముంబై: వెస్టిండీస్ తో జరగనున్నటెస్టు సిరిస్ కు భారత జట్టును బుధవారం బిసిసిఐ ప్రకటించింది. ఈ జట్టులో మొత్తం కుర్రాలకు చోటు కల్పిస్తూ బిసిసిఐ టీం ను ప్రకటించింది. అయితే సచిన్, ధోనీ తప్పా ఈ సిరిస్ ఎవరూ టెస్టు అనుభవం లేక పోవడం విశేషం. అయితే వన్డేలోనూ దుమ్ము దులుపుతున్న కుర్రాళ్లు టెస్టుల్లోను ఏ విధంగా రాణిస్తారో చూడాలి...!
సెహ్వాగ్, గంభీర్ లకు దక్కని చోటు..
అయితే టెస్టు సిరిస్ కు భారత జట్టులోకి సీనియర్స్ ని తీసుకుంటారని అందరు భావించారు. ఈ అనుమానాలను పటాపంచలు చేస్తు బిసిసిఐ టీం ను ప్రకటించింది. దీంతో భారత జట్టులోకి మళ్లీపునరాగమనం చేయాలనుకున్న సెహ్వాగ్ , గంభీర్ లకు నిరాషే మిగిలింది.
మరో సారి నమ్మకం...
ఇటీవల పేలవ ఫాం లేమితో భాద పడుతున్న ఇషాంత్ షర్మకు సెలక్టర్స్ మరో అవకాశాన్ని ఇచ్చారు. ఒక్క సారి విఫయమైనంత మాత్రాన ప్రతిభ ఉన్న ఆటగాళ్లను పక్కకు పెట్టాల్సిన పని లేదని బిసిసిఐ తెలిపింది. మరో ఆటగాడు రోహిత్ షర్మ ఇతను వన్డేలో ఓపెనర్ గా దూసుకుపోతున్నాడు. అయితే ఇతను పై నమ్మక ముంచిన సెలక్షన్ కమిటి టెస్టులోను తన సత్తా చాటుకుంటాడని భావిస్తున్నారు.
సచిన్ కు చివరి టెస్టు సిరీస్ ...
ఇక సచిన్ సెలక్షన్ చేయడం సెలక్షన్ కమిటికి ఉండక పోవచ్చు సచిన్ ఈ సిరిస్ తరువాత అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్తాడన్న సంగతి తెలిసిందే. అయితే దీన్ని దృష్టింలో పెట్టుకుని సెలక్షన్ కమీటీ మొత్తం యువకుల తో కూడిన జట్టును ప్రకటించింది . దీంతో మంచి ఫాం కొనసాగిస్తున్న కుర్రాలతో , ఇదే ఊపును టెస్టు సిరిస్ లో కొనసాగించి సచిన్ కు సగౌర్వంగా వీడ్కోలు పల్కాలని జట్టు యోచిస్తుంది .

జట్టు వివరాలు. ధోనీ( కెప్టెన్) ధావన్, రోహిత్ , పుజారా, సచిన్, కోహ్లీ, రహానే, విజయ్, భువనేశ్వర్, ఇషాంత్ , అశ్విన్, ఓజా, మిశ్రా, షమీ, ఉమేష్ యాదవ్.,