డబుల్ సెచరీతో చెలరేగిన రోహిత్ శర్మ....!
బెంగళూర్:
భారత నయా
ఓపెనర్ రోహిత్ శర్మ వీర విహారం
చేశాడు.. ఆస్ట్రేలియా
తో జరుగుతున్న ఏడో వన్డేలో
డబుల్ సెంచరీ తో చెలరేగి
పోయాడు. 158బంతులో
209 పరుగులు
చేసి అంతర్జాతీయ క్రికెట్
లో డబుల్ సెంచరీ చేసిన మూడో
క్రికెటర్ గా రోహిత్ రికార్డు
సృష్టంచాడు.దీంతో
సచిన్, సెహ్వాగ్
సరసన రోహిత్ నిలిచాడు.
అయితే ముందుగా
టాస్ గెలిచి ఫీల్డింగ్
ఎంచుకున్న ఆసీస్ తన నిర్ణయానికి
భారీ మూల్యం చెల్లించుకుంది.భారత
ఓపెనర్స్ ఆస్ట్రేలియా బౌలర్స్
లకు చుక్కులు చూపిస్తూ భారీ
భాగసామ్యాన్ని నెలకోల్పారు.
దీంతో తొలి
19ఓవర్స్
లో ఓపెనర్స్ 112 పరుగులు
సాధించారు. 60పరుగుల
చేసిన ధావన్, డోహర్తి
బౌలింగ్ లో వెనుదిరిగాడు.
ఆతరువాత వచ్చిన
విరాట్ పరుగులేమి చేయకుండా
పెవిలియన్ చేరాడు. తరువాత
వచ్చిన రైనా కాసేపు ఆ కట్టుకున్న
పెద్దగా పరుగులు చేయలేక
ఔటయ్యాడు. యూవరాజ్
సైతం మరో సారి విఫలమయ్యాడు.
దీంతో ధోనీతో
కలిసి రోహిత్ చక్కని ఇన్నింగ్స్
ను కొనసాగించాడు. ఎడా
పెడా సిక్స్ లు ఫోర్లు కొడుతూ
ఆస్ట్రేలియా బౌలర్లను ఓ ఆట
ఆడుకున్నాడు. ఏకంగా
ఇన్నింగ్స్ లో 16 సిక్స్
లు భాదిన ఏకైక క్రికెటర్ గా
రోహిత్ రికార్డుల కెక్కాడు.
సిసలైన
ఇన్నింగ్...
'' ప్రతిభ
ఉంది కానీ నిర్లక్ష్యం …!
ఆడగలడు
కానీ నిలదొక్కుకోలేడు..!ఎన్ని
అవకాశాలు ఇచ్చిన నిరూపించుకోడు...!
ఇది నిన్నమెన్నటి
వరకు రోహిత్ పై తరుచు వినిపించే
విమర్శలు . తన
ప్రతిభను చూసిన క్రికెటర్లు
ఇతన్ని ప్రోత్సహించారు.
ఐపిఎల్ లో
అద్భుతాలు చేసి భారత జట్టులోకి
వచ్చిన రోహిత్ నిజంగా విమర్శలు
తగ్గట్టే ఉండేవాడు.
నిలకడలేమి
! ఎన్ని
అవకాశాలు ఇచ్చిన నిరూపించుకోక
పోవడం ఇలా రోహిత్ ప్రస్థానం
సాగింది. కానీ
భారత జట్టుకు సీనియర్స్
ఓపెనర్స్ దూరం కావడంతో వారి
స్థానాలను భర్తి చేయడానికి
రోహిత్ ఓపెనర్ అవతారమెత్తాడు.
ఈ అవకాశాన్ని
రెండు చేతుల ఓడిసి పట్టుకున్న
రోహిత్ దానికి తగ్గట్టుగానే
రానిస్తూ మన్ననలు అందుకున్నాడు.
దీనికి తోడు
ఆస్ట్రేలియా తో జరుగుతున్న
ఏడు వన్డేల సిరీస్ కు ఓపెనర్
గా శివతాండవం చేస్తున్నాడు.
No comments:
Post a Comment