Thursday 31 October 2013

మరింత దూసుకుపోవడానికే అఖిలపక్షం...పాల్వాయి..

హైదరాబాద్: రాష్ట్ర విభజనపై మరింత ముందుకు వెళ్లేందుకే కేంద్ర హోం శాఖ అఖిలపక్షం సమావేశాన్ని నిర్వహిస్తుందని ఎంపీ పాల్వాయి గోవర్థన్ రెడ్డి పేర్కొన్నారు. తమ డిమాండ్ లను వినాలని పార్టీలు కోరుతున్న నేపథ్యంలోనే సమావేశం ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. ఈ సమావేశంలో తాము ఏం చేస్తున్నారో అనే అంశాన్ని మాత్రమే పార్టీలకు వివరిస్తారు. తప్ప విభజనపై మరో మారు అభిప్రాయం కోరబోరని స్పష్టం చేశారు. కేంద్ర హోంశాఖ వేగాన్ని బట్టి డిసెంబర్ చివరికి రెండు రాష్ట్రాల ఏర్పాటు కాయమని ప్రకటించారు. పాల్వాయి గురువారం కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే మంత్రులు కమిటీ సభ్యుడు జైరాం రమేష్ లతో విడివిడిగా భేటీ అయ్యారు. రాష్టప్రాజెక్టుల విషయంలో అనుసరించాల్సిన విధానాన్ని సూచిస్తూ వారికి ఓ నోట్ ను అందజేశారు.
సీఎం పిచ్చోడు... సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పై పాల్వాయి మరో మారు ద్వజమెత్తాడు.. ''వాడు ఓ పిచ్చోడు'' విభజనపై హద్దు మీరి సీఎం కిరణ్ ప్రవర్తిస్తున్నాడు. దీనికి త్వరలోనే తగిన మూల్యం కచ్చితంగా చెల్లిస్తాడని తెలిపారు. పోలవరం పై తెలంగాణ ప్రజలకు అభ్యంతరం లేదు. అయితే 1.35 లక్షల కుటుంబాలు 335గ్రామాలకు ఈ ప్రాజెక్టుతో ముప్పు పొంచి ఉంది 75 టిఎంసిల నీటి కోసం ఇంత ముప్పును కాదని ముందుకు వెల్ల రాదు. సాగునీటి రంగ నిపుణుడు హనుమంతరావు సూచించిన విధంగా మూడు బ్యారేజీలను నిర్మిస్తే నష్టం తక్కువగా ఉంటుంది. 130 గ్రామాలు మాత్రమే ముంపునకు గురౌతాయి. అని పాల్వాయి అన్నారు. నాగార్జున సాగర్ నిర్మించినప్పుడు 5 గ్రామాలే ముంపునకు గురయ్యాయని చెప్పారు.


ఉల్లిగడ్డ కోసం రైతును చంపిన గుర్తు తెలియని దుండగులు..


రంగారెడ్డి: ఇన్నాళ్లు ఆస్తుల కోసం, డబ్బు కోసం , బంగారం కోసం దొంగతనం చేసేవారు... కానీ నేడు దొంగలు ఉల్లిగడ్డ కోసం హత్యకు కూడా వెనకాడటం లేదు. తాజాగా రంగారెడ్డి జిల్లా నవాబ్ పేట్ మండలంలో దారుణం చోటు చేసుకుంది. ఉల్లిగడ్డ రైతును నిర్ధాక్షిణ్యంగా కొట్టి చంపారు. వివరాల్లోకి వెళ్తే.......  కడ్చర్ల గ్రామంలో నివాస ముంటున్న ఎల్లయ్య అనే రైతు (60) తన పంట పొలంలో పత్తి ,క్యారెట్ తో పాటు ఉల్లిగడ్డను కూడా సాగు చేశాడు. అయితే రోజు మాదిరిగానే రాత్రి 9గంటల సమయంలో ఇంటి వద్దనుంచి కాపలాకు బయలు దేరిన ఎల్లయ్య తన పొలంలోని ఓ చెట్టుకింద నిద్రిస్తున్నాడు. ఈ సమయంలో గుర్తు తెలియని దుండగులు తన పొలంలోని నిల్వ ఉంచిన ఉల్లిగడ్డ సంచులను దొంగలిస్తుండగా ఎల్లయ్య వారిని అడ్డుకున్నాడు. దీంతో దుండగులు ఎల్లయ్య తలపై కర్రతో బలంగా బాదారు. తీవ్ర రక్త స్రావంతో ఎల్లయ్య అక్కడి కక్కడే మరణించారు. ఇది గమనించిన దుండగులు ఉల్లిగడ్డను అక్కడే విడిచిపెట్టి పరారయ్యారు. తెల్లవారుజామున పక్క పొలం వాసి ఎల్లయ్య శవాన్ని చూసి ఊళ్లో సమాచారం ఇచ్చాడు.
భూ తగాదాలే కారణమై ఉండొచ్చు... ఎస్పీ..
ఈ ఘటనపై జిల్లా ఎస్పీ రాజకుమార్ స్పందిస్తూ భూ తగాదాలే ఎల్లయ్య హత్యకు కారణంగా తాము భావిస్తున్నామని ఈ మేరకు నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు  తెలిపారు. కుంటుంబ సభ్యులు మాత్రం ఉల్లిగడ్డల దొంగతనానికి వచ్చిన వారే ఈ హత్యకు పాల్పడినట్లుగా చెబుతున్నారు.  ఈరెండు కోణాలల్లోనూ విచారణ జరిపి పూర్తి విరాలు వెల్లడిస్తామని గురువారం ఆయన తెలిపారు.

ప్రభుత్వాలు సిగ్గు పడాలి.....

దేశ వ్యాప్తంగా ఉల్లి ధర ఆకాశాన్నంటుతుంటే ప్రభుత్వాలు మాత్రం మెద్దు నిద్ర వీడటం లేదు. ఉల్లి ధర విపరీతంగా పెరిగి సామాన్య మానవుడు నాడు ఏం తినలేని పరిస్థితికి వచ్చింది. దీంతో హత్యలకు కూడా వెనకాడకుండా దొంగతనానికి పాల్పడుతున్నారు...  

Saturday 12 October 2013

''ఇక ఆడలేను అలసి పోయాను....!


హైదారబాద్ : భారత క్రికెట్ చరిత్రలో ఒక శకం ముగీయనుంది. పరుగుల రారాజు..! క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ టెస్టు ఫార్మాట్ కు గుడ్ బై చెప్పనున్నాడు.. ఈ నిర్ణయమై బిసిసిఐ తో చర్చించి తన నిర్ణయాన్ని ప్రకటించాడు..అయితే 2012లో వన్డే క్రికెట్ కు వీడ్కోలు పలికిన సచిన్...ఎన్నో రికార్డులు, మరెన్నో అవార్డులు అందుకున్నాడు... 16ఏళ్ల ప్రాయంలో తన కెరీర్ ను ప్రారంభించిన సచిన్ ఎవ్వరికి అందని ఎత్తుకు ఎదిగాడు .. 198టెస్టు మ్యాచ్ లు ఆడిన సచిన్ టెండూల్కర్ 200 వ టెస్టు మ్యాచ్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నాడు. అయితే క్రికెట్ లేని జీవితాన్ని ఊహించుకోవడం కష్టమని తెలిపాడు. తన సుదీర్ఘ కెరీర్ కు సహాకరించిన అభిమానులకు , బిసిసిఐ కి, మరియు కుటుంబ సభ్యులకు అతను కృతజ్ఞతలు తెలిపాడు.
సచిన్ లేని స్థానాన్ని ఊహించగలమా....!
దిగ్గజ క్రికెటర్లు రాహుల్ ద్రావిడ్ , వివిఎస్ లక్ష్మణ్, సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ తరువాత భారత జట్టును ఊహించలేము. అయితే ఇప్పుటికే వివిఎస్, రాహుల్ ద్రావిడ్ భారత క్రికెట్ కు గుడ్ బై చెప్పగా..!సచిన్ మాత్రం ఇన్నాళ్లు ఆటను ఆస్వాధిస్తు కొనసాగాడు. అయితే సచిన్ తరువాత భారత జట్టులో ఆస్థానాన్ని భర్తీ చేయలగల సమర్థుడు దాదాపు లేరనే చెప్పాలి.. భవిష్యత్తులో సచిన్ రికార్డులను తిరగ రాసే వారు ఉండరని చెప్పాలి... ఎందుకంటే.. ట్వీ20క్రికెట్ వచ్చిన తరువాత ఆటలోను, ఆటగాళ్లలోనూ భారీ తేడా వచ్చింది. దాదాపు అతి తక్కువ సమయంలో ఎక్కువ పరుగులు చేయాలి అనే భావంతో నేటి క్రిడా కారులు ఉన్నారు. దీంతో నేడు టెస్టు క్రికెట్ ఆడే ఆటగాళ్లు వేళ్ల మీద లెక్క పెట్టాల్సిన పరిస్థితి మన భారత క్రికెట్ లో ఉంది. ఒక్క క్రికెటర్ కూడా గంట పాటు గ్రీజులో ఉంటే అతి పెద్ద గొప్పే అవుతోంది. మరీ ఇలాంటి పరిస్థితిలో ఐదు రోజుల సాంప్రదాయ క్రికెట్ లో నిలదొక్కుకుని ఆడే ఆటగాళ్లను బూతద్దం పెట్టి వెతికినా దొరకనే చెప్పాలి..!అయితే ద్రావిడ్ , సచిన్ , లక్ష్మణ్ లాంటి వారు టెస్టు క్రికెట్ కు చేసిన సేవ అమోహం. భారత టెస్టుక్రికెట్ వారు ఐకాన్ ప్లేయర్ గా ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు వాళ్లు భారత క్రికెట్ కు చేసిన సేవ...
సచిన్ ప్రస్థానం....!
ప్రపంచ క్రికెట్ చరిత్రలో ప్రఖ్యాతి గాంచిన భారత ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా భారత 'బ్రాడ్ మెన్' సచిన్ టెండూల్కర్ అనే చెప్పాలి.చిన్న పిల్లల మొదలు పండు ముసలి దాక సచిన్ ఓ ఆదర్శంగా ఉన్నాడు. అయితే 1973లో జన్మించిన ఇతను 16ఏళ్ల ప్రాయంలో ప్రపంచ క్రికెట్ కు పరిచయమైయ్యాడు. ఈనాడు భారత్ అనధికార జాతీయ ఆటగా కొనసాగుతుందంటే క్రికెట్ దేవుడి పాత్ర మరువరానిది. అయితే భారత జట్టుకు ఎన్నో విజయాలు అందజేసిన ఈ ముంబయి కి చెందిన బ్యాట్ మెన్ ను పొగడని వారు ఉండరు.. అతను మైదానంలోకి అడుగు పెడుతున్నాడంటే చాలు రికార్డులు బద్దలు కొట్టాల్సిందే.. బౌలర్లకు అతని బ్యాట్ ఒక యమ పాషంలా కనిపించేది. ఫీల్డర్లకు ఆ బంతి బయంకరంగా దూసుకోచ్చేది. అలాంటి దిగ్గజం క్రికెట్ కు దూరమౌతున్నాడంటే క్రికెట్ అభిమానుల గుండెలు బద్ధలు కాక తప్పదు మరీ...


ఐ మిస్సుయు సచిన్....!

Thursday 10 October 2013

''షేర్ ఖాన్'' ఇక లేరు....!

హైదరాబాద్: తెలుగు సినీ కళామ తల్లి మరో నటుడ్ని కోల్పోయింది. కాలేయ వ్యాధితో రియల్ స్టార్ శ్రీహరి బుధవారం సాయంత్రం హఠాన్మరణం చెందారు. ముంబైలోని ఓ షూటింగ్ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీహరి హఠాత్తుగా కిందపడిపోయారు. దీంతో హుటాహుటిన ముంబైలోని లీలావతి ఆసుపత్రికి తరలించారు. దీంతో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు.. అయితే తెలుగులో 100పైగా సినిమాల్లో నటించిన శ్రీహరి మంచి ఆర్టిస్ట్ గాను మంచి నటుడుగాను పేరుతెచ్చుకున్నాడు. అతని మృతి పట్ల సినీ పరిశ్రమ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తంచేసింది.. ఇలాంటి నటుడ్ని మళ్లీ పొందడం చాలా కష్టమని పలువురు ప్రముఖులు ఆవేదన వ్యక్తంచేశారు.
రియల్ స్టార్ .....!
శ్రీహరి చిన్నపట్టినుంచి సినిమాల్లో నటించాలని అతని తపన.. కానీ పేదరికం అతన్ని వెంటాడింది.... !సినిమా చూస్తూ తను హీరో స్థాయికి ఎప్పుడు ఎదుగుతానో! అని కలలు కనేవాడు. ఎంతమంది స్నేహితులు హేలన చేసిన తన కలను మాత్రం వీడలేదు. ఎదో నమ్మకం! ఎక్కడో ఆశ! తనను సినీ పరిశ్రమ హక్కున చేర్చుకుంటుందని నమ్మకం, అతన్ని ముందుకు నడిపించింది. దీంతో అతనికి పోలీస్ జాబ్ వచ్చినా కూడా దాన్ని వదులుకుని సినిమాలో నటించడానికి ట్రైన్ ఎక్కేశాడు. మొదటగా చిన్న చిన్న క్యారెక్టర్స్ తో సినీమాలో కనిపించినా... హీరో కావాలనే తపన మాత్రం సడలలేదు.! రోజు ఆల్భమ్ పట్టుకుని తిరుగ సాగాడు సినిమా వాళ్లు కనిపిస్తే చాలు … వాళ్ల చేతిలో కొన్ని ఫోటోలు పెట్టాల్సిందే. అప్పుడే వంగవీటి మోహనరంగ ''చైతన్యరథం'' సినిమా తీస్తున్నారని తెలిసింది. వాళ్లకు ఓ హీరో కావాలి. కొత్తవాళ్లను చూస్తున్నారట ఆ విషయం శ్రీహరికి చేరింది. ఆ హీరో నేనే అని కలలు కంటూ అక్కడ వాలిపోయాడు. శ్రీహరి కండలు గుండెల్లో ధైర్యం వాళ్లకూ ఇంకెముంది! తనకు తెలిసిన విద్యలన్నీ ప్రదర్శించాడు గురువుగారి సినిమా బయటకు వచ్చేస్తే ఇక అవకాశాలు వెల్లువెత్తుతాయి అనుకొన్నాడు. కానీ అవకాశాలు రాలేదు.
తొలిసారి హీరోగా....
హీరోగా తొలిసారి కెమెరా ముందుకు వచ్చాడు.. అదీ తనకు ఇష్టమైన పోలీస్ అవతారంలో శ్రీహరి ఏమిటీ ! హీరో ఏమిటీ! అని నొసలు చిట్లించారంతా ఇక విలన్ వేషాలూ గోవిందా.. అన్నవాళ్ళు ఉన్నారు. కానీ పోలీస్ విడుదలయ్యాక ఆ మాట మళ్లీ వినబడలేదు. పోలీస్ అంటే ఇలానే ఉండాలి అని పలువురి ప్రశంసలు అందుకున్నాడు... మన రియల్ స్టార్. అతను కన్న కలలు సాకారమైనాయి.. ఇక మిగిలింది సమాజ సేవ.. అని తన కూతురు పేరిట ఓ ఫౌండేషన్ ఏర్పాటేచేశాడు. కొన్ని గ్రామాలను దత్తతకు తీసుకుని వాటికి నీటి సరఫరా చేస్తున్నాడు. ఈ విధంగా సమాజ సేవలోనూ తన ముద్ర వేసుకున్నాడు. తను రాబోయే రోజుల్లో రాజకీయాలోకి వస్తాని చేప్పిన అనది కాలంలోనే తిరిగిరాని లోకాలకు వెల్లిపోయాడు.....!


''కమ్ముకుంటున్న కారు మబ్బులు నిన్ను మింగేశాయని విర్రవీగుతున్నాయి రా... నువ్వు ఉదయించే సూర్యుడివని వాటికి తెలియదు.... ఈరోజుఅస్తమించవచ్చు గాక, ఈ చీకటి బ్రతుకుని చీల్చుకుంటూ మళ్లీపుడతావురా... మళ్లీపుడతావ్...'''

Sunday 6 October 2013

ఇద్దరు స్టార్లు కలిసిన వేల....!!!




ఢిల్లీ: ఇద్దరు ఆల్ టైం గ్రేడ్ క్రికెటర్లు కలిస్తే....! అభిమానులకు పండగే...! అలాంటి అరుదైన సంఘటన ఢిల్లీ ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో జరిగింది. వెస్టిండీస్ ఆల్ టైంగ్రేట్ బ్రియన్ లారా...!మరొకరు ఇండియన్ గాడ్ సచిన్ టెండూల్కర్ ..!ఇద్దిరు స్టేడియంలో ఒకరి పై ఒకరు పొగడ్తల వర్షం కురిపించుకున్నారు. తనకు లారా అంటే చాలా ఇష్టమని తన బ్యాటింగ్ విన్యాసాలతో తనును మయిమరిపించాడని సచిన్ వ్యాఖ్యనించారు..!!లారాను మొదటి సారిగా 1989లో చూశానని అప్పుడు తన బ్యాటింగ్ చూసుకుంటు ఉండిపోయానని గుర్తు చేసుకున్నాడు... మరో వైపు లారా సైతం సచిన్ గురించి ప్రస్తావిస్తు సచిన్ నేటి యువ క్రికెటర్లకు ఎంతో ఆదర్శ ప్రాయుడని తెలిపారు.. నిత్యం ఆటను ఆస్వాదించే సచిన్ అంటే తనకు ఎంతో ఇష్టమని కొనియాడారు... ఈ విదంగా ఇద్దరు గ్రేడ్లు ఒకరి గురించి ఒకరు ప్రస్తావించుకుంటు పాత జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు. ఈ సంఘటన స్టేడియంలోని అభిమానులకు , ఇటు టీవీ ప్రేక్షకులకు చూడముచ్చటగా అనిపించింది..!

పాలకుడి వినాశనం...


హైదరాబాద్: భూకబ్జా దారులు పంజరాల్లో ఎక్కడో ఒక రైతు నలిగిపోతూనే ఉన్నాడు...! ఒకప్పుడు పచ్చని పంట పొలాలతో....!రైతన్నల రెక్కల కష్టంతో ...! ఆ భూములు పులకరించి పోయేవి..!అన్నదాతల చెమట చుక్కల తాకిడికి పరవసించి పోయేది...!కానీ నేడు ఆ పచ్చదనం లేదు..!దుక్కి దున్ని నారు పోసి ... నీరు పెట్టే రైతన్న ఇలాకాలో భూ బకాసురులు చొరపడ్డారు..!అన్యాయంగా వారి భూములను స్వాధీనం చేసుకుని రైతన్నను నట్టేట ముంచేత్తారు...! ఈ వారం భూ బకాసురుల కాలికింద నలిగిన గ్రామం.... ఇంబ్రహీం పట్నం మండలం ఆదిబట్ల గ్రామం. నగరాల్లోని పార్కులు … భవనాలను మింగేసిన బకాసురులను పల్లేలంటే ఒక లెక్క కాదు..!నిత్యం రైతన్న చెమట చుక్కతో తడిచే ఆ గ్రామంలో.... రైతులు తమ కున్న చిన్నపాటి భూములను సాగు చేసుకుంటు తమ జీవనాన్ని సాగించే వారు.. దీంతో అక్కడ బకాసుర కన్ను పడింది.స్వాధీనం చేసుకుంటే  అడిగే నాదుడు లేడని పాలకులకు తెలిసినంత మరెవరికి తెలియకపోవచ్చు.....! అధికారులు  కొత్త కొత్త పేర్లతో కంపెనీలకు స్వాగతం పలికారు. జనానికి ఇదొక  మహోదయం అని నమ్మ బలికి నేల తల్లి సాక్షిగా.. సామాన్యుల భూములను అన్యాక్రాంతం చేశారు.'' పచ్చని పొలాలకు డబ్బు ర్కెలు వచ్చి ఎటో ఎగిరి పోయాయి... దీంతో పచ్చని పొలాలు ఎండి పోయి పచ్చనోట్లతో బకాసుర నోట్లో పడ్డాయి''..వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇక్కడ  కంపెనీలు వెలిశాయి... ఏరో స్పేస్ ఇంజనీరింగ్ కంపెనీలకు 340ఎకరాలను ప్రభుత్వం లాంచనంగా అప్పచెప్పింది. దీంతో రైతుల వద్ద భూములు స్వాధీనం చేసుకున్నారు. భూములను తీసుకునే  టప్పుడు కంపెనీలు రైతులకు హామీల వర్షం కురిపించారు. ఇక రైతునుంచి పొలాలు వారి చేతిలోకి పడ్డాక... రైతులను నట్టేట ముంచారు.. హామీల వర్షం కురిపించిన ప్రభుత్వం,  రైతులను పట్టించుకునేదే లేదు..!అక్కడ ఎకరాకు కనీసం ధర 30లక్షలు పలికింది. కానీ ప్రభుత్వం మాత్రం ఎకరాకు 5లక్షల చొప్పున వారికి ఇచ్చింది.

దీన స్థితిలో రైతన్నా...!
ఇప్పుడు రైతన్న ఆ గ్రామంలో ఎక్కి ఎక్కి ఏడుస్తున్నాడు..! ఇటు నష్ట పరిహారం అందక.. అటు పోయిన భూమితిరిగి రాక దీనావస్థ స్థితిలో ఉన్నాడు... కాయాకష్టం చేసుకుంటు కడుపు నింపుకునే వారు.. ఇప్పుడు ఆ భూములు లేక చేప పిల్లలా తల్లడిల్లి పోతున్నారు.. ఇందంతా పక్కకు పెడితే... స్వాధీన పరుచుకున్న భూముల్లో ఏమైనా కంపెనీలు వచ్చిఉంటే అక్కడ నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించేవి..!కానీ అక్కడ కంపెనీలు లేవు... స్వాధీన పరుచుకున్న 340 ఎకరాల్లో ఇప్పుటికి రెండు కంపెనీలు మాత్రమే వచ్చాయి... ఇంకో రెండు కంపెనీలు ప్రతిపాదనలో ఉన్నాయి. ఆ కంపెనీలు వచ్చిఉంటే చుట్టుపక్కల వారికి ఉద్యోగ అవకాశాలు వచ్చేవి.. గ్రామ అవసరాలు తీరేవి..!కానీ అలా జరగలేదు.. అర కొర నష్ట పరిహారంతో రైతులు కుదేలైపోయారు.. పొలాలు పోగొట్టుకుని ఇటు  గ్రామం గ్రామమే మోసపోయింది. ఇదిలా ఉంటే నష్ట పోయిన రైతుల్లో ఆరు కుంటుంబాలకు ఒక్క పైసా కూడా ఇప్పటి వరకు అందలేదు.. కొందరి కుటుంబాలకు ఎకరాకు 5లక్షలు నష్టపరిహారం అంధింది. కేవలం ఆరు కుటుంబాలకు మాత్రమే రాకుంటే వారు ఎవరికి చెప్పుకుంటారు.వారి గోడు పట్టించుకునే వారు ఎవరు..ఎమ్మార్వోను కలిసారు.. లోకల్ ఎమ్మెల్యేలను కలిశారు, ఎవ్వర్నీ కలిసినా ఏమీ ప్రయోజనం లేదు..వారికి చివరికి శూన్య హస్తాలు శుశ్క వాగ్ధానాలు మాత్రమే మిగిలాయి.. వారి సమస్య మాత్రం తీరలేదు.మూడు సంవత్సరా క్రితం భూములు కోల్పోయి నష్ట పరిహారం రాక ఇప్పటకి రైతన్న దిక్కులు చూస్తున్నాడు. పరిహారం కోసం అధికారుల చుట్ట తిరిగి వారికి విసుకు వచ్చేసింది.