Thursday, 31 October 2013

ఉల్లిగడ్డ కోసం రైతును చంపిన గుర్తు తెలియని దుండగులు..


రంగారెడ్డి: ఇన్నాళ్లు ఆస్తుల కోసం, డబ్బు కోసం , బంగారం కోసం దొంగతనం చేసేవారు... కానీ నేడు దొంగలు ఉల్లిగడ్డ కోసం హత్యకు కూడా వెనకాడటం లేదు. తాజాగా రంగారెడ్డి జిల్లా నవాబ్ పేట్ మండలంలో దారుణం చోటు చేసుకుంది. ఉల్లిగడ్డ రైతును నిర్ధాక్షిణ్యంగా కొట్టి చంపారు. వివరాల్లోకి వెళ్తే.......  కడ్చర్ల గ్రామంలో నివాస ముంటున్న ఎల్లయ్య అనే రైతు (60) తన పంట పొలంలో పత్తి ,క్యారెట్ తో పాటు ఉల్లిగడ్డను కూడా సాగు చేశాడు. అయితే రోజు మాదిరిగానే రాత్రి 9గంటల సమయంలో ఇంటి వద్దనుంచి కాపలాకు బయలు దేరిన ఎల్లయ్య తన పొలంలోని ఓ చెట్టుకింద నిద్రిస్తున్నాడు. ఈ సమయంలో గుర్తు తెలియని దుండగులు తన పొలంలోని నిల్వ ఉంచిన ఉల్లిగడ్డ సంచులను దొంగలిస్తుండగా ఎల్లయ్య వారిని అడ్డుకున్నాడు. దీంతో దుండగులు ఎల్లయ్య తలపై కర్రతో బలంగా బాదారు. తీవ్ర రక్త స్రావంతో ఎల్లయ్య అక్కడి కక్కడే మరణించారు. ఇది గమనించిన దుండగులు ఉల్లిగడ్డను అక్కడే విడిచిపెట్టి పరారయ్యారు. తెల్లవారుజామున పక్క పొలం వాసి ఎల్లయ్య శవాన్ని చూసి ఊళ్లో సమాచారం ఇచ్చాడు.
భూ తగాదాలే కారణమై ఉండొచ్చు... ఎస్పీ..
ఈ ఘటనపై జిల్లా ఎస్పీ రాజకుమార్ స్పందిస్తూ భూ తగాదాలే ఎల్లయ్య హత్యకు కారణంగా తాము భావిస్తున్నామని ఈ మేరకు నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు  తెలిపారు. కుంటుంబ సభ్యులు మాత్రం ఉల్లిగడ్డల దొంగతనానికి వచ్చిన వారే ఈ హత్యకు పాల్పడినట్లుగా చెబుతున్నారు.  ఈరెండు కోణాలల్లోనూ విచారణ జరిపి పూర్తి విరాలు వెల్లడిస్తామని గురువారం ఆయన తెలిపారు.

ప్రభుత్వాలు సిగ్గు పడాలి.....

దేశ వ్యాప్తంగా ఉల్లి ధర ఆకాశాన్నంటుతుంటే ప్రభుత్వాలు మాత్రం మెద్దు నిద్ర వీడటం లేదు. ఉల్లి ధర విపరీతంగా పెరిగి సామాన్య మానవుడు నాడు ఏం తినలేని పరిస్థితికి వచ్చింది. దీంతో హత్యలకు కూడా వెనకాడకుండా దొంగతనానికి పాల్పడుతున్నారు...  

No comments:

Post a Comment