హైదారబాద్
: భారత
క్రికెట్ చరిత్రలో ఒక శకం
ముగీయనుంది. పరుగుల
రారాజు..! క్రికెట్
దేవుడు సచిన్ టెండూల్కర్
టెస్టు ఫార్మాట్ కు గుడ్ బై
చెప్పనున్నాడు.. ఈ
నిర్ణయమై బిసిసిఐ తో చర్చించి
తన నిర్ణయాన్ని ప్రకటించాడు..అయితే
2012లో
వన్డే క్రికెట్ కు వీడ్కోలు
పలికిన సచిన్...ఎన్నో
రికార్డులు, మరెన్నో
అవార్డులు అందుకున్నాడు...
16ఏళ్ల ప్రాయంలో
తన కెరీర్ ను ప్రారంభించిన
సచిన్ ఎవ్వరికి అందని ఎత్తుకు
ఎదిగాడు .. 198టెస్టు
మ్యాచ్ లు ఆడిన సచిన్ టెండూల్కర్
200 వ
టెస్టు మ్యాచ్ కోసం ఆత్రుతగా
ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నాడు.
అయితే క్రికెట్
లేని జీవితాన్ని ఊహించుకోవడం
కష్టమని తెలిపాడు. తన
సుదీర్ఘ కెరీర్ కు సహాకరించిన
అభిమానులకు , బిసిసిఐ
కి, మరియు
కుటుంబ సభ్యులకు అతను కృతజ్ఞతలు
తెలిపాడు.
సచిన్
లేని స్థానాన్ని ఊహించగలమా....!
దిగ్గజ
క్రికెటర్లు రాహుల్ ద్రావిడ్
, వివిఎస్
లక్ష్మణ్, సచిన్
టెండూల్కర్ రిటైర్మెంట్
తరువాత భారత జట్టును ఊహించలేము.
అయితే ఇప్పుటికే
వివిఎస్, రాహుల్
ద్రావిడ్ భారత క్రికెట్ కు
గుడ్ బై చెప్పగా..!సచిన్
మాత్రం ఇన్నాళ్లు ఆటను
ఆస్వాధిస్తు కొనసాగాడు.
అయితే సచిన్
తరువాత భారత జట్టులో ఆస్థానాన్ని
భర్తీ చేయలగల సమర్థుడు దాదాపు
లేరనే చెప్పాలి.. భవిష్యత్తులో
సచిన్ రికార్డులను తిరగ రాసే
వారు ఉండరని చెప్పాలి...
ఎందుకంటే..
ట్వీ20క్రికెట్
వచ్చిన తరువాత ఆటలోను,
ఆటగాళ్లలోనూ
భారీ తేడా వచ్చింది.
దాదాపు అతి
తక్కువ సమయంలో ఎక్కువ పరుగులు
చేయాలి అనే భావంతో నేటి క్రిడా
కారులు ఉన్నారు. దీంతో
నేడు టెస్టు క్రికెట్ ఆడే
ఆటగాళ్లు వేళ్ల మీద లెక్క
పెట్టాల్సిన పరిస్థితి మన
భారత క్రికెట్ లో ఉంది.
ఒక్క క్రికెటర్
కూడా గంట పాటు గ్రీజులో ఉంటే
అతి పెద్ద గొప్పే అవుతోంది.
మరీ ఇలాంటి
పరిస్థితిలో ఐదు రోజుల సాంప్రదాయ
క్రికెట్ లో నిలదొక్కుకుని
ఆడే ఆటగాళ్లను బూతద్దం పెట్టి
వెతికినా దొరకనే చెప్పాలి..!అయితే
ద్రావిడ్ , సచిన్
, లక్ష్మణ్
లాంటి వారు టెస్టు క్రికెట్
కు చేసిన సేవ అమోహం. భారత
టెస్టుక్రికెట్ వారు ఐకాన్
ప్లేయర్ గా ఉన్నారంటే అర్థం
చేసుకోవచ్చు వాళ్లు భారత
క్రికెట్ కు చేసిన సేవ...
సచిన్
ప్రస్థానం....!
ప్రపంచ
క్రికెట్ చరిత్రలో ప్రఖ్యాతి
గాంచిన భారత ఆటగాడు ఎవరైనా
ఉన్నారంటే అది ఖచ్చితంగా
భారత 'బ్రాడ్
మెన్' సచిన్
టెండూల్కర్ అనే చెప్పాలి.చిన్న
పిల్లల మొదలు పండు ముసలి దాక
సచిన్ ఓ ఆదర్శంగా ఉన్నాడు.
అయితే 1973లో
జన్మించిన ఇతను 16ఏళ్ల
ప్రాయంలో ప్రపంచ క్రికెట్
కు పరిచయమైయ్యాడు. ఈనాడు
భారత్ అనధికార జాతీయ ఆటగా
కొనసాగుతుందంటే క్రికెట్
దేవుడి పాత్ర మరువరానిది.
అయితే భారత
జట్టుకు ఎన్నో విజయాలు అందజేసిన
ఈ ముంబయి కి చెందిన బ్యాట్
మెన్ ను పొగడని వారు ఉండరు..
అతను మైదానంలోకి
అడుగు పెడుతున్నాడంటే చాలు
రికార్డులు బద్దలు కొట్టాల్సిందే..
బౌలర్లకు
అతని బ్యాట్ ఒక యమ పాషంలా
కనిపించేది. ఫీల్డర్లకు
ఆ బంతి బయంకరంగా దూసుకోచ్చేది.
అలాంటి దిగ్గజం
క్రికెట్ కు దూరమౌతున్నాడంటే
క్రికెట్ అభిమానుల గుండెలు
బద్ధలు కాక తప్పదు మరీ...
ఐ మిస్సుయు
సచిన్....!
No comments:
Post a Comment