Sunday, 6 October 2013

పాలకుడి వినాశనం...


హైదరాబాద్: భూకబ్జా దారులు పంజరాల్లో ఎక్కడో ఒక రైతు నలిగిపోతూనే ఉన్నాడు...! ఒకప్పుడు పచ్చని పంట పొలాలతో....!రైతన్నల రెక్కల కష్టంతో ...! ఆ భూములు పులకరించి పోయేవి..!అన్నదాతల చెమట చుక్కల తాకిడికి పరవసించి పోయేది...!కానీ నేడు ఆ పచ్చదనం లేదు..!దుక్కి దున్ని నారు పోసి ... నీరు పెట్టే రైతన్న ఇలాకాలో భూ బకాసురులు చొరపడ్డారు..!అన్యాయంగా వారి భూములను స్వాధీనం చేసుకుని రైతన్నను నట్టేట ముంచేత్తారు...! ఈ వారం భూ బకాసురుల కాలికింద నలిగిన గ్రామం.... ఇంబ్రహీం పట్నం మండలం ఆదిబట్ల గ్రామం. నగరాల్లోని పార్కులు … భవనాలను మింగేసిన బకాసురులను పల్లేలంటే ఒక లెక్క కాదు..!నిత్యం రైతన్న చెమట చుక్కతో తడిచే ఆ గ్రామంలో.... రైతులు తమ కున్న చిన్నపాటి భూములను సాగు చేసుకుంటు తమ జీవనాన్ని సాగించే వారు.. దీంతో అక్కడ బకాసుర కన్ను పడింది.స్వాధీనం చేసుకుంటే  అడిగే నాదుడు లేడని పాలకులకు తెలిసినంత మరెవరికి తెలియకపోవచ్చు.....! అధికారులు  కొత్త కొత్త పేర్లతో కంపెనీలకు స్వాగతం పలికారు. జనానికి ఇదొక  మహోదయం అని నమ్మ బలికి నేల తల్లి సాక్షిగా.. సామాన్యుల భూములను అన్యాక్రాంతం చేశారు.'' పచ్చని పొలాలకు డబ్బు ర్కెలు వచ్చి ఎటో ఎగిరి పోయాయి... దీంతో పచ్చని పొలాలు ఎండి పోయి పచ్చనోట్లతో బకాసుర నోట్లో పడ్డాయి''..వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇక్కడ  కంపెనీలు వెలిశాయి... ఏరో స్పేస్ ఇంజనీరింగ్ కంపెనీలకు 340ఎకరాలను ప్రభుత్వం లాంచనంగా అప్పచెప్పింది. దీంతో రైతుల వద్ద భూములు స్వాధీనం చేసుకున్నారు. భూములను తీసుకునే  టప్పుడు కంపెనీలు రైతులకు హామీల వర్షం కురిపించారు. ఇక రైతునుంచి పొలాలు వారి చేతిలోకి పడ్డాక... రైతులను నట్టేట ముంచారు.. హామీల వర్షం కురిపించిన ప్రభుత్వం,  రైతులను పట్టించుకునేదే లేదు..!అక్కడ ఎకరాకు కనీసం ధర 30లక్షలు పలికింది. కానీ ప్రభుత్వం మాత్రం ఎకరాకు 5లక్షల చొప్పున వారికి ఇచ్చింది.

దీన స్థితిలో రైతన్నా...!
ఇప్పుడు రైతన్న ఆ గ్రామంలో ఎక్కి ఎక్కి ఏడుస్తున్నాడు..! ఇటు నష్ట పరిహారం అందక.. అటు పోయిన భూమితిరిగి రాక దీనావస్థ స్థితిలో ఉన్నాడు... కాయాకష్టం చేసుకుంటు కడుపు నింపుకునే వారు.. ఇప్పుడు ఆ భూములు లేక చేప పిల్లలా తల్లడిల్లి పోతున్నారు.. ఇందంతా పక్కకు పెడితే... స్వాధీన పరుచుకున్న భూముల్లో ఏమైనా కంపెనీలు వచ్చిఉంటే అక్కడ నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించేవి..!కానీ అక్కడ కంపెనీలు లేవు... స్వాధీన పరుచుకున్న 340 ఎకరాల్లో ఇప్పుటికి రెండు కంపెనీలు మాత్రమే వచ్చాయి... ఇంకో రెండు కంపెనీలు ప్రతిపాదనలో ఉన్నాయి. ఆ కంపెనీలు వచ్చిఉంటే చుట్టుపక్కల వారికి ఉద్యోగ అవకాశాలు వచ్చేవి.. గ్రామ అవసరాలు తీరేవి..!కానీ అలా జరగలేదు.. అర కొర నష్ట పరిహారంతో రైతులు కుదేలైపోయారు.. పొలాలు పోగొట్టుకుని ఇటు  గ్రామం గ్రామమే మోసపోయింది. ఇదిలా ఉంటే నష్ట పోయిన రైతుల్లో ఆరు కుంటుంబాలకు ఒక్క పైసా కూడా ఇప్పటి వరకు అందలేదు.. కొందరి కుటుంబాలకు ఎకరాకు 5లక్షలు నష్టపరిహారం అంధింది. కేవలం ఆరు కుటుంబాలకు మాత్రమే రాకుంటే వారు ఎవరికి చెప్పుకుంటారు.వారి గోడు పట్టించుకునే వారు ఎవరు..ఎమ్మార్వోను కలిసారు.. లోకల్ ఎమ్మెల్యేలను కలిశారు, ఎవ్వర్నీ కలిసినా ఏమీ ప్రయోజనం లేదు..వారికి చివరికి శూన్య హస్తాలు శుశ్క వాగ్ధానాలు మాత్రమే మిగిలాయి.. వారి సమస్య మాత్రం తీరలేదు.మూడు సంవత్సరా క్రితం భూములు కోల్పోయి నష్ట పరిహారం రాక ఇప్పటకి రైతన్న దిక్కులు చూస్తున్నాడు. పరిహారం కోసం అధికారుల చుట్ట తిరిగి వారికి విసుకు వచ్చేసింది.

No comments:

Post a Comment