Sunday, 10 November 2013

క్రికెట్ రూపం మార్చుకుంటుందా....!


హైదరాబాద్: అంతర్జాతీయంగా క్రికెట్ రూపం మార్చుకుంటుంది... కొత్త కొత్త నిబంధనలతో క్రికెట్ సరికొత్తగా తయారవుతోంది. ఒకప్పుడు 5రోజుల క్రికెట్ అంటే కచ్చితంగా ఐదవ రోజు దాని ఫలితం తేలేది...కానీ ఇప్పుడు దాని రూపం మారింది. టెస్టు క్రికెట్ సైతం వన్టేలాగా తయారవుతోంది. ఇప్పుడున్న టెస్టు క్రికెట్ లు మూడు రోజుల్లో ఫలితాలు తేలిపోతున్నాయి. దీంతో అంతర్జాతీయ టెస్టు క్రికెట్ ఫాస్టు క్రికెట్ లాగా తయారైంది. దీనిపై చాలా మంది సీనియర్లు టెస్టు క్రికెట్ ను అంతరించిపోకుడా కాపాడాలని, అంతర్జాతీయ క్రికెట్ మండలికి ఎన్ని సలహాలు చేసినా టెస్టు ఉనికిని మాత్రం కాపాడలేకపోతున్నారు.
ఫాస్ట్ పుడ్ లా పొట్టి ఫార్మెట్...
టీ20ల వల్ల టెస్టు క్రికెట్ భవితవ్వం అంతరించిపోతుందనడంలో సందేహం లేదు... ధనాధన్ ఈ మార్ ధన్ లో దంచుడే పనిగా పెట్టుకుని నైతికతో కూడి ఆటను మర్చిపోతున్నారు. టీ20 ఫార్మెట్ అంటే 20 ఓవర్లలో ఎంత ఎక్కువ పరుగులు రాబట్టుకుంటే అంత విజయ అవకాశాలు ఉంటాయని వారి అభిప్రాయం. దీని తోనే ప్రతీ బాల్ ను బౌండరీ తరలించాలని కొట్టుడే పనిగా పెట్టుకున్నారు. దీంతో వన్డేలు, టెస్టు క్రికెట్ కు వచ్చేసరికి కనీసం గంట సేపు గీజులో నిలదొక్కుకోలేని పరిస్థితి నేటి ఆటగాళ్లలో ఉంది. ఈ క్రమంలో టెస్టులకు చాలా మంది ఆటగాళ్లు గుడ్ బై చెప్పి వన్టేలు.. టీ20 మాత్రమే ఆడుతున్న క్రికెటర్లు ఉన్నారు. ఈ మూడు గంటల టీ20లపై ఆదరణ అభిమానుల్లో రోజు రోజుకు ఎంత పెరుగుతుందో టెస్టు క్రికెట్ కు అంతే స్థాయిలో ఆదరణ తగ్గుతోందనడం విస్మరించలేము..
అదే కోరుకుంటున్న అభిమానులు....

నేటితరం క్రికెట్ అభిమానులు టీ20లను ఎక్కువగా ఆస్వాదిస్తున్నారు. నిమిషం సమయాన్ని కూడా వృధా చేయని ఈ రాకెట్ యుగంలో క్రికెట్ అభిమానులు ఎక్కువగా టీ20లపై ఎక్కువ మోజు పడుతున్నారు. టెస్టు క్రికెట్ లను , వన్డేలను మరిచి మరుగున పడేస్తున్నారన్నది పక్కా వాస్తవం...ఉదాహరణ కుతీసుకుంటే ఒకప్పుడు వన్డేలల్లో 300 పరుగులు చేస్తే... పక్కా విజయం అని నమ్మిన వారు. ఇప్పుడు 400మార్కు స్కోరును చేసినా విజయం వరిస్తుందో లేదో నని నమ్మకం లేదు. అంటే టీ20 ప్రభావం ఎంత ప్రభావం పడిందో మనం ఇక్కడ చూడోచ్చు... మరో వైపు ఓ ఫార్మెట్ నిరూపించుకున్న ఆటగాళ్లు ఇంకో ఫార్మెట్ లో నిరూపించుకోవడం లేదు. ఉదాహరణకు టీ20 స్పెషలిస్ట్ గా పేరు సంపాధించుకున్న యుసుఫ్ పఠాన్ లాంటి క్రికెటర్లు దనాధన్ క్రికెట్ లో కొద్దిగా మేరిసినా... తరువాత అన్ని ఫార్మెట్ లల్లో విఫలమయ్యారు. క్రికెటర్ అన్న వాడు అన్ని ఫార్మట్ లో రాణించాలి... ప్రతిభను ఉపయోగించుకోవాలి... క్రికెట్ ను ఆస్వాధించండీ.... టెస్టులను కాపాడండీ....!

No comments:

Post a Comment