ముంబై:
ఒంటి చేత్తో
మ్యాచ్ స్వరూపాన్నే మార్చగల
ఆటగాళ్లు..! జట్టుకు
ఎన్నో చిరస్మరణీయమైన
విజయాలందించిన దిగ్గజాలు !
కానీ నేడు
జట్టులో చోటుకోసమే పోరాడాల్సిన
పరిస్థితి.. ఫామ్
లేమితో టీం ఇండియాలో చోటు
కోల్పోయిన సీనియర్లు జహీర్,
గంభీర్,
సెహ్వాగ్,
వీరు ముగ్గురు
తిరిగా జట్టులోకి రావాలని
తీవ్రంగా శ్రమిస్తున్నారు.
దీని కోసం
విదేశాల్లో శిక్షణ పొంది
వచ్చారు. కానీ
వీళ్లు ఒకప్పుడు జట్టులో
స్టార్ ఆటగాళ్లుగా వెలుగు
వెలిగారు. ఒకరు
2011ప్రపంచ
కప్ లో బౌలింగ్ విభాగంలో
పెద్దన్న పాత్ర పోషించాడు.
గంభీర్,
సెహ్వాగ్
ప్రపంచలోనే అత్యుత్తమ ఓపనింగ్
బ్యాటింట్స్ మెన్ గా
పేరుతెచ్చుకున్నారు.
కానీ వారి
ఉనికి కనుమరుగైపోతోంది.
జాతీయ జట్టులోకి
రావడానికి శ్రమించాల్సివస్తుంది.
జట్టులో
కుర్రాల్ల పోటీ ఎక్కువగా
ఉండటంతో ఎంతటి ఆటగాడైనా ఫామ్
లేకపోతే జట్టునుంచి ఉద్వాసన
తప్పడంలేదు. మాజీలు
మాత్రం సీనియర్ల సేవలను
మరవోద్దంటూ చేసిని ప్రకటనకో!
లేక మరే అవకాశమో!
తెలియదు
కానీ... సీనియర్లకు
మరో చాన్స్ బిసిసిఐ ఇచ్చింది.
త్వరలో
స్వదేశంలో జరిగే వెస్టిండీస్
సిరీస్ కోసం భారత్ ఎ జట్టుకు
బిసిసిఐ ప్రకటిచింది.
ఇందులో సీనియర్
ఆటగాళ్లకు పిలుపునిచ్చింది.
ఇద్దరి
మధ్యే పోటీ....
భారత
ఓపెనింగ్ బ్యాట్ మెన్ గా పేరు
ప్రక్యాతలు తెచ్చుకున్న
ఢిల్లీ బాంబులు....సెహ్వాగ్,
గంభీర్ ల మధ్యే
పోటీ ఉంటుంది. ఎందుకంటే,
ఇప్పటికే
భారత జట్టులో ఓపెనింగ్
బ్యాట్స్ మెన్ గా నయ సంచలనం
ధావన్ ఇరగదీస్తున్నాడు.
అయితే ఇతనికి
రెండో ఎండ్ లో మరో ఓపెనర్
పెద్దగా రాణించక పోవడంతో
వారి స్థానంలో గంభీర్,
లేదా సెహ్వాగ్
ఎంపికయ్యే అవకాశం ఉంది.
కానీ ఇద్దరు
మళ్లీ ఓపెనింగ్ గా చూడాలంటే
వారు వెస్టిండీస్ తో జరగనున్న
అనధికార మ్యాచ్ లో మాత్రం
రాణించాల్సి ఉంటుంది.
జహీర్
ఈజీ చాన్స్...
గత
కొద్దికాలంగా ఫిట్ నెస్ కోసం
తీవ్రంగా శ్రమిస్తున్న జహీర్
ఖాన్ కు తిరిగి భారత జట్టులోకి
రావడానికి మార్గం సుగమంగానే
కనిపిస్తోంది. పేస్
బౌలింగ్ విభాగానికి సరైన
నాయకుడు లేకపోవడంతో జహీర్
కు చోటు కాయంగా కనిపిస్తుంది.
No comments:
Post a Comment