ఢిల్లీ:
రెండేళ్ల
నుంచి సచిన్ ఖాతాలో సెంచరీలు
లేకపోవడంతో , సింహం
ఆకలితో ఉన్నట్టే నని భారత
మాజీ ఓపెనర్ చేతన్ చౌహాన్
అభిప్రాయపడ్డాడు. మాస్టర్
వయస్సు మీదపడుతున్నా తనలో
ఇంకా క్రికెట్ ఆడే సత్తా ఉందని
తెలిపాడు. తన
రిటైర్మెంట్ పై వస్తున్న
ఊహాగానాలను కొట్టిపారేశారు.
ఈవిషయాన్ని
సచిన్ కే వదిలేయాలని ఆయన
అన్నారు. మరో
వైపు భారత జట్టులోకి సీనియర్
ఆటగాళ్లు సెహ్వాగ్,
గంభీర్,
జహీర్ లు మళ్లీ
జట్టులోకి వస్తారని ఆశాభావం
వ్యక్తంచేశారు. కోహ్లీలో
చక్కని క్రికెటర్ ఉన్నాడని
అతను మునుముందు దేశానికి
మంచి పేరు సంపాదిస్తాడని
అన్నాడు. అతన్ని భావి కెప్టెన్ గా చౌహాన్
అభివర్ణించాడు.
No comments:
Post a Comment