బెంగళూర్:
ఛాంపియన్స్
లీగ్ టీ20 2013టోర్నమెంట్
ప్రారంభానికి ముందే పాకిస్తాన్
కి షాక్ తగిలింది. భారత
ప్రభుత్వం వీసా నిరాకరించడంతో
పాకిస్తాన్ ఛాంపియన్స్ లీగ్
లో పాలు పంచుకోవడంలేదు.
పాక్ కు చెందిన
జట్టుకు వీసా ఇవ్వక పోవడం
ద్వారా ఛాంపియన్స్ లీగ్
నిర్వామకులకు ఎదురు దెబ్బతగిలింది.
సిఎల్టీ 20
కి పాకిస్తాన్
జట్టు పైసలాబాద్ వోల్వ్స్
అర్హత సాధించింది. ఈ
జట్టుకు మిస్భావుల్ హక్
సారథ్యం వహిస్తున్నాడు.
అయితే ఆ జట్టు
ఆటగాళ్లుకు భారత ప్రభుత్వం
తాజాగా వీసానిరాకరించింది.
దీంతో ఆ జట్టు
టోర్నీ నుంచి వైదొలగింది.
అయితే దీనికి
కారణం లేకపోలేదు.. భారత
పాక్ సరిహద్దుల్లో ప్రస్తుతం
ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన
నేపథ్యంలో పాక్ ఆటగాళ్లుకు
వీసాలు నరాకరించినట్లు
ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుత
పరిస్థితిలో పాక్ ఆటగాళ్లుకు
భద్రత కల్పించడం పెద్ద సమస్య
అవుతోందని ప్రభుత్వం భావిస్తోంది.
No comments:
Post a Comment