Saturday, 7 September 2013

హుర్రే....ముర్రే...!


న్యూయార్క్: యుఎస్ ఓపెన్ లో అతిపెద్ద సంచలనం పురుషుల సింగిల్స్ డిఫెండింగ్ చాంపియన్ ఒలింపిక్ హీరో ఆండీ ముర్రేకు షాక్ హాట్ ఫేవరేట్ గా టైటిల్ నిలబెట్టుకుంటాడనుకున్న అందరి అంచనాలను తారుమారు చేస్తూ...ఈ బ్రిటన్ కింగ్ క్వార్టర్స్ లోనే ఇంటిబాట పట్టాడు స్విట్జర్లాండ్ కు చెందిన టాప్ టెన్ ఆటగాడు స్టానిస్లాస్ వారింకా 6-4, 6-3,తో విబుల్డన్ విజేత, మూడో సీడ్ ముర్రేను బోత్తాకొట్టించి సంచలన విజయాన్ని అందుకున్నాడు. గతంలో ఫెదరర్, జొకోవిచ్ లాంటి స్టార్లను చిత్తుచేపసిన ముర్రే ఇక్కడ మాత్రం వారింకా ధాటికి వరుససెట్లలో కంగుతిని టోర్నీ నుంచి నిరావగా నిష్ర్కమించాడు. రెండు గంటలా 15 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్ లో ఆరంభసెట్ మినహా మరేదశ లోనూ వారింకాకు పోటీ ఇవ్వలేకపోయిన ముర్రే...మ్యాచ్ లకు గాను ఇలా ఒక్క బ్రేక్ పా యింట్ ను కూడా దక్కించుకోకపోవడం ముర్రే 15 విన్నర్లతో సిరిపెట్టుకోగా,, వారింకా ఏకంగా 45 విన్నర్లతో విరుగుకుపడ్డాడు. వరుసగా గత ఆరు గ్రాండ్ స్లామ్స్ లో సెమీఫైనల్ చేరిన ముర్రేకిదే అత్యంత చెత్త ప్రదర్శన కూడా ఈ ఏడాది. ఆరంభ గ్రాండ్ స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ లో రన్నరప్ గా నిలిచిన ముర్రే గాయంతో ఫెంచ్ ఓపెన్ కు దూరమైనా వింబుల్డన్ లో విజేతగా నిలిచి అద్భుతఫామ్ తో యుఎస్ ఓపెన్ లో అడుగుపెట్టాడు. కానీ ఇక్కడ ఏమాత్రం అంచనాలు లేని తొమ్మిదోసీడ్ వారింకా దెబ్బకు చిత్తయ్యాడు వారింకాకిదే తొలి గ్రాండ్ స్లామ్ సెమీ ఫైనల్ కావడం విశేషం. శనివారం జరిగే సెమీస్ లో తనకు ఎదురుపడతాడనునకున్న ముర్రే నిష్క్రమణతో టాప్ సీడ్ జొకోవిచ్ కు ఫైనల్ ప్రపంచ నెంబర్ వన్ నొవాక్ జొకోవిచ్ తో వారింకా అమీతుమి తేల్చుకోనున్నారు.
జొకోజోరు....

ఇక సోమీస్ లో తనకు ఎదురుపడతాడనుకున్న ముర్రే నిష్ర్కమణతో టాప్ సీడ్ జొకోవిచ్ కు ఫైనల్ మార్గం సులువైనట్లే ఈ సెర్భియా యోధుడు టోర్నీలో తన జైత్రయాత్రను కొనసాగిస్తూ క్వార్ట ర్ ఫైనల్ లో అధిగమించి 2011 విన్నర్ అయిన జొకోవిచ్ 6-3 రష్యా 6-2, 3-6, 6-0 తో రష్యాకు చెందిన 21వ సీడ్ మైకేల్ యోజ్నీపై విజయంసాధించి సెమీఫైనల్లో ప్రవేశించాడు. జొకో కింది వరుసగా 14వ గ్రాండ్ స్లామ్ సెమీస్ కావడం విశేషం కాగా. తొలిసారి గ్రాండ్ స్లామ్ సెమీస్ చేరిన వారింకాతో ముఖా ముఖి పోరులో 11-2 రికార్డుతో జొకోవిచ్ దే ముందంజ అందులోనూ, గతేడాది ఇక్కడే నాలుగో రౌండ్లో జొకో చేతిలో ఓడిన వారింకాకు ఈ సీజన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ లో నూ సెర్భియా స్టార్ చేతిలో పరాభవమే ఎదురైంది. ఆ తర్వాత జరిగిన రెండు గ్రాండ్ స్లామ్స్ లోనూ క్వార్టర్స్ దాటలేకపోవడం వారింకాకు ప్రతికూలాంశమే ఈ నేపథ్యంలో జోరుమీదున్న జొకోవిచ్ ను వారింకా ఏ మేరకు ప్రతిఘటిస్తాడన్నది వేచిచూడాలి. మరో సెమీఫైనల్లో స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ తో ఫ్రాన్స్ సీడెడ్ క్రీడాకారుడు రిచర్డ్ గాస్కెట్ తలపడనున్నాడు

No comments:

Post a Comment