హైదరాబాద్:
భారత దేశం!
మువ్వన్నెల
జండాను ప్రపంచ వేదికలపై
రెపరెపలాడించిన ఎందరో క్రీడా
కారులున్నారు. నాటీ
హాకీ మాంత్రికుడు, థ్యాన్
చంద్ నుంచి ఇప్పటి క్రికెట్
దేవుడు సచిన్ టెండూల్కర్
వరకు ఎందరో ఎందరో వీరులను
కన్నది మన పుణ్య దేశం...!కానీ
థ్యాన్ చంద్ తరువాత ఇప్పటికి
భారత హాకీ జట్టులో మరో థ్యాన్
చంద్ లాంటి ఆటగాడు లేకపోవడం
దురదృష్ట కరం..!అంటే
నేటి రాజకీయ క్రీడాల్లో
....దేశ
క్రీడలు ఏవిదంగా శాషిస్తున్నాయో
తెలుసుకోవచ్చు..!ఏక
చక్రాదిపత్యంగా భారత్ ను
మూడు సార్లు స్వర్ణాలు ముద్దాడిన
థ్యాన్ చంద్, ఆయన
పుట్టిన రోజు ప్రతి ఏట ఆగస్టు
29న జాతీయ క్రీడా దినోత్సవంగా గుర్తించి,
జాతీయ అంతర్జాతీయ
స్థాయిలో గుర్తింపు తెచ్చినవారిని
సన్మానిస్తారు. మన
భారత ప్రభుత్వం. అయితే
భారత్ ప్రపంచ జనాభాలో రెండో
అతిపెద్ద దేశం. కానీ
ప్రపంచ క్రీడా రికార్డుల
ప్రకారం ఎంతో వెనుక బడి ఉంది.
1928 ఆస్టర్
డ్యాం నుంచి ఇప్పటి వరకు కేవలం
హాకీ ద్వార మాత్రమే భారత్
మూడు స్వర్ణాలు సాధించింది.
మరో వ్యక్తి
గత విభాగాల్లో సైతం స్వర్ణ
పథకాలు సాధించే స్థాయికి
ఎదిగింది. అయితే
వంద కోట్లకు పైగా భారత
పౌరులున్నా...కేవలం
అతి తక్కువ మంది క్రీడా కారులు
మాత్రమే భారత దేశానికి పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టారు.
మతంగా
క్రికెట్.....!
క్రికెట్
పుట్టింది ఇంగ్లాండులో అయితే
దాన్ని హక్కున చేర్చుకుంది మాత్రం భారత్,
ఎందుకంటే
తొలిసారిగా భారత్ 1983లో
కపిల్ దేవ్ సారథ్యంలో ప్రపంచ
కప్ ను ముద్దాడింది.
అప్పటి నుంచి
ఇండియాలో క్రికెట్ పై మక్కువ
ఏర్పడింది. ఇప్పటి
వరకు దాన్ని ఓ మతంగా ఆరాదిస్తున్నారంటే
అతిశయోక్తి కాదు....
మువ్వన్నెలను
ఎగుర వేసిన 'మాంత్రికుడు'...
అయితే
మన జాతీయ క్రీడా హాకీ,
ఒలింపిక్
చరిత్రలో భారత్ ఇప్పటి వరకు
తొమ్మిది బంగారు పథకాలు
సాధిస్తే... అందులో
కేవలం హాకీ ద్వారా వచ్చినవి
మూడు.అంటే
అప్పట్లో హాకీ మాంత్రికుడు
ఎంత మాయ చేశాడో అర్థం అవుతుంది.
భారత హాకీ ని
భారత ఆటగాడు థ్యాన్ చంద్ ను
వేరిచేసి చూడటం సాధ్యం కాని
పని , థ్యాన్
చంద్ దేశానికి చేసిన ఎనలేని
సేవను గుర్తిస్తు ప్రతి ఏట
థ్యాన్ చంద్ పుట్టిన రోజున
ఆగస్టు 29న
దేశ క్రీడా దినోత్సవాన్ని
జరుపుకుంటారు. ఈరోజున
రాజీవ్ కేల్ రత్న, ద్రోణా
చార్య, అర్జున, ధ్యాన్ చంద్
అవార్డులతో క్రీడా కారులను
సన్మానిస్తారు.
క్రికెట్
పై ఆదరణ....
అయితే
భారత్ లో ఎక్కువగా ఆదరిస్తున్న
క్రీడా క్రికెట్ మాత్రమే
...! భారత్
తొలి కెప్టెన్ తెలుగు తేజం
సికే నాయుడు నుంచి ప్రపంచ
కప్ ను సాధించి పెట్టిన కపిల్
దేశ్ , సునీల్
గవాస్కర్, అనీల్
కూంబ్లే, సచిన్
టెండూల్కర్, వివిఎస్
లక్ష్మణ్, సౌరవ్
గంగూలీ, ధోనీ,
విరాట్ కోహ్లీ
ఇలా ఎందో ఆల్ టై గ్రేడ్లను
అంధిచిన ఘనత భారత్ కు దక్కుతుంది.
అయితే క్రికెట్
ఎంత మంది యువ ఆటగాళ్లు వచ్చినా...!
అందరు సచిన్
తరువాతే నని చెప్పుకోవాలి.
మన దేశంలో
మాస్టర్ బ్లాస్టర్ సచిన్
టెండూల్కర్ ఓ దేవుడిగా
కొలుస్తారు. ఇంకా
చెప్పాలంటే సచిన్ భారత్ క్రీడా
రంగానికే ఓ ఐకాన్ ప్లేయర్ గా
వెలుగు వెలిగుతున్నాడు.
తన ఆట తో అంతగా
మాయ చేశాడు ఈ లిటిల్ మాస్టర్,
సచిన్ ప్రపంచ
బ్యాట్ మెన్స్ లో ఓ నెంబర్
వన్ ప్లేయర్ గా కొనసాగుతున్నాడు.
అంతే కాదు
భారత్ కు ప్రపంచ కప్ అందించాలని
కలలు కన్నాడు... పరితపించాడు...
సుదీర్ఘ కాలం
పాటు వేచి చూశాడు..! చివరికి
2011లో తన
కల సకారం చేసుకున్నాడు...
, కలలు కనండీ
..వాటిని
సాకారం చేసుకోవడానికి
పరితపించడండీ... అని
సచిన్ ప్రపంచానికి చెప్పకనే
చెప్పాడు..!తన
ఆట తీరుతో ఎందరో అభిమానులను
చొరకొన్న సచిన్, తరువాత
అంతటి పేరు ప్రత్యేకతలు
సంపాధించాడు.. కూల్
కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ
...ఇతను
ఇండియాను రెండు ఫార్మాట్
లల్లో విశ్వ విజేతలు నిలిపాడు.
టెస్టుల్లో
ఇండియాను నెంబర్ వన్ ర్యాంక్
కు చేర్చిన ఘనత అతనికే సొంతం!
ఒలింపిక్
దీరులు...
అయితే
వ్యక్తి గ విభాగాల్లోను భారత్
ను విశ్వ విజేతలు గా నిలిచిన
వారు చాలా మంది ఉన్నారు. చెస్ విభాగంలో విశ్వనాద్
ఆనంద్ ఇప్పటి వరకు ఐదు సార్లు
ప్రపంచ కప్ లను సొంతం చేసుకుని
రికార్డు సృష్టించాడు.
ఇక బ్యాడ్మింటన్
లో ప్రకాశ్ పడుకునే ఎన్నో
అరుదైన రికార్డులను సొంతం
చేసుకున్నాడు.. ఆదరణ
ప్రోత్సాహం ఏ మాత్రం లేని
రోజుల్లోనే 1980లో
ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ టైటిల్
ను సొంతం చేసుకున్న క్రీడా
కారుడిగా చరిత్ర సృష్టించారు.
అంతే కాదు
ప్రకాశ్ ఓ వరల్డ్ కప్ టైటిల్
ను సాధించి పెట్టారు.
బ్యాడ్మింటన్
లో ఇప్పటి వరకు ఎందరో బ్యాడ్మింటన్
లు వస్తున్నారు. పోతున్నారు.
కానీ ప్రకాశ్
పదుకునే లాంటి వారు ఇప్పటికి
దేశానికి దొరకలేదు.
అయితే 28ఏళ్ల
తరువాత భారత దేశానికి బంగారు
పథకం అంధించి అరుదైన రికార్డు
సృష్టించాడు అభినవ్ బింద్ర,
2008 బీజింగ్
ఒలింపిక్ లో పది మీటర్ల ఎయిర్
రైఫిల్ విభాగంలో భింద్రా
గోల్డ్ మెడల్ సాధించాడు..
ఇప్పటి వరకు
భారత దేశం మొత్తం 29పథకాలుమాత్రమే
సాధించ కలిగింది. ఇందులో
9 బంగారు
పథకాలు, ఆరు
వెండి పథకాలు.11కాంస్య
పథకాలు ఉన్నాయి . ఇక
ఒలింపిక్ టెన్నిస్ పురుషుల
విభాగంలో లియాండ్ ఫేస్ కాంస్య
పథకం సాధించాడు. 2000సిడ్నీ ఒలింపిక్స్ లో మనతెలుగు
తేజం కరుణం మల్లీశ్వరీ వేయిట్
లిఫ్టింగ్ విభాగంలో పథకం
సాధించింది. 2012 భారత్
ఒలింపిక్స్ లో భారత్ ఏకంగా
ఆరు పథకాలు సాధించింది.
భారత దేశానికి
వచ్చిన అత్యదిక ఒలింపిక్
పథకాలు ఇవే కావడం విషేశం..
కబడ్డీ
హవా....
ఇక
మన దేశంలోనే పుట్టిన కబడ్డీ
హవా కొనసాగుతోంది.
కబడ్డీలో
నెంబర్ వన్ మన భారత జట్టే..!2004నుంచి
2012వరకు
జరిగిన ఐదు ప్రపంచ కప్ టైటిల్స్
ను మన దేశమే సొంతం చేసుకుంది.
ఈ విషయం ఎక్కువ
మందికి తెలియదు. 2012లో
వరల్డ్ కప్ ను సైతం భారత జట్టే
సొంతం చేసుకుంది. ఇక
బిలీయర్డ్స్ లోని భారత్ కు
ప్రత్యేక స్థానం ఉంది.
ఈ పేరు వింటే
గుర్తుకొచ్చే క్రీడా కారుడు
పంకజ్ అద్వానీ , ఇప్పటి
వరకు రికార్డు లెవల్లో పంకజ్
అద్వాని ఏడు సార్లు ప్రపంచ
కప్ ను సొంతం చేసుకున్నాడు.
ట్రాక్ అండ్
ఫీల్డ్ లో అశ్వని నాచప్ప..
పేరు
తెచ్చిపెట్టారు... ఏది
ఏమైనా కొంత మంది క్రీడా కారులు
మాత్రం..భారత్
పేరు ప్రతిష్టలు నిలబెడుతూ
వస్తున్నారు...... ఆగస్టు
29ప్రపంచ
క్రీడా దినోత్సవాన్ని
పురష్కరించుకుని ఇక నైనా మన
దేశంలో క్రీడా అభివృద్ది
సాధించాలని అశిద్దాం..................
మీ ....!

No comments:
Post a Comment