Thursday, 29 August 2013

ఫైనల్లో హాట్ షాట్...


హైదరాబాద్: ఐబిఎల్ లో హైదరాబాద్ హాట్ షాట్ ఫైనల్లో కి దూసుకు పోయింది. బుధవారం రాత్రి హైదరాబాద్ లో జరిగిన మ్యాచ్ పుణె పిస్టన్ ను సైనా నెహ్వాల్ ఓడించింది. దీంతో తొలి ఐబిఎల్ ల్లో ఫైనల్ కు వెళ్లిన తొలి టీంగా హైదరాబాద్ హాట్ షాట్ రికార్డు సృష్టించింది. అయితే మొదట పురుషుల సింగిల్స్ లో అజయ్ జయరాం 21-17, 21-11తో టిన్ మిన్ న్యుజెన్ పై నెగ్గి హైదరాబాద్ కు 1-0 తో అధిక్యం అందించగా మహిళల సింగిల్స్ లో స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ 21-10 , 19-21, 11-8తో జూలియన్ షెంక్ పై గెలిచి హైదరాబాద్ అధిక్యాన్ని 2-0 కు పెంచింది. అయితే పురుషుల డబుల్స్ లో గొ షెమ్- లిమ్ ఖిమ్ 16-21, 21-14, 11-7తో
ఫిషర్ జోచిమ్ సనావె థామస్ పై అద్భుత విజయం తో హైదరాబాద్ ను విజేతగా నిలిపారు. దీంతో రెండో సెమీ ఫైనల్లో విజేతగా నలిచిన జట్టుతో హైదరాబాద్ హాట్ షాట్ తలపడనుంది.
సైనా విశ్వరూపం....

ఐబిఎల్ లో మరో సారి హైదరాబాద్ షట్లర్ విశ్వరూపాన్ని ప్రదర్శించింది. ప్రపంచ మూడో ర్యాంకర్ జులియన్ షెంక్ తో ఉత్కంఠభరితంగా సాగిన పోరులో సైనా పై చెయి సాధించింది. ప్రత్యర్థి వీక్ నెస్ ను గమనిస్తూ...చూడచక్కని షాట్స్ ఆడుతూ... పదునైన స్మాష్ లతో సైనా దూసుకుపోయింది. అయితే ఈ ఆటలో సైనా ఎక్కడ తడపడలేదు. ప్రత్యర్థి షెంక్ చేసిన తప్పిదాలు సైనాకు కలిసొచ్చాయి. 21-10తో మొదటి గేమ్ ను సొంతం చేసుకున్న సైనా ... రెండో గేమ్ లో షెంక్ హోరా హోరిగా తలపడింది. ఒకానొక దశలో సైనా 14-8తో విజయం వైపు దూసుకుపోతున్న తరుణంలో ...షెంక్ పుంజుకుని గేమ్ ను 19-19తో సమం చేసింది. దీంతో మూడో గేమ్ కు వెళ్లిన వీరు అధిపత్యం కోసం సర్వశక్తులు ఒడ్డారు.. ఈ సమయంలో సైనా పదునైనా స్మాష్ లతో షెంక్ ను గ్రౌండ్ మొత్తం తిప్పింది. దీంతో షెంక్ సైనాకు తలవంచక తప్పలేదు..

No comments:

Post a Comment