మలేషియా:
ఆసియా కప్ లో
భారత్ బంగ్లాదేశ్ పై 9-1
గోల్స్ తేడాతో
ఘన విజయం సాధించింది.
రూపిందర్
సింగ్, రఘునాథ్
లు హ్యాట్రిక్ కొట్టడంతో తన
చివరి పూల్ బి మ్యాచ్ లో
స్ఫూర్తి దాయక విజయాన్ని
సాధించింది. అయితే
ఇప్పటికే ఒమన్, దక్షిణ
కొరియా లాంటి దేశాలను మట్టి
కరిపించిన భారత్, ఇప్పుడు
బంగ్లాదేశ్ ను ఓడించి పూల్
-బిలో
అగ్రస్థానంలో నిలిచింది.
దీంతో శుక్రవారం
పూల్ ఎ నుంచి రెండో స్థానం
సాధించిన మలేషియా తో సెమీ
ఫైనల్ ఆడనుంది. సెమీస్
కు ముందు భారత్ , బంగ్లాను
ఓడించాలని చూసింది.
అందుకు తగ్గట్టే
ఆటలో మొదటి నుంచి ఆధిపత్యాన్ని
ప్రదర్శించింది. భారత్
కు మొదట 10 పెనాల్టీ
కార్నర్ లు లభించగా...
అందులో ఆరు
సద్వినియోగం చేసుకుంది.
రూపిందర్ (
4వ, 19వ,
27వ, 61వ,)
నిమిషాల్లో
నాలుగు గోల్స్ కొట్టాడు.
రఘునాథ్ (29వ,
52వ, 59వ,
) మూడు గోల్స్
సాధించాడు. నికిల్
తిమ్మయ్య (25వ,)
మలక్ సింగ్
(47వ)నిమిషాల్లో
చెరో గోల్స్ సాధించారు.
అయితే భారత్
శుక్రవారం మలేషియా తో సెమీ
ఫైనల్ ల్లో తలపడనుంది.
No comments:
Post a Comment