Thursday, 29 August 2013

ప్రతి పిల్లవాడు ప్రొఫెషనల్ కాలేడు..వివిఎస్..


హైదరాబాద్: ఆటలు జీవితంలో అన్ని అనుభవాలను నేర్పిస్తాయని వివిఎస్ లక్ష్మన్ అభిప్రాయపడ్డారు.... ఆయన గురువారం జాతీయ క్రీడా దినోత్స వాన్ని పురష్కరించుకుని పలు సూచనలు చేశారు... ఆటలాడే ప్రతి పిల్లవాడు ప్రొఫెషనల్ కావాలనేం లేదన్నారు..'' వాస్తవానికి అత్యున్నత స్థాయికి ఎదిగేవాళ్ల సంఖ్య చాలా తక్కువ . కానీ ఒక పిల్లాడు జీవితంలో ఎదిగే క్రమంలో క్రీడలు అన్నీ నేర్పిస్తాయి . ధైర్యంగా వ్యవహరించడం కమ్యూనికేషన్ స్కిల్స్ టీమ్ గా కలిసి పని చేయడం , ఇంకా చెప్పాలంటే గెలుపు ఓటములను సమానంగా స్వీకరించడం తెలుస్తుంది. ఈ అలవాట్లు ఒక వ్యక్తిని పరిపూర్ణమైనవ్యక్తిగా ఎదగడానికి దోహదపడుతాయనేది నా నమ్మకం'' అని వివిఎస్ తెలిపారు. చిన్నారులు తాను ఏదైనా ఆట ఆడతానని చెప్పినప్పుడు తల్లిదండ్రులు అతని కోరికను మొగ్గలోనే తుంచేయవద్దు . ముఖ్యంగా రెండు అంశాలు దృష్టిలో పెట్టుకోవాలి. అబ్బాయితో , అతని స్కూల్ లో , కోచ్ తో మాట్లాడి అసలు ఒక ఆటగాడిగా మారేందుకు ఇతనిలో ఏ మాత్రం లక్షణాలు ఉన్నాయో గుర్తించి నిర్ణయం తీసుకోవాలి. అన్నింటికి మించి అతనికి ఒక అవకాశం ఇచ్చి చూడాలి. అని అన్నారు.



No comments:

Post a Comment