శ్రీకాకుళం: భార్యను కడతేర్చి మృత దేహాన్ని కాలువలో పడేసిన ఘటన సంతకవిటి మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...కాకరాపల్లిలో నివాసముంటున్న అనంతరావు శనివారం సాయంత్రం భార్యను చంపి మృత దేహాన్ని కాలువలో పడేశాడు. అనంతరం ఏమీ తెలియని అమాయకుడిలా తన భార్య కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే అతనిపై ముందునుండి అనుమానంతో ఉన్న గ్రామస్తులు, బంధువులు, తన వ్యవహార శైలి పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు అనంతరావే ఈ హత్య చేశాడని తేల్చారు. దీంతో అతనిని కఠినంగా శిక్షించాలని బాధితురాలి బంధువులు, గ్రామ ప్రజలు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు.
No comments:
Post a Comment