ఈ అక్షరాలు ఓ పేదవాడికి అన్నం పెట్టాలి...! నిండు జీవితాలకు ప్రాణం పోయాలి..! ఓ విద్యార్థికి ఆయుధాన్ని ఇవ్వాలి..! ప్రేమికులకు ఓదార్పునివ్వాలి..! అప్పుడే కలలకు ఓ దారి దొరుకుతుంది....
Wednesday, 21 August 2013
కోర్టులో హాజరు....
హైదరాబాద్ : లేపాక్షి నాలెడ్జ్ హబ్ కు భూములు కేటాయించిన వ్యవహారంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావును సీబీఐ అధికారులు సుమారు ఐదు గంటల పాటు విచారించారు. విచారణ అనంతరం బయటకు వచ్చిన ధర్మాన మీడియాతో మాట్లాడారు. లేపాక్షి భూముల వ్యవహారంలో సీబీఐ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చానన్నారు. అప్పటి రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు జారీ చేసిన జీఓలకు సంబంధించిన వివరాలను సీబీఐ అధికారులకు వెల్లడించానని పేర్కొన్నారు. ఇదే విషయంలో అప్పటి ప్రిన్సిపల్ భూముల దుర్వినియోగం గురించి తనకు తెలియదని చెప్పానన్నారు. సెక్రటరీ శ్యామూల్ ను కూడా సీబీఐ పిలిచిందని తెలిపారు. విచారణకు ఎప్పుడు పిలిస్తే అప్పుడు సీబీఐ అధికారుల ఎదుట హాజరవుతానని ధర్మాన పేర్కొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment