
ఈ అక్షరాలు ఓ పేదవాడికి అన్నం పెట్టాలి...! నిండు జీవితాలకు ప్రాణం పోయాలి..! ఓ విద్యార్థికి ఆయుధాన్ని ఇవ్వాలి..! ప్రేమికులకు ఓదార్పునివ్వాలి..! అప్పుడే కలలకు ఓ దారి దొరుకుతుంది....
Sunday, 25 August 2013
మాస్టరే మేటి....క్లార్క్
ముంబై: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పై ఆస్ట్రేలియా సారథి మైకేల్ క్లార్క్ ప్రశంసల వర్షం కురిపించారు. అంతర్జాతీయ క్రికెట్ లో సుదీర్ఘ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న సచిన్ టెండూల్కర్ తాను చూసిన క్రికెటర్లలో గొప్ప వాడని కితాబిచ్చాడు. సచిన్ బ్యాటింగ్ ను తాను ఇష్టపడతానని చెప్పాడు. రెస్టు ఆఫ్ ఇండియాతో జరిగిన మ్యాచ్ లో సచిన్ ఇటీవల 140 పరుగులు చేశాడు. ఆ ఆటను తాను చూసినట్లు క్లార్క్ చెప్పాడు రాహుల్ ద్రావిడ్ , వివిఎస్ లక్ష్మణ్, లాంటి దిగ్గజ ఆటగాళ్లు లేకున్నా సచిన్ వంటి ఆటగాళ్లు ఆస్ట్రేలియా విజయాలను ప్రభావితం చేస్తాడని మైకేల్ క్లార్క్ తెలిపారు.

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment