Saturday, 31 August 2013

ఇక లక్ష్యం టైటిల్....


మలేషియా: భారత హాకీ జట్టు ఒలింపిక్ కు అర్హత సాధించింది. శనివారం మొదటి సెమీ ఫైనల్స్ లో దక్షిణ కొరియా చేతిలో పాకిస్తాన్ 2-1గోల్స్ తేడాతో ఓటమి చవి చూసింది. దీంతో ఒలింపిక్ నిబంధనల ప్రకారం ఆసియా కప్ విజేత జట్టు గనుక ఇంతకు ముందే ప్రపంచ కప్ బెర్తు దక్కించుకుంటే! ఈ మెగా టోర్నీలో అర్హత
టోర్నీగా ..గత జూన్ జూలై, లలో నిర్వహించిన హాకీ వరల్డ్ లీగ్ సెమీ ఫైనల్స్ రౌండ్ లో ఆసియా జోన్ నుంచి అత్యుత్తమ స్థానాలు పొందిన రెండు జట్లకు అవకాశం లభిస్తుంది. ఈ నిబంధన ప్రకారం...భారత్ ఒలింపిక్ కు అర్హత సాధించింది. అయితే ఆసియా కప్ లో తిరగులేని ఆట తీరును ప్రదర్శిస్తున్న భారత్, ఈ ఉత్సాహం తోనే రెండో సెమీ ఫైనల్స్ లో అతిథ్య జట్టు మలేషియాను 2-0 గోల్స్ తేడాతో చిత్తు చేసింది. ఎనిమిదో నిమిషంలో భారత్ కి తొలి పెనాల్టీ కార్నర్ లభించగా .... దాన్ని స్టార్ డ్రాగ్ ప్లికర్ రఘునాథ్ గోల్ గా మలిచాడు. దీంతో మొదటి అర్థ భాగం ముగిసే సరికి భారత్ 1-0తో ఆధిక్యం సంపాధించింది. రెండో సగం ఆరంభమైన నాలుగు నిమిషాలకే మరో పెనాల్టీ సంపాదించింది. కానీ ఈ పెనాల్టీని భారత్ సద్వినియోగం చేసుకోలేక పోయింది. ఈ మ్యాచ్ లో మలేషియా కూడా పెనాల్టీలను సంపాదించింది. కానీ భారత్ గోల్స్ కీపర్ శ్రీజేష్ మరో సారి గోల్స్ ను అడ్డుకున్నాడు. భారీ విజయం సాధించిన భారత్, ఆదివారం దక్షిణ కొరియాతో ఫైనల్లో తలపడనుంది...


No comments:

Post a Comment