Saturday, 31 August 2013

ఆ ఇద్దరి లో ...గెలుపెవరిది...?


ముంబై: ఐబిఎల్ (ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్) తుది సమరానికి నేడు తెరలేవనుంది. మరి కొద్ది గంటల్లో విజేత ఎవరనేది తేలిపోనుంది. ఎన్ ఎస్ సిఎ స్టేడియంలో జరిగే ఫైనల్లో హైదరాబాద్ హాట్ షాట్, అవధె వారియర్స్ అమీతుమి తేల్చుకోనున్నాయి. అయితే తొలి ఐబిఎల్ లీగ్ ఎవరు విజేతగా నిలుస్తారని ప్రేక్షలు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ టోర్నిలో మొదటి నుంచి ఓటమన్నది తెలియన సైనా నెహ్వాల్ ...ఫైనల్లో హాట్ ఫేవరెట్ గా భరిలోకి దిగుతోంది. మరో పక్క యువతార సింధూ...సంచలనాలు సృష్టిస్తుండటంతో అవధె వారియర్స్ ను కూడ తక్కువ అంచన వేయలేం.!ప్రపంచ స్థాయి క్రీడా కారులను ఓడించిన సింధూ ..మంచి ఫామ్ కొనసాగిస్తుంది. అయితే ఒక వేళ్ల ఫైనల్లో సింధూ నిరాశ పర్చినా.. పురుషుల సింగిల్స్, డబుల్స్ లో , మంచి ఆటగాళ్లు ఉండటం అవధె వారియర్స్ కు కలిసొచ్చే అంశం..హైదరాబాద్ కు పెద్ద బలం సైనా నెహ్వాల్.. పురుషుల సింగిల్స్ లో అజయ్ జయరామ్ గెలుపు పైనే హైదరాబాద్ జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. డబుల్స్ లో షెమ్ గో, వాహ్ లిమ్ , మిక్స్ డ్ లో తరుణ్ కోనా..గాద్రె ఫామ్ లో ఉండటం హైదరాబాద్ హాట్ షాట్ కి కలిసొచ్చే అంశం. ఇద్దరు స్టార్ క్రీడా కారిణిలు తలపడుతున్న ఈ ఫైనల్, హోరాహోరిగా సాగుతుందనడంలో సందేహం లేదు.. రాత్రి 8గంటలకు ఈ మ్యాచ్ మొదలవనుంది.



No comments:

Post a Comment