Saturday, 31 August 2013

భారత రత్నమే...దాదా



కోల్ కతా: భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ పై మాజీ కెప్టెన్ సౌరవ్ గుంగూలీ
 పొగడ్తల వర్షం కురిపించాడు.. సచిన్ ఏది చేసినా దేశం కోసం చేస్తాడని తెలిపాడు.. ''నిజంగా నా దృష్టిలో సచిన్ ఓ లెజండర్, తను పార్లమెంట్ సభ్యుడుగా కొనసాగుతున్నా...అది కూడా దేశం కోసమే! సచిన్ నిజంగా భారత రత్నమే!'' అని అభిప్రాయపడ్డారు.తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని తను క్రికెట్ ను లోనే కొనసాగుతానని తెలిపారు. మరో వైపు ఇంగ్లాండ్ ఆట గాళ్లు యాషెస్ సిరిస్ గెలిచిన సందర్భంగా వాళ్లు పిచ్ పై మూత్ర విసర్జన చేసిన విషయం పై స్పందిస్తూ... ఆనందమనేది...డ్రస్సింగ్ రూమ్ కే పరిమితం కావాలే కానీ... మితి మీరొద్దని అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు లార్ట్స్ లో ఇండియా గెలిచినప్పుడు తాను చొక్కా విడిచి గింగిరాలు తిప్పానని ..ఆ సంఘటనకు ..ఇప్పుడు ఇంగ్లాండ్ క్రికెటర్లు ప్రవర్తించిన తీరుకు పోలికే లేదని కొట్టి పారేశారు. ఇంగ్లాండ్ క్రికెటర్లపై ఆ దేశ క్రికెట్ బోర్డు క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు

No comments:

Post a Comment