:. మొదటి
టైటిల్ కైవసం...
:. హైదరాబాద్ సంచలనం...
:. సైనా ఆట అద్భుతం...
:. సైనా ఆట అద్భుతం...
ముంబై:
హైదరాబాద్
హాట్ షాట్ తొలి ఐబిఎల్ టైటిల్
ను అందుకుంది. శనివారం
ముంబై సార్థార్ స్టేడియంలో
జరిగిన ఫైనల్ మ్యాచ్ లో
హైదరాబాద్ తిరుగులేని విజయం
సాధించింది. దీంతో
తొలి ఐబిఎల్ టైటిల్ దిక్కించుకున్న
టీంగా హైదరాబాద్ హాట్ షాట్
చరిత్ర సృష్టించింది.
అవధె వారియర్స్
పై తిరుగులేని అధిపత్యాన్ని
ప్రదర్శించిన సైనా కో అండ్
టీం....టైటిల్
ఎగరేసుకుపోవడంలో కీలక పాత్ర
పోషించారు. మొదట
పురుషుల సింగిల్స్ లో హైదరాబాద్
ఆటగాడు తనాంగ్ సాంగే...అవధె
వారియర్స్ ఆటగాడు శ్రీకాంత్
పై 21-10, 21-20,తేడాతో
విజయం సాధించాడు. అనంతరం
జరిగిన మహిళల సింగిల్స్ లో
సింధూ పై సైనా 21-15,
21-17తేడాతో
విజయం సాధించింది. అయితే
ఇంకో మ్యాచ్ మిగిలుండగానే
హైదరాబాద్ టైటిల్ ను
చేజిక్కించుకుంది.
తిరుగులేని
సైనా...
ఐబిఎల్
తొలి సిజన్ నుంచి తిరుగులేని
ఆదిపత్యాన్ని ప్రదర్శిస్తున్న
సైనా నెహ్వాల్ ....ఫైనల్లో
సైతం అదే జోరును కొనసాగించింది.
ఐబిఎల్ లో
సైనా అత్యుత్తమ షట్లర్ గా
కొనసాగింది. జట్టు
ఆడిన ప్రతీ మ్యాచ్ లోను బరిలోకి
దిగి..అన్నింట్లోనూ
నెగ్గిన ఏకైక క్రీడాకారిణి
ఆమే. నెహ్వాల్
మొత్తం 7విజయాలు
సాధించింది. సైనా
కాకుండా ఆడిన ప్రతీ మ్యాచ్
లో నెగ్గిన క్రీడా కారుడు
చాంగ్ వీ మాత్రమే . ఐతే
అతను 4 సింగిల్స్,
ఓ మిక్స్ డ్
డబుల్స్ మాత్రమే ఆడాడు.
విజేతలకు
ఫ్రైజ్ మనీ...
తొలి
ఐబిల్ గెలిచిన హైదరాబాద్
హాట్ షాట్ రూ 3.25 కోట్లు
దక్కించుకుంది. అయితే
ఈ టోర్నిలో రన్నరప్ గా నిలిచిన
అవధె వారియర్స్ కు 1.75
కోట్లు
చేజిక్కించుకుంది. అంతే
కాకుండా ఈ టోర్నీలో అత్యంత
వేగవంతమైన సర్వీస్ 279
కిలో మీటర్లలో
ముంబయి ఆటగాడు ఇవనోవ్ కొట్టాడు...........
No comments:
Post a Comment