Sunday 1 September 2013

పాక్ వన్డే సిరిస్ కైవసం...



హరారే: మూడు మ్యాచ్ ల వన్డే సిరిస్ ను పాకిస్తాన్ కైవసం చేసుకుంది. జింబాంబ్వే తో జరుగుతున్న ఈ సిరిస్ పాక్ 2-1తేడాతో సిరిస్ ను ఎగరేసుకుపోయింది.శనివారం హరారే స్పోర్స్ట్ క్లబ్ వేదికగా జరిగిన మూడో వన్డే పాకిస్తాన్ 108పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 50ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 260పరుగులు చేసింది. మిస్బా (67), అహ్మద్ షెహజాద్ (54)అర్థ సెంచరీతో చెలరేగారు. అయితే మిగతా బ్యాట్ మెన్స్ పర్వాలేదనిపించిన చివర్లో సర్ఫార్రాజ్ అహ్మద్ (22) వేగంగా ఆడాడు. జింబాంబ్వే బౌలర్లలో టెండి చతరాకు మూడు వికెట్లు దక్కాయి. అనంతరం 261పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాంబ్వే ఏమాత్రం విజయం వైపు దూసుకుపోకుండా చతికీలపడింది. 40ఓవర్లలో 152పరుగులు చేసి ఆలౌటై ఓడింది. వాలర్ (48)తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. పాక్ బౌలర్లలో మహ్మద్ హఫీజ్, అబ్దుల్ రెహమాన్ , అజ్మల్ తలా రెండేసి వికెట్లు తీశారు. 67పరుగులు చేసిన మిస్బాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ , హాఫీజ్ కు ప్లేయర్ ఆఫ్ ద సిరిస్ అవార్డులు అభించాయి

No comments:

Post a Comment