ముంబై:
సచిన్
టెండూల్కర్ తన 200వ
టెస్టు మ్యాచ్ ను స్వదేశంలోనే
ఆడనున్నాడు...
ఈ మెరకు బిసిసిఐ ఓ ప్రకటన
విడుదల చేసింది.
ఆదివారం
సాయంత్రం సర్వ సభ్య సమావేశమైన
బిసిసిఐ,
భారత్
వెస్టిండీస్ టెస్టు మ్యాచ్ షెడ్యూల్ ను ఖరారు చేశారు.
రెండు
టెస్టు మ్యాచ్ లు,
ఐదు
వన్డే మ్యాచ్ ల సిరీస్ కోసం వెస్టిండీస్
కు ప్రతిపాదన పంపింది.
అయితే
ఈ ఏడాది చివర న భారత్ సౌతాఫ్రికా
తో టెస్టు సిరిస్ ఆడటానికి
వెళ్లనుంది.
అయితే
సౌతాఫ్రికా టూరు కంటే ముందు
భారత్ లోనే వెస్టిండీస్ తో
టెస్టు సిరిస్ నిర్వహించాలని
చూస్తుంది.
ఈ
సవరణ భారత క్రికెట్ లెజండర్
మాస్టర్ బ్లాస్టర్ సచిన్
టెండూల్కర్ గురించేనని
తెలుస్తుంది.
సౌతాఫ్రికా
టూరు తరువాత టెస్టు క్రికెట్
కు గుడ్ బై చెపుతాడని వస్తున్న
కథనల నేపథ్యంలో, ఇప్పుడు
వెస్టిండీస్ సిరిస్ సచిన్
కోసమేనని బిసిసిఐ చెప్పకనే చెప్పడంతో, ఆతని రిటైర్మెంట్ పై ఊహాగానాలు
ఊపందుకున్నాయి.
అయితే
క్రికెట్ నిపుణులు మాత్రం సచిన్
ఎక్కడైనా, ఏ
దేశంలోనైనా ఆడగలడని ప్రత్యేకించి
సచిన్ కోసం టెస్టు షెడ్యూల్
మార్చాల్సిన పనిలేదని వారు
అభిప్రాయపడుతున్నారు.
కానీ
కొందరు మాత్రం సచిన్ కు
స్వదేశంలో నే సగర్వంగా రిటేర్
మెంట్ ప్రకటించే సువర్ణ అవకాశం
దొరికిందని అంటున్నారు.
ఏదేమైనా సచిన్
భారత్ క్రికెట్ కు చేసిన
సేవలను గుర్తించి,
బిసిసిఐ
ఈ నిర్ణయం తీసుకుందని అభిప్రాయాలు
వెలువడుతున్నాయి.
No comments:
Post a Comment