Sunday, 1 September 2013

ఆసియా కప్ సొంతం చేసుకున్న కొరియా..



మలేషియా: దక్షిణ కొరియా ఆసియా కప్ ను ఎగరేసుకు పోయింది. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్ పై కొరియా 4-3గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. లీగ్ దశలో దక్షిణ కొరియాను మట్టి కరిపించిన భారత్, ఫైనల్లో మాత్రం ఆ ప్రభావం చూపలేక పోయింది. అయితే ఇప్పటికే భారత్ ప్రపంచ కప్ కు అర్హత సాధించడంతో ఆ జట్టు ఊపిరి పీల్చుకుంది. వరుస మ్యాచ్ లో విజయంసాధించి ఫైనల్ ట్రోపి తీసుకొస్తారని ఆశించిన అభిమానులకు నిరాశే మిగిలింది. 2007 చెన్నై లో జరిగిన టోర్నీలో విజేతగా నిలిచి, ఆ తర్వాత ఘోరంగా విఫలమైంది. ఆ టోర్నీలో భారత్ ఏడో స్థానంలో నిలబెట్టుకుంది. అయితే ఈ ఏడాది మాత్రం అనూహ్య విజయాలతో దూసుకుపోయినా, ఫైనల్లో మాత్రం చేతులెత్తేసింది. కానీ అభిమానులకు ఊరట నిచ్చే అశం...ప్రపంచ కప్ కు  అర్హత సాధించడం...!

No comments:

Post a Comment