Monday, 2 September 2013

ఫిక్సింగ్ కు అన్ని దారులు బంద్...


కోల్ కతా: త్వరలో జరగబోయో ఛాంపియన్ లీగ్ మ్యాచ్ లో క్రీడా కారులు మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడకుండా ఐదు నిబంధనలను బిసిసిఐ  ప్రతిపాదించింది. ఈ మెరకు ఆదివారం జగ్మోహన్ దాల్మీయా అధ్యక్షతన జరిగిన బిసిసిఐ వర్కింగ్ కమిటి సమావేశంలో ఈ నిర్ణయాని కి సభ్యులు ఏక గ్రీవంగా తీర్మాణం తెలిపారు.
: టోర్నీలో ప్రతీ జట్టుకు సెక్యూరిటీ విభాగంతో పాటు అవినీతి నిరోధక బృందం వెన్నంటే ఉంటుంది.
:మ్యాచ్ అధికారులు సంచరించే చోట మిగతావారు సంచరించకుండా కట్టుదిట్టమైన నిఘా ఉంటుంది.
:ఈ టోర్నీలో ఆటగాళ్లు.మ్యాచ్ సిబ్బంది ఎలాంటి బహుమతులు స్వీకరించరాదు. ఒక వేళ్ల వాటిని స్వీకరించినా, దానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంటుంది.
:టోర్నీ సందర్భంగా తమ సెల్ ఫోన్స్ ను ఆటగాళ్లు , అధికారులకు అప్పగించాలి. వీరి కోసం వచ్చే కాల్స్ అన్నీ టీమ్ మేనేజర్ చూసుకుంటారు.

:5 నిబంధనల్నీ అమలు చేసే విషయంలో వీలైతే అవినీతి నిరోదక భద్రత విభాగం స్థానికపోలీసుల సహాయాన్ని తీసుకుంటుంది.   

No comments:

Post a Comment