Thursday, 5 September 2013

రెండో అనధికార టెస్టు డ్రా....



విశాఖ: భారత్-, న్యూజిలాండ్ ఎ జట్ల మధ్య జరిగిన రెండో అనధికార టెస్టు డ్రా గా ముగిసింది. దీంతో రెండు మ్యాచ్ ల సిరీస్ ఎలాంటి ఫలితం తేలకుండానే ముగిసింది. విశాఖ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో గురువారం, ఆఖరి రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ ఆట ముగిసే సమయానికి 51.2 ఓవర్లలో 3వికెట్లకు 176 పరుగులు చేసింది. డి బోర్డర్ (11నాటౌట్), కొరి జే అండర్సన్ (26నాటౌట్) క్రీజులో ఉన్నారు. లాథమ్ 61 , కార్ల్ కచోపా 76 వేగంగా ఆడారు. మొత్తానికి ఈ మ్యాచ్ ద్వారా కివీస్ టాప్ ఆర్డర్ బ్యాట్స్ మన్ కు బ్యాటింగ్ పాక్టీస్ లభించింది. రాకేష్ ధ్రువ్ 2, ధావల్ కులకర్ణీ ఒక్క వికెట్ తీశారు. అంతకుముందు 408/7ఓవర్ నైట్ స్కోరు తో ఆఖరి రోజు ఆట కొనసాగించిన భారత తొలి ఇన్నింగ్స్ లో 135.3 ఓవర్లలో 430 పరుగులకు ఆలౌటైంది. మన్ ప్రీత్ జునేజా డబుల్ సెంచరీ చేజార్చుకున్నాడు.. లోయర్ ఆర్డర్ లో ఎవరు పెద్దగా రాణించలేదు. ఉదయం లభించన 22 పరుగుల్లో జూనే జానే 15 పరుగులు చేశాడు. చివరకు మార్క్ గిలెస్పీ బౌలింగ్ లో అండర్సన్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. కివీస్ బౌలర్లలో గిలెస్సీ 4, బ్రాస్ వెల్ 3, ఆస్టలే 2 వికెట్లు తీశారు...  

No comments:

Post a Comment