న్యూయార్క్:
గాయంతో ఏడు
నెలల పాటు ఆటకు దూరమైన స్పెయిన్
బుల్ రఫెల్ నదల్ మళ్లీ గాడిలో
పడ్డాడు. కచ్చితమైన
సర్వీస్ , బలమైన
గ్రౌండ్ స్ట్రోక్స్ తో బ్యాక్
హాండ్ ఫోర్ హ్యాండ్ షాట్లతో
మునుపటి ఆట తీరును ప్రదర్శిస్తున్నాడు.
ఫ్రిబ్రవరిలో
పునరాగమనం తర్వాత తొమ్మిది
టైటిల్స్ గెలిచిన ఈ ప్రపంచ
రెండో ర్యాంకర్, యుఎస్
ఓపెన్ లోనూ అదరగొడుతున్నాడు.
భారత కాలమానం
ప్రకారం బుధవారం అర్థరాత్రి
జరిగిన పురుషుల సింగిల్స్
క్వాటర్ ఫైనల్లో రెండో సీడ్
నాదల్ 6-0, 6-2,6-2తో
సహచరుడు, 19వ
సీడ్ టోమి రొబ్రెడో (స్పెయిన్)పై
విజయం సాధించాడు. తద్వారా
ఐదోసారి సెమీ ఫైనల్లోకి
ప్రవేశించాడు. గంటా
40 నిమిషాల
పాటు జరిగిన ఈ మ్యాచ్ యుఎస్
ఓపెన్ లో అతి తక్కువ సమయం
జరిగిన క్వార్టర్స్ మ్యాచ్
గా రికార్డులకెక్కింది.
టోర్నీ
మొత్తంలో ఒక్కసారి కూడా
సర్వీస్ కోల్పోని నాదల్ ఈ
మ్యాచ్ లోనూ అదే ఊపును
కొనసాగించాడు. సహచరుడి
నుంచి పెద్దగా ప్రతిఘటన
లేకపోవడంతో తొలిసెట్ ను 22
నిమిషాల్లోనే
ముగించాడు. మూడు
బ్రేక్ పాయింట్లను కాపాడుకుని,
రెండు సార్లు
సర్వీస్ ను నిలబెట్టుకున్నాడు.
రెండో సెట్
లో రొబ్రెడో కాస్త పుంజుకున్నట్లు
కనిపించినా... ప్రత్యర్థి
బలమైన స్ట్రోక్స్ ముందు
నిలవలేకపోయాడు. నాదల్
నెట్ వద్ద నాలుగు పాయింట్లు
గెలుచుకుని రెండు బ్రేక్
పాయింట్లను సద్వినియోగం
చేసుకున్నాడు. రెండు
ఏస్ లను సంధించడంతో పాటు ఏడో
గేమ్ ను నిలబెట్టుకుని సెట్
ను సొంతం చేసుకున్నాడు.
మ్యాచ్
మొత్తంలో నాదల్ 28 విన్నర్లు
సాధిస్తే..రొబ్రెడో
డబుల్ ఫాల్ట్ (4)చేయడంతో
పాటు 21 సార్లు
అనవసర తప్పిదాలు చేసి మూల్యం
చెల్లించుకున్నాడు.
No comments:
Post a Comment