ఢిల్లీ:
యూపీఏ-2
ప్రభుత్వం
చివరి కానుకగా కేంద్ర ప్రభుత్వ
ఉద్యోగులకు పిల్లల విద్యా
భత్యం సహా కొన్ని గ్రాంట్లను
పెంచింది. విద్యాభత్వం
వార్షిక పరిమితిని రూ.18,000(నెలకు
రూ.1,500) చేస్తున్నట్లు
సిబ్బంది వ్యవహారాల శాఖ జారీ
చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.
ప్రస్తుతం
ఈ మొత్తం రూ.12,000గా
ఉంది. వైకల్యం
ఉన్న మహిళల పిల్లల సంరక్షణకు
ప్రత్యేక భత్వం ప్రస్తుతం
నెలకు రూ. వెయ్యి
ఉండగా దాన్ని రూ.1,500చేశారు.
వైకల్యం ఉన్న
పిల్లల విద్యాభత్వం వార్షిక
పరిమితిని రూ.36,000 చేశారు.
సవరించిన
మొత్తాలన్నీ ఈ ఏడాది జనవరి
1 నుంచి
వర్తిస్తాయి.
ఈ అక్షరాలు ఓ పేదవాడికి అన్నం పెట్టాలి...! నిండు జీవితాలకు ప్రాణం పోయాలి..! ఓ విద్యార్థికి ఆయుధాన్ని ఇవ్వాలి..! ప్రేమికులకు ఓదార్పునివ్వాలి..! అప్పుడే కలలకు ఓ దారి దొరుకుతుంది....
Wednesday, 7 May 2014
కటక్ లో చెన్నై కటకట...!
కటక్:
ఐపిఎల్-7లో
భాగంగా పంజాబ్, చెన్నై
మధ్య జరుగుతున్న మ్యాచ్ లో
పంజాబ్ సూపర్ విక్టరీ
సాధించింది.44పరుగుల
తేడాతో ఘన విజయం సాధించింది.
విధ్వంసకర
మ్యాక్స్ వెల్ మరో సారి తన
ప్రతాపాన్ని చూపించడంతో
మొదటగా పంజాబ్ నిర్ణీత 20ఓవర్లకు
231పరుగులు
చేసింది. మ్యాక్స్
వెల్ 38బంతుల్లోనే
ఆరు ఫోర్లు, ఎనమిది
సిక్సర్లతో 90పరుగులు
చేసి తన విశ్వరూపం చూపించాడు.
వీరేంద్ర
సెహ్వాగ్ (30), మిల్లర్
(47), బేయిల్
(40) రాణించడంతో
భారీ స్కోర్ చేయగలిగింది.
232పరుగుల అతి
పెద్ద లక్ష్యంతో బరిలోకి
దిగిన చెన్నై కి ఆదిలోనే
ఎదురుదెబ్బ తగిలింది.
ఐదు పరుగులకే
ఆ జట్టు తొలి వికెటు కోల్పోయింది.
డూప్లీయస్
ఒక్కడే 52 పరుగులు
చేసి ఆకట్టుకున్నాడు.
మిగతా బ్యాట్స్
మెన్స్ ఎవరూ రాణించక పోవడంతో
187పరుగులే
చేయగలిగింది. పంజాబ్
బౌలర్లలో జాన్సన్ కి రెండు
వికెట్లు దక్కాయి.
90పరుగులు ఒక్క
వికెట్ తీసిన మ్యాక్స్ వెల్
కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు
లభించింది.
Subscribe to:
Posts (Atom)