శ్రీకాకుళం: భార్యను కడతేర్చి మృత దేహాన్ని కాలువలో పడేసిన ఘటన సంతకవిటి మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...కాకరాపల్లిలో నివాసముంటున్న అనంతరావు శనివారం సాయంత్రం భార్యను చంపి మృత దేహాన్ని కాలువలో పడేశాడు. అనంతరం ఏమీ తెలియని అమాయకుడిలా తన భార్య కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే అతనిపై ముందునుండి అనుమానంతో ఉన్న గ్రామస్తులు, బంధువులు, తన వ్యవహార శైలి పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు అనంతరావే ఈ హత్య చేశాడని తేల్చారు. దీంతో అతనిని కఠినంగా శిక్షించాలని బాధితురాలి బంధువులు, గ్రామ ప్రజలు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు.
ఈ అక్షరాలు ఓ పేదవాడికి అన్నం పెట్టాలి...! నిండు జీవితాలకు ప్రాణం పోయాలి..! ఓ విద్యార్థికి ఆయుధాన్ని ఇవ్వాలి..! ప్రేమికులకు ఓదార్పునివ్వాలి..! అప్పుడే కలలకు ఓ దారి దొరుకుతుంది....
Sunday, 21 July 2013
'చిరు'ని కలిసిన అఖిలేష్
హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవిని కలిశారు. రెండు రోజుల రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఆయన సిఎం, ప్రతిపక్షనేతతో పాటు రాష్ట్రంలోని పలువురు నేతలతో భేటీ అయ్యారు. నగరంలో జరిగే అఖిల భారత యాదవ మహాసభ జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొనే ముందు ఆయన చిరును కలిశారు. ఇదే సమయంలో అఖిలేష్ యాదవ్‌ను పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, మంత్రులు గంటా, వట్టి వసంత కుమార్ కలిశారు.
ఐదేళ్ల బాలికపై వృద్దుడు అత్యాచారం

ఆదిలాబాద్ : అభం శుభం తెలియని ఐదేళ్ల బాలికపై 70 ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. స్థానికంగా కలకలం రేపిన ఈ సంఘటన భైంసా పట్టణంలో ఆదివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... జిల్లాలోని భైంసా పట్టణంలో కొర్వగల్లీకి చెందిన షేక్ మానామ్ అనే 70 ఏళ్ల వృద్ధుడు అదే కాలనీకి చెందిన ఐదేళ్ల బాలికకు మాయమాటలు చెప్పి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని షేక్ మానామ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
Subscribe to:
Posts (Atom)