Monday, 26 August 2013

ఐదో టెస్టు డ్రా..సిరిస్ కైవసం చేసుకున్న ఇంగ్లాండ్...

లండన్: ఆస్ట్రేలియా , ఇంగ్లాండుల మధ్య జరుగుతున్న ఐదో టెస్టు డ్రా గా ముగిసింది. ఐదు టెస్టుల సిరిస్ లో ఇంగ్లాండ్ 3-0 తేడాతో యాషెస్ కప్ సొంతం చేసుకుంది. అయితే ఈ సిరిస్ లో పూర్తిగా విఫయమైన ఆస్ట్రేలియా జట్టు, కనీసం ఈ టెస్టులోనైనా గెలిచి తీరుదామని పట్టుదలతో ఉంది. దానికి దగ్గట్టే మంచి స్కోరు ను సాధించింది. కానీ నాలుగో రోజు ఆట మొత్తం వర్షం కారణంగా రద్దవడంతో ఆస్ట్రేలియా గెలుపుపై నీళ్లు చల్లినట్టేంది. దీంతో ఐదో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 266 స్కోరు వద్ద కెప్టెన్ మైకెల్ క్లార్క్ ఇన్నింగ్ ను డిక్లేర్ చేశాడు. దీంతో స్వల్ప లక్ష్యాన్ని చేదించే దశలో ఇంగ్లాడ్ దాటిగా ఆడింది. అయితే కెవిన్ పీటర్సన్ అద్భుత బ్యాటింగ్ తో (55బంతుల్లో 62 పరుగులు ) ఇంగ్లాండు విజయం వైపు తరలించాడు. అయితే వరుస బంతుల్లో పిటర్ సన్, ట్రాట్ అవుట్ కావడంతో ఇంగ్లాండ్ దూకుడు తగ్గింది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.

No comments:

Post a Comment