Sunday, 25 August 2013

కల నీరుగారే...

లండన్: యాషెస్ సిరిస్ లో కనీసం చివరి టెస్టులోనైనా గెలిచి తీరుదామని పట్టుదలతో ఉన్న కంగారులకు, కంగారు తప్పలేదు... వర్షం కారణంగా ఐదో టెస్టు నాలుగో రోజు మ్యాచ్ నిలిచిపోయింది. దీంతో ఐదో రోజు మ్యాచ్ జరిగినా డ్రాగా ముగిసే ఛాన్స్ ఉండటంతో ఆస్ట్రేలియా ఆశలు సన్నగిల్లాయి. ఉదయం నుంచి వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుంది. దీంతో మైదాపం పై కప్పిఉంచిన కవర్లును తొలగించలేదు. ఫలితంగా ఒక్క బంతి ఆట కూడా సాధ్యపడలేదు. చివరకు స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4గంటలకు మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మ్యాచ్ కు ఆదివారం చివరి రోజు కావడంతో ఫలితం రావడం కష్టం. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 492/9 వద్ద డిక్లేర్ చేయగా ప్రస్తుతం ఇంగ్లాండ్ 247/4 స్కోరుతో ఉంది.

No comments:

Post a Comment