Sunday, 25 August 2013

ఇంకా సత్తాఉంది...యువీ

న్యూఢిల్లీ:తనకు ఇంకా క్రికెట్ ఆడే సత్తా ఉందని క్రికెటర్ యువరాజ్ సింగ్ అన్నారు. తన వయస్సు ఇంకా 32సంవత్సరాలే నని మూడు ఫార్మాట్ లో ఆడగలనని తెలిపారు. ఆయన శనివారం తన నూతన అకాడమీ ప్రారంభించిన సందర్భంగా యువి పలు విషయాలు మాట్లాడారు. తన తిరిగి జట్టులోకి రావడానికి తీవ్ర కృషి చేస్తున్నానని వ్యాఖ్యానించారు. దేశవాలి క్రికెట్ కోసం ఆత్రుతతో ఎదురు చూస్తున్నానన్నారు. భారత జట్టులోకి కుర్రాల్ల రాక శుభ పరిణామమని , వాళ్లు అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉమేష్ యాదవ్, ఇషాంత్ లాంటి మంచి బౌలర్లు ఉన్నారన్నాడు. తాను సాధన చేసేటప్పుడు అన్ని వసతులు ఒకే చోట ఉండేవికాదని , ప్రాక్టీస్ ఓ చోట , జిమ్, స్విమ్మింగ్ ఓచోట చేసేవారమని వివరించాడు. ఇప్పుడు క్రికెటర్లకు అలాంటి పరిస్థితి లేదని , అన్ని వసతులు ఒకే చోట ఉన్నాయన్నాడు.

1 comment:

  1. చాలా మంచి న్యూస్ పెట్టావు..

    ReplyDelete