Sunday, 25 August 2013

ఒమన్ హాకీ పై భారత్ హాకీ అద్భుతం...

ఇఫో:నవదీప్ సింగ్ అద్భుత హ్యాట్రిక్ గోల్స్ తో భారత్ హాకీ జట్టు సంచలన విజయం సాధించింది. 8-0గోల్స్ తేడాతో పసికూన 'ఒమన్'ను చిత్తుగా ఓడించింది. మొదటి నుంచి ఆటలో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన భారత్, రెండు అర్థ బాగాల్లో నాలుగేసి గోల్స్ కొట్టింది. మన్ దీప్ (4వ, 40వ, 44వ,నిమిశాల్లో) మూడు గోల్స్ చేయగా....రమణ్ దీప్ 17వ, రఘునాథ్ 28వ, రూపిందర్ సింగ్ 34వ, మలక్ సింగ్ 47వ, ఉతప్ప 69వ తలా ఓ గోల్ సాధించారు. ప్రపంచ కప్ కు అర్హత సాధించాలంటే, టోర్నీ తప్పక గెలవాల్సిన భారత్,..ఒమన్ పై ఎదురుదాడికి దిగింది. వూహించినట్లుగానే ఆట ఎక్కువగా ఒమన్ హాఫ్ లోనే సాగింది. పదేపదే దాడులు చేస్తు భారత్ ఒమన్ జట్టును డిఫెన్స్ లోకి నెట్టింది. అయితే పెనాల్టీ కార్నర్ లను సద్వినియోగం చేయడం భారత్ కు ఇప్పటికీ సమస్యగానే ఉంది.ఈ మ్యాచ్ లో భారత్ కి మొత్తంఆరు పెనాల్టీ కార్నర్ దక్కగా అందులో కేవలం రెండు మాత్రమే సద్వినియోగం చేసుకుంది. మూడో నిమిషయంలో భారత్ కి తొలి పెనాల్టీ లభించగా దాన్ని ఒమన్ గోల్స్ కీపర్ అడ్డుకున్నారు.

No comments:

Post a Comment