Monday, 26 August 2013

ఒలింపిక్ కు దూరంగా ఉంచండీ...

న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఒలింపిక్ నియమ నిబంధనల ప్రకారమే, భారత్ ఒలింపిక్ సంఘం ఎన్నికలు నిర్వహించాలని ఢిల్లీలోని క్రిడాభిమానులు భారీ ర్యాలీ తీశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ఎన్నికలకు దూరంగాఉంచాలని వారు డిమాండ్ చేశారు. డోప్ పరీక్షలో దోషులుగా తేలిన అథ్లేట్లను పోటీలకు దూరంగా ఉంచాలన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారుని ఒలింపిక్ సంఘం నుంచి బహిష్కరించాలని మాజీ అథ్లెట్లు అభిప్రాయపడ్డారు. వారిని ఎన్నికలకు దూరంగా ఉంచాలని, ఈ నిర్ణయాన్ని సభ్యులందరూ తప్పక పాటించాలని జాతీయ రైఫిల్ సంఘం అధ్యక్షుడు రణిందర్ సింగ్ సలహా ఇచ్చాడు. మరో వైపు సెప్టెంబర్ 29 జరిగే ఎన్నికలకు అంతర్జాతీయ నియమ నిబంధనల ప్రకారం నిర్వహంచక పోతే నిషేదం తప్పదని అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం సీనియర్ సభ్యుడు ఫ్రాన్సిస్ కో ఢిల్లీలో ప్రకటించారు. భారత తరుపున ఒలింపిక్ పాల్గొనే అథ్లేట్లకు ఎలాంటి ఇబ్బందులు కలగవని ,కేంద్ర క్రీడా శాఖ మంత్రి జితేందర్ సింగ్ అన్నారు.

No comments:

Post a Comment