Monday, 26 August 2013

యుఎస్ ఓపెన్ కు రంగం సిద్ధం...

న్యూయార్క్: గ్రాండ్ స్లామ్ టోర్ని యుఎస్ ఓపెన్ టెన్నిస్ పోటీలు అమెరికాలోని ఆర్థర్ ఆష్ స్టేడియంలో ప్రారంభం కానున్నాయి. ప్రతి ఏటా టెన్నిస్ మహా సమరం ఆస్ట్రేలియా టోర్నితో ప్రారంభమై యుఎస్ టోర్నితో ముగిస్తుంది.. ప్రపంచంలోని నాలుగు గ్రాండ్ స్లామ్ టోర్నిగా అమెరికా టోర్నికి పేరుంది. ఈ టోర్నిని ఆగస్టు సెప్టెంబర్ నెలలో నిర్వహస్తుంటారు. తొలిసారిగా 1881లో ప్రారంభమైన యుఎస్ ఓపెన్ కు ఓ ప్రత్యేకత ఉంది. వింబుల్డన్ , ఆస్ట్రేలియా ఓపెన్, టోర్నమెంట్ లలో ఆఖరిసెట్ తప్పా... మిగతా సెట్ లో మాత్రమే టై బ్రేక్ ఉంటుంది . కానీ యుఎస్ ఓపెన్ లో మాత్రం అన్ని సెట్ లలో టై బ్రేక్ ఉంటుంది. ఇది ఈ టోర్ని ప్రత్యేకత. 1881నుంచి 1967వరకూ ఈ టోర్నీని అమెరికన్ నేషనల్ ఛాంపియన్ టోర్నీగానే నిర్వహించేవారు. అయితే తొలిసారిగా 1968లో తొలిసారిగా ఈ టోర్నీని ఓపెన్ ఫార్మాట్ లోకి మార్చారు. 1987లో యుఎస్ ఓపెన్ సమరాన్ని నాలుగవ ప్రధాన గ్రాండ్ స్లామ్ టోర్నీగా మార్చారు. యుఎస్ ఒపెన్ టోర్నీని 1881నుంచి 1974వరకు గ్రాస్ కోర్టులో నిర్వహించారు. ఆతరువాత 1975నుంచి 1977వరకు క్లే కోర్టులో పోటీలను నిర్వహించారు. ఇక ఆతరువాత నుంచి ఇప్పటి వరకు సింతటిక్ డెకోటర్ఫ్ కోర్టులో నిర్వహిస్తున్నారు. ఈ డెకోటర్ఫ్ మామూలు కోర్టులు కాకుండా చాలా ఫాస్ట్ గా ఉంటుంది. బౌన్స్ తక్కువగా ఉండే ఈ టోర్నీలో రణించాలంటే టెన్నీస్ ప్లేయర్లకు పెద్ద సవాలే.. మురో వైపు ఈ అమెరికన్ ఓపెన్ లో ప్రైజ్ మనీ కూడా భారీ గా ఉంటుంది. ఈ పోటీల్లో విజేతగా నిలిచిన వారికి 25లక్షల అమెరికన్ డాలర్లు అందజేస్తారు. రన్నరఫ్ గా నిలిచిన వారికి తొమ్మిదిన్నర లక్షలు ప్రైజ్ మనీ గా అంధిస్తారు.

No comments:

Post a Comment