Thursday, 29 August 2013

రెండో వన్డేలో పాక్ విజయం....



పాక్: పాకిస్తాన్ రెండో వన్డేలో ఘన విజయం సాధించింది. జింబాంబ్వే తో జరుగుతున్న వన్డే సిరిస్ లో పాకిస్తాన్ 1-1తో సమం చేసింది. అయితే మొదటగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఫీల్డింగ్ ఎంచుకున్న జింబాంబ్వే...అనుకున్నట్లు గానే పాక్ ఓపెనర్స్ ను పెవీలియన్ చేర్చింది. అయితే మహ్మద్ హఫీజ్ స్ఫూర్తి దాయక సెంచరితో పాక్ 50ఓవర్లలో 299పరుగులు చేసింది. . హఫీజ్ 138 పరుగులు చేయగా... చివర ఆఫ్రీది సిక్సర్లతో విరుచుకుపడ్డాడు..దీంతో పాక్ స్కోర్ బోర్డు పరుగులు తీసింది. తరువాత 300పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాంబ్వే ఏమాత్రం విజయం వైపు దూసుకు పోలేదు. 42.4ఓవర్ల లోనే 204 పరుగులు మాత్రమే చేసింది.   

No comments:

Post a Comment