Thursday, 29 August 2013

'శ్రీ' పై దాదా చలోక్తులు...



కోల్ కతా: ఐపిఎల్-6 లో40 లక్షల రూపాయల మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడిన శ్రీశాంత్, ఆడబ్బు మొత్తం ఏం చేస్తాడని మాజీ కెప్టెన్ సౌరప్ గంగూలీ అన్నారు..  బుధవారం ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఫిక్సింగ్ పై పలు సూచనలు చేశారు. శ్రీశాంత్ ఫిక్సింగ్ పాల్పడ్డాడో! లేదో! తనకు తెలియదని ...ఒక వేళ్ల ఆ పని చేసి ఉంటే నిజంగా మూర్ఖత్వమే అవుతుందని అభిప్రాయపడ్డారు.శ్రీశాంత్ డబ్బులే లక్ష్యంగా పెట్టుకుంటే ఒక్క టెస్టు ఆడితే ఆ మొత్తం వస్తుందన్నాడు. మూడు టెస్టుల మ్యాచ్ లో ఇరవై వికెట్లు తీసి ఉంటే దానికి డబుల్ రెట్లు డబ్బు వచ్చేదని తెలిపాడు. మరో వైపు ఫిక్సింగ్ వ్యవహారం భారత క్రికెట్ ను దెబ్బ తీయదని అన్నాడు... ఒక చెరువులో , లేదా ఒక నదిలో మంచి చేపలు ఉంటాయి... చెడు చేపలు ఉంటాయి... కానీ చెడు చేపల వల్ల ఆ నది మొత్తం పాడు కాదు కదా....!అని తెలిపారు. అదేవిదంగా భారత్ క్రికెట్ వ్యవస్థలో చాలా మంది మంచి వారు ఉన్నారు. చెడ్డ వారు ఉన్నారు. అంత మాత్రాన క్రికెట్ వ్యవస్థ దెబ్బ తినదని అభిప్రాయపడ్డారు.    

No comments:

Post a Comment