Wednesday, 4 September 2013

ఇక 'నో' ఛీర్ లీడర్స్...

.

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) అంటే అభిమానులకు , పరుగుల వేట, వికెట్ల దాహం, కళ్లు చెదిరే ఫీల్డింగ్, మైమరిపించే ఛీర్ లీడర్స్ ...ఇవన్నీ అభిమానులకు హంగామా పుట్టించేవి.. కానీ ఇక నుంచి ఐపిఎల్ ల్లో ఛీర్ లీడర్స్ ఉండరని భారత క్రికెట్ నియంత్రణ మండలీ (బిసిసిఐ)తెలిపింది. సెప్టెంబర్ 1న కోల్ కతాలో జరిగిన బిసిసిఐ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఈ నెల 17 నుంచి ఆరంభం కానున్న ఛాంపియన్ ట్రోపి నుంచి ఛీర్ లీడర్స్ నిషేదం అమలు అవుతుందని తెలుస్తుంది. ఇప్పటికే స్పాట్ ఫిక్సింగ్ పాల్పడకుండా కట్టిన నిర్ణయాలు తీసుకున్న సంగతీ తెలిసిందే.!

No comments:

Post a Comment