Wednesday, 4 September 2013

డేర్ డెవిల్స్ కోచ్ గా కిర్ స్టన్..



హైదరాబాద్: ఇండియాకు ప్రపంచ కప్ అంధించడంలో ముఖ్య భూమిక పోషించిన భారత క్రికెట్ మాజీ కోచ్ గ్యారీ కిర్ స్టన్  మళ్లీ ఐపిఎల్ రూపంలో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుకు చీఫ్ కోచ్  బాధ్యతలు చేపట్టనున్నాడు. అంతర్జాతీయ టెస్టు ర్యాకింగ్స్ లో భారత్ ను అగ్రస్థానంలో నిలిపిన కిర్ స్టన్ , ఆ తర్వాత 2011లో జరిగిన ప్రపంచ కప్ వన్డే టోర్న మెంట్ లో ఇండియాను విజయ పథంలో నడిపించాడు. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అత్యంత ప్రజాదరణ పొందినజట్లలో ఒకటిగా ఉన్న ఢిల్లీ డేర్ డెవిల్స్ ఈ ఏడాది జరిగిన ఆరో ఎడిషన్ ఐపిఎల్ టోర్నీమెంట్ లో ఘోరంగా విఫలమైంది. మొత్తం 16 మ్యాచ్ లు ఆడిన ఢిల్లీ, 13మ్యాచ్ లో ఓడి మూడింట గెలిచింది.దీంతో పాయింట్ల పట్టికలో చివరిస్థానం సరిపెట్టుకుంది. అయితే ఈ సారి ఢిల్లీ డేర్ డెవిల్స్ అదృష్టాన్ని మార్చేందుకు కిర్ స్టన్ ను ప్రధాన కోచ్ గా నియమించారు. ఈ సందర్భంగా కిర్ స్టన్ మాట్లాడుతూ... ఇండియాకు గతంలో కోచ్ గా పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. మళ్లీ తన పాత శిష్యులను కలుసుకునే అవకాశం దొరుకుతోందని ఆనందం వ్యక్తం చేశారు.. విరాట్ కోహ్లీ గురించి ప్రస్తావిస్తూ... అంతర్జాతీయ క్రికెట్ లో విరాట్ ఓ సంచలనంగా మారాడని, తనను ఔట్ చేయడం బౌలర్లకు పెద్ద సమస్యగా మారిందని వ్యాఖ్యానించారు. కోహ్లీ పై తనకు మొదటి నుంచే ప్రత్యేకమైన అభిమానం ఉందని తెలిపారు. అతనొక అసాధారణ క్రికెటర్ అని వివరించారు... సచిన్ స్థానాన్ని విరాట్ పూడ్చుతాడా..!అనే ప్రశ్నకు  కిర్ స్టన్ ఆచితూచి స్పంధిస్తూ... సచిన్ స్థానంలో మరొకర్నీ ఊహించడం కష్టమని, ఆపని నేను చేయలేనని అన్నారు. ఊహాగానాలన్ని మీడియానే సృష్టిస్తుందని ఆది కేవలం మీడియాకే సాధ్యమని ఆయన అన్నారు.  

No comments:

Post a Comment