స్విట్జర్లాండ్:
''ఉసెన్ బోల్ట్''
వేదిక ఏదైనా
తన టార్గెట్ ఒక్కటే !గోల్డ్
మెడల్ సాధించడం. ప్రపంచ
ఛాంపియన్ షీప్ లో వరుసగా మూడు
పథకాలు సాధించి, చరిత్ర
సృష్టించిన బోల్ట్ ,
ఇప్పుడు
స్విట్జర్ ల్యాండ్ లో జరగుతున్న
''డైమెండ్''లీగ్
లో మరో సారి సత్తా చాటాడు.
వంద మీటర్ల
పరుగును 9.90 సెకన్లలో
పూర్తి చేసి గోల్డ్ మెడల్
సంపాధించాడు. ఈ
రేసులో ఎప్పటిలాగానే మెల్లగా
ప్రారంభించిన బోల్ట్ ,
ట్రాక్ మధ్యలో
పుంజుకుని బుల్లెట్ స్పీడ్
తో దూసుకుపోయాడు.
ఈ అక్షరాలు ఓ పేదవాడికి అన్నం పెట్టాలి...! నిండు జీవితాలకు ప్రాణం పోయాలి..! ఓ విద్యార్థికి ఆయుధాన్ని ఇవ్వాలి..! ప్రేమికులకు ఓదార్పునివ్వాలి..! అప్పుడే కలలకు ఓ దారి దొరుకుతుంది....
Saturday, 31 August 2013
భారత రత్నమే...దాదా
కోల్
కతా: భారత
క్రికెట్ దేవుడు సచిన్
టెండూల్కర్ పై మాజీ కెప్టెన్
సౌరవ్ గుంగూలీ
పొగడ్తల వర్షం
కురిపించాడు.. సచిన్
ఏది చేసినా దేశం కోసం చేస్తాడని
తెలిపాడు.. ''నిజంగా
నా దృష్టిలో సచిన్ ఓ లెజండర్,
తను పార్లమెంట్
సభ్యుడుగా కొనసాగుతున్నా...అది
కూడా దేశం కోసమే! సచిన్
నిజంగా భారత రత్నమే!''
అని
అభిప్రాయపడ్డారు.తనకు
రాజకీయాలపై ఆసక్తి లేదని తను
క్రికెట్ ను లోనే కొనసాగుతానని
తెలిపారు. మరో
వైపు ఇంగ్లాండ్ ఆట గాళ్లు
యాషెస్ సిరిస్ గెలిచిన సందర్భంగా
వాళ్లు పిచ్ పై మూత్ర విసర్జన
చేసిన విషయం పై స్పందిస్తూ...
ఆనందమనేది...డ్రస్సింగ్
రూమ్ కే పరిమితం కావాలే కానీ... మితి మీరొద్దని
అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు
లార్ట్స్ లో ఇండియా గెలిచినప్పుడు తాను చొక్కా విడిచి గింగిరాలు
తిప్పానని ..ఆ
సంఘటనకు ..ఇప్పుడు
ఇంగ్లాండ్ క్రికెటర్లు
ప్రవర్తించిన తీరుకు పోలికే
లేదని కొట్టి పారేశారు.
ఇంగ్లాండ్
క్రికెటర్లపై ఆ దేశ క్రికెట్
బోర్డు క్రమ శిక్షణ చర్యలు
తీసుకోవాలని సూచించారు. ఆ ఇద్దరి లో ...గెలుపెవరిది...?
ముంబై:
ఐబిఎల్ (ఇండియన్
బ్యాడ్మింటన్ లీగ్)
తుది సమరానికి
నేడు తెరలేవనుంది. మరి
కొద్ది గంటల్లో విజేత ఎవరనేది
తేలిపోనుంది. ఎన్
ఎస్ సిఎ స్టేడియంలో జరిగే
ఫైనల్లో హైదరాబాద్ హాట్ షాట్,
అవధె వారియర్స్
అమీతుమి తేల్చుకోనున్నాయి.
అయితే తొలి
ఐబిఎల్ లీగ్ ఎవరు విజేతగా
నిలుస్తారని ప్రేక్షలు
ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
ఈ టోర్నిలో
మొదటి నుంచి ఓటమన్నది తెలియన
సైనా నెహ్వాల్ ...ఫైనల్లో
హాట్ ఫేవరెట్ గా భరిలోకి
దిగుతోంది. మరో
పక్క యువతార సింధూ...సంచలనాలు
సృష్టిస్తుండటంతో అవధె
వారియర్స్ ను కూడ తక్కువ అంచన
వేయలేం.!ప్రపంచ
స్థాయి క్రీడా కారులను ఓడించిన
సింధూ ..మంచి
ఫామ్ కొనసాగిస్తుంది.
అయితే ఒక
వేళ్ల ఫైనల్లో సింధూ నిరాశ
పర్చినా.. పురుషుల
సింగిల్స్, డబుల్స్
లో , మంచి
ఆటగాళ్లు ఉండటం అవధె వారియర్స్
కు కలిసొచ్చే అంశం..హైదరాబాద్
కు పెద్ద బలం సైనా నెహ్వాల్..
పురుషుల
సింగిల్స్ లో అజయ్ జయరామ్
గెలుపు పైనే హైదరాబాద్ జట్టు
విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.
డబుల్స్ లో
షెమ్ గో, వాహ్
లిమ్ , మిక్స్
డ్ లో తరుణ్ కోనా..గాద్రె
ఫామ్ లో ఉండటం హైదరాబాద్ హాట్
షాట్ కి కలిసొచ్చే అంశం.
ఇద్దరు స్టార్
క్రీడా కారిణిలు తలపడుతున్న
ఈ ఫైనల్, హోరాహోరిగా
సాగుతుందనడంలో సందేహం లేదు..
రాత్రి 8గంటలకు
ఈ మ్యాచ్ మొదలవనుంది.
ఇక లక్ష్యం టైటిల్....
మలేషియా:
భారత హాకీ
జట్టు ఒలింపిక్ కు అర్హత
సాధించింది. శనివారం
మొదటి సెమీ ఫైనల్స్ లో దక్షిణ
కొరియా చేతిలో పాకిస్తాన్
2-1గోల్స్
తేడాతో ఓటమి చవి చూసింది.
దీంతో ఒలింపిక్
నిబంధనల ప్రకారం ఆసియా కప్
విజేత జట్టు గనుక ఇంతకు ముందే
ప్రపంచ కప్ బెర్తు దక్కించుకుంటే!
ఈ మెగా టోర్నీలో
అర్హత
టోర్నీగా ..గత
జూన్ జూలై, లలో
నిర్వహించిన హాకీ వరల్డ్
లీగ్ సెమీ ఫైనల్స్ రౌండ్ లో
ఆసియా జోన్ నుంచి అత్యుత్తమ
స్థానాలు పొందిన రెండు జట్లకు
అవకాశం లభిస్తుంది. ఈ
నిబంధన ప్రకారం...భారత్
ఒలింపిక్ కు అర్హత సాధించింది.
అయితే ఆసియా
కప్ లో తిరగులేని ఆట తీరును
ప్రదర్శిస్తున్న భారత్,
ఈ ఉత్సాహం
తోనే రెండో సెమీ ఫైనల్స్ లో
అతిథ్య జట్టు మలేషియాను 2-0
గోల్స్ తేడాతో
చిత్తు చేసింది. ఎనిమిదో
నిమిషంలో భారత్ కి తొలి పెనాల్టీ కార్నర్ లభించగా .... దాన్ని
స్టార్ డ్రాగ్ ప్లికర్ రఘునాథ్
గోల్ గా మలిచాడు. దీంతో
మొదటి అర్థ భాగం ముగిసే సరికి
భారత్ 1-0తో ఆధిక్యం సంపాధించింది.
రెండో సగం
ఆరంభమైన నాలుగు నిమిషాలకే
మరో పెనాల్టీ సంపాదించింది.
కానీ ఈ పెనాల్టీని
భారత్ సద్వినియోగం చేసుకోలేక
పోయింది. ఈ
మ్యాచ్ లో మలేషియా కూడా
పెనాల్టీలను సంపాదించింది.
కానీ భారత్
గోల్స్ కీపర్ శ్రీజేష్ మరో
సారి గోల్స్ ను అడ్డుకున్నాడు.
భారీ విజయం
సాధించిన భారత్, ఆదివారం
దక్షిణ కొరియాతో ఫైనల్లో
తలపడనుంది...Friday, 30 August 2013
'ఫించ్' పంచ్ కు ఇంగ్లాండ్ కుదేల్...
సౌతాంప్టన్:
ఇంగ్లాండ్
తో జరుగుతున్న తొలి టీ20లో
ఆస్ట్రేలియా విజయం సాధించింది.
ఆరోన్ ఫించ్
కల్లు చెదిరే బ్యాటింగ్ తో
భారీ శతకాన్ని నమోదు చేశాడు.
ఫించ్
(156,
63బంతుల్లో
11×4,14×6,)
తో
ఇంగ్లాండ్ బౌలర్లను ఓ ఆట
ఆడుకున్నాడు.
అయితే
ఆకాశమే హద్ధులుగా చెలరేగిన
ఫించ్ ...ఎడా
పెడా ఫోర్లు,
సిక్స్
లతో రెచ్చిపోయాడు.
ఈ
క్రమంలో అంతర్జాతియ టీ20మ్యాచ్
లో అత్యధిక వ్యక్తిగత స్కోరు
సాధించిన బ్యాట్స్ మెన్ గా
ఫించ్ రికార్డు సృష్టించాడు.
అయితే
ఈ మ్యాచ్ లో 14సిక్స్
లు బాదినఫించ్ దక్షిణా ఫ్రికా
బ్యాట్ మెన్ లెవి (13సిక్స్)
పేరిట
ఉన్న రికార్డును బద్దలు
కొట్టాడు.
సోమ్ దేవ్ శుభారంభం...
న్యూయార్:
భారత టెన్నీస్
స్టార్ సోమ్ దేవ్ దేవ్ వర్మ
యుఎస్ ఓపెన్ లో శుభారంభం
చేశాడు. పురుషుల
సింగిల్స్ తొలి రౌండ్ పోటిల్లో
లుకాస్ (సొలీవియా)
ఆటగాడిపై విజయం సాధించాడు.
రికార్డు
స్థాయిలో ఇద్దరు 3గంటల
పాటు హోరాహోరిగా పోరాడారు.
సోమ్ దేవ్
మొత్తం 4-6,6-1,
6-2,4-6,6-4సెట్లతో
తో లుకాస్ ను చిత్తు చేశాడు.
ప్రస్తుతం
అమెరికన్ ఓపెన్ లో ఐదు రౌండ్లు
ఆడటం ఇదే తొలిసారి...
సోమ్
దేవ్..రెండో
రౌండ్ లో ఆండ్రీయా సెప్సీతో
తలపడనున్నాడు...
ఫైనల్లో వారియర్స్....
బెంగళూరు:
ఐబిఎల్
రెండో సెమీ ఫైనల్ ముగిసింది.
ఫైనల్స్
లో హైదరాబాద్ హాట్ షాట్ కు
దీటైన ప్రత్యర్థిని నేనే
అంటూ... అవధె
వారియర్స్ రంగం సిద్ధం
చేసుకుంది.
అయితే
గురువారం జరిగిన రెండో సెమీ
ఫైనల్స్ లో ముంబై మాస్టర్స్
ను అవధె వారియర్స్ 3-2
చిత్తుగా
ఓడించింది.
మహిళల
సింగిల్స్ లో యువతార సింధూ
మరో సారి మెరిసింది.
కళ్లు
చెదిరే స్మాష్ లతో ప్రత్యర్థిని
చిత్తు చేసింది.
21-16, 21-13 తో
వరుస గేమ్ ల్లో బాన్ పై విజయం
సాధించింది.
మరో వైపు
పురుషుల సింగిల్స్ లో లీ చాంగ్
వీ (ముంబయి
మాస్టర్స్)21-15,21-7తో
గురు సాయిదత్ అవధె వారియర్స్
ను వరుస గేమ్ లల్లో ఓడించి
జట్టుకు 1-0
అధిక్యాన్ని
అంధించాడు.
అయితే
పురుషుల డబుల్స్ లో ముంబై
మాస్టర్స్ ఓడిపోవడంతో ...2-2తో
సమం చేశాడు .
ఫలితం తేలే
మిక్స్ డ్ డబుల్స్ లో కిడో-పియా
గెలిచి అవధె వారియర్స్ ను
ఫైనల్స్ కు చేర్చాడు..దీంతో
శనివారం ముంబయిలో ఫైనల్ మ్యాచ్
జరగనుంది.
మరో
సారి దూకుడుగా.....
పివి
సింధూ మరో సారి మెరిసింది.
టిన్ బాన్
తో గేమ్ లో సింధూ ఆరంభం నుంచి
దూకుడుగా ఆడింది.
ప్రత్యర్థి
ఎత్తులను గమనిస్తూ...
గ్రౌండ్
మొత్తం ఆడించింది.
చక్కని
ప్లేస్ మెంట్స్ ఆడుతూ..ప్రత్యర్థిని
21-13 తో
రెండో గేమ్ తో పాటు మ్యాచ్
ను కూడా కైవసం చేసుకుంది.
Thursday, 29 August 2013
రెండో వన్డేలో పాక్ విజయం....
పాక్:
పాకిస్తాన్
రెండో వన్డేలో ఘన విజయం
సాధించింది. జింబాంబ్వే
తో జరుగుతున్న వన్డే సిరిస్
లో పాకిస్తాన్ 1-1తో
సమం చేసింది. అయితే
మొదటగా టాస్ గెలిచి బ్యాటింగ్
ఫీల్డింగ్ ఎంచుకున్న
జింబాంబ్వే...అనుకున్నట్లు
గానే పాక్ ఓపెనర్స్ ను పెవీలియన్
చేర్చింది. అయితే
మహ్మద్ హఫీజ్ స్ఫూర్తి దాయక
సెంచరితో పాక్ 50ఓవర్లలో
299పరుగులు
చేసింది. . హఫీజ్
138 పరుగులు
చేయగా... చివర
ఆఫ్రీది సిక్సర్లతో
విరుచుకుపడ్డాడు..దీంతో
పాక్ స్కోర్ బోర్డు పరుగులు
తీసింది. తరువాత
300పరుగుల
లక్ష్యంతో బరిలోకి దిగిన
జింబాంబ్వే ఏమాత్రం విజయం
వైపు దూసుకు పోలేదు.
42.4ఓవర్ల లోనే
204 పరుగులు
మాత్రమే చేసింది.
హఫీజ్ అద్భుత సెంచరీ..పాక్ 299..
పాక్:
పాకిస్తాన్,
జింబాంబ్వే
రెండో వన్డే లో పాక్ మొదటి
ఇన్నింగ్స్ లో 299పరుగులు
చేసింది. మహ్మద్ హఫీజ్ అద్భుత సెంచరీతో పాక్
కు గౌరవ ప్రదమైన స్కోరు ను
అంధించాడు. అయితే
మొదట టాస్ గెలిచి ఫీల్డీంగ్
ఎంచుకున్న జింబాంబ్వే పాక్
ఓపెనర్స్ ను త్వరగా పెవీలియన్
కు తరలించారు. అయితే
ఈ మిడిలార్డర్ లో వచ్చిన హఫీజ్
అద్భుత బ్యాటింగ్ తో (130బంతుల్లో
136 ) పరుగులు
చేశారు. తొమ్మిది
ఫోర్లు, ఐదు
సిక్సర్లతో హఫీజ్ జింబాంబ్వే
బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
అయితే చివరగా
ఆఫ్రిది 23బంతుల్లో
మూడు సిక్సర్లు, ఒక
ఫోర్ తో 39 పరుగులు
చేసి పాక్ స్కోర్ బోర్డు
వేగాన్ని పెంచారు. అయితే
ఐదో వికెట్ కు ఆఫ్రిది,
మహ్మద్ హఫీజ్
లు 86 పరుగుల
బాగ స్వామ్యం నెల కొల్పారు.
'శ్రీ' పై దాదా చలోక్తులు...
కోల్
కతా: ఐపిఎల్-6
లో40 లక్షల
రూపాయల మ్యాచ్ ఫిక్సింగ్ కు
పాల్పడిన శ్రీశాంత్,
ఆడబ్బు మొత్తం
ఏం చేస్తాడని మాజీ కెప్టెన్
సౌరప్ గంగూలీ అన్నారు..
బుధవారం
ఓ ప్రైవేట్ కార్యక్రమంలో
పాల్గొన్న ఆయన ఫిక్సింగ్ పై
పలు సూచనలు చేశారు.
శ్రీశాంత్
ఫిక్సింగ్ పాల్పడ్డాడో!
లేదో!
తనకు తెలియదని
...ఒక
వేళ్ల ఆ పని చేసి ఉంటే నిజంగా
మూర్ఖత్వమే అవుతుందని
అభిప్రాయపడ్డారు.శ్రీశాంత్
డబ్బులే లక్ష్యంగా పెట్టుకుంటే
ఒక్క టెస్టు ఆడితే ఆ మొత్తం
వస్తుందన్నాడు. మూడు
టెస్టుల మ్యాచ్ లో ఇరవై వికెట్లు
తీసి ఉంటే దానికి డబుల్ రెట్లు
డబ్బు వచ్చేదని తెలిపాడు.
మరో వైపు
ఫిక్సింగ్ వ్యవహారం భారత
క్రికెట్ ను దెబ్బ తీయదని
అన్నాడు... ఒక
చెరువులో , లేదా
ఒక నదిలో మంచి చేపలు ఉంటాయి...
చెడు చేపలు
ఉంటాయి... కానీ
చెడు చేపల వల్ల ఆ నది మొత్తం
పాడు కాదు కదా....!అని
తెలిపారు. అదేవిదంగా
భారత్ క్రికెట్ వ్యవస్థలో
చాలా మంది మంచి వారు ఉన్నారు.
చెడ్డ వారు
ఉన్నారు. అంత
మాత్రాన క్రికెట్ వ్యవస్థ
దెబ్బ తినదని అభిప్రాయపడ్డారు.
సెహ్వాగ్ కసరత్తు మొదలు...
చెన్నై:
భారత జట్టులో
స్థానం కోల్పోయిన వీరేంద్ర
సెహ్వాగ్ మళ్లీ తిరిగి జట్టులో
చోటు సంపాధించుకోవడానికి
కసరత్తు మొదలు పెట్టాడు..
ఇందుకు గానూ
ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషల్ లో
మెక్ గ్రాత్ దగ్గర శిక్షణ
తీసుకుంటున్నాడు. అయితే
ఇప్పటికే భారత జట్టులో స్థానం
కోల్పోయి తిరిగి స్థానం
ఆశిస్తున్న , యువీ,
జహీర్ ఖాన్,
గంభీర్ లాంటి
వారు ఫ్రాన్స్ వెళ్లీ శిక్షణ
తీసుకున్నారు. మరో
వైపు గంభీర్ కౌంటీల్లో
ఆడుతున్నా , ఘోరంగా
విఫలమవుతున్నాడు. దీంతో
టీంలో యువకులను తట్టుకోవాలంటే
వీరు ఇంకా శ్రమించక తప్పదు..
అభిమానులు క్షమించండీ...
ఇంగ్లాండు:
యాషెస్ సిరిస్
అనంతరం గ్రౌండ్స్ లో రచ్చరచ్చ
చేసిన ఇంగ్లాండ్ ఆటగాళ్ల తరుపున
ఆ దేశ క్రికెట్ బోర్డు క్షమాపణ చెప్పింది. తమ
ఆటగాళ్లు చేసింది తప్పే....!కానీ
వారు కావాలని చేయలేదని తెలిపారు.
సిరిస్ గెలిచిన
ఆనందంలో వారు ఆ విధంగా
ప్రవర్తించారన్నారు.
తాము క్రికెట్
కు సంబంధించిన విషయాలు చాలా
గౌరవిస్తామని, తమపై
ఆడిన ప్రత్యర్థులన్నా...మేమాడిన
మైదానాలన్నా.. తమకు
ఎంతో గౌరవమని అభిప్రాయపడ్డారు.
క్రికెట్
కబ్ల్ లను కించపర్చాలని తమ
ఉద్దేశం కాదని, వీటిని
చిన్న తప్పులు గా బావించాలని
అభిమానులను వేడుకున్నారు.
ప్రతి పిల్లవాడు ప్రొఫెషనల్ కాలేడు..వివిఎస్..
హైదరాబాద్:
ఆటలు జీవితంలో
అన్ని అనుభవాలను నేర్పిస్తాయని
వివిఎస్ లక్ష్మన్ అభిప్రాయపడ్డారు....
ఆయన గురువారం
జాతీయ క్రీడా దినోత్స వాన్ని
పురష్కరించుకుని పలు సూచనలు
చేశారు... ఆటలాడే
ప్రతి పిల్లవాడు ప్రొఫెషనల్
కావాలనేం లేదన్నారు..''
వాస్తవానికి
అత్యున్నత స్థాయికి ఎదిగేవాళ్ల
సంఖ్య చాలా తక్కువ . కానీ
ఒక పిల్లాడు జీవితంలో ఎదిగే
క్రమంలో క్రీడలు అన్నీ
నేర్పిస్తాయి . ధైర్యంగా
వ్యవహరించడం కమ్యూనికేషన్
స్కిల్స్ టీమ్ గా కలిసి పని
చేయడం , ఇంకా
చెప్పాలంటే గెలుపు ఓటములను
సమానంగా స్వీకరించడం తెలుస్తుంది.
ఈ అలవాట్లు
ఒక వ్యక్తిని పరిపూర్ణమైనవ్యక్తిగా
ఎదగడానికి దోహదపడుతాయనేది
నా నమ్మకం'' అని
వివిఎస్ తెలిపారు.
చిన్నారులు
తాను ఏదైనా ఆట ఆడతానని
చెప్పినప్పుడు తల్లిదండ్రులు
అతని కోరికను మొగ్గలోనే
తుంచేయవద్దు . ముఖ్యంగా
రెండు అంశాలు దృష్టిలో
పెట్టుకోవాలి. అబ్బాయితో
, అతని
స్కూల్ లో , కోచ్
తో మాట్లాడి అసలు ఒక ఆటగాడిగా
మారేందుకు ఇతనిలో ఏ మాత్రం
లక్షణాలు ఉన్నాయో గుర్తించి
నిర్ణయం తీసుకోవాలి.
అన్నింటికి
మించి అతనికి ఒక అవకాశం ఇచ్చి
చూడాలి. అని
అన్నారు.
బంగ్లాను చిత్తు చేసిన భారత్....
మలేషియా:
ఆసియా కప్ లో
భారత్ బంగ్లాదేశ్ పై 9-1
గోల్స్ తేడాతో
ఘన విజయం సాధించింది.
రూపిందర్
సింగ్, రఘునాథ్
లు హ్యాట్రిక్ కొట్టడంతో తన
చివరి పూల్ బి మ్యాచ్ లో
స్ఫూర్తి దాయక విజయాన్ని
సాధించింది. అయితే
ఇప్పటికే ఒమన్, దక్షిణ
కొరియా లాంటి దేశాలను మట్టి
కరిపించిన భారత్, ఇప్పుడు
బంగ్లాదేశ్ ను ఓడించి పూల్
-బిలో
అగ్రస్థానంలో నిలిచింది.
దీంతో శుక్రవారం
పూల్ ఎ నుంచి రెండో స్థానం
సాధించిన మలేషియా తో సెమీ
ఫైనల్ ఆడనుంది. సెమీస్
కు ముందు భారత్ , బంగ్లాను
ఓడించాలని చూసింది.
అందుకు తగ్గట్టే
ఆటలో మొదటి నుంచి ఆధిపత్యాన్ని
ప్రదర్శించింది. భారత్
కు మొదట 10 పెనాల్టీ
కార్నర్ లు లభించగా...
అందులో ఆరు
సద్వినియోగం చేసుకుంది.
రూపిందర్ (
4వ, 19వ,
27వ, 61వ,)
నిమిషాల్లో
నాలుగు గోల్స్ కొట్టాడు.
రఘునాథ్ (29వ,
52వ, 59వ,
) మూడు గోల్స్
సాధించాడు. నికిల్
తిమ్మయ్య (25వ,)
మలక్ సింగ్
(47వ)నిమిషాల్లో
చెరో గోల్స్ సాధించారు.
అయితే భారత్
శుక్రవారం మలేషియా తో సెమీ
ఫైనల్ ల్లో తలపడనుంది.
ఫైనల్లో హాట్ షాట్...
హైదరాబాద్:
ఐబిఎల్ లో
హైదరాబాద్ హాట్ షాట్ ఫైనల్లో
కి దూసుకు పోయింది.
బుధవారం రాత్రి
హైదరాబాద్ లో జరిగిన మ్యాచ్
పుణె పిస్టన్ ను సైనా నెహ్వాల్
ఓడించింది. దీంతో
తొలి ఐబిఎల్ ల్లో ఫైనల్ కు
వెళ్లిన తొలి టీంగా హైదరాబాద్
హాట్ షాట్ రికార్డు సృష్టించింది.
అయితే మొదట
పురుషుల సింగిల్స్ లో అజయ్
జయరాం 21-17, 21-11తో
టిన్ మిన్ న్యుజెన్ పై నెగ్గి
హైదరాబాద్ కు 1-0 తో
అధిక్యం అందించగా మహిళల
సింగిల్స్ లో స్టార్ షట్లర్
సైనా నెహ్వాల్ 21-10 , 19-21,
11-8తో జూలియన్
షెంక్ పై గెలిచి హైదరాబాద్
అధిక్యాన్ని 2-0 కు
పెంచింది. అయితే
పురుషుల డబుల్స్ లో గొ షెమ్-
లిమ్ ఖిమ్
16-21, 21-14, 11-7తో
ఫిషర్ జోచిమ్ సనావె థామస్ పై
అద్భుత విజయం తో హైదరాబాద్
ను విజేతగా నిలిపారు.
దీంతో రెండో
సెమీ ఫైనల్లో విజేతగా నలిచిన
జట్టుతో హైదరాబాద్ హాట్ షాట్
తలపడనుంది.
సైనా
విశ్వరూపం....
ఐబిఎల్
లో మరో సారి హైదరాబాద్ షట్లర్
విశ్వరూపాన్ని ప్రదర్శించింది.
ప్రపంచ మూడో
ర్యాంకర్ జులియన్ షెంక్ తో
ఉత్కంఠభరితంగా సాగిన పోరులో
సైనా పై చెయి సాధించింది.
ప్రత్యర్థి
వీక్ నెస్ ను గమనిస్తూ...చూడచక్కని
షాట్స్ ఆడుతూ... పదునైన
స్మాష్ లతో సైనా దూసుకుపోయింది.
అయితే ఈ ఆటలో
సైనా ఎక్కడ తడపడలేదు.
ప్రత్యర్థి
షెంక్ చేసిన తప్పిదాలు సైనాకు
కలిసొచ్చాయి. 21-10తో
మొదటి గేమ్ ను సొంతం చేసుకున్న
సైనా ... రెండో
గేమ్ లో షెంక్ హోరా హోరిగా
తలపడింది. ఒకానొక
దశలో సైనా 14-8తో
విజయం వైపు దూసుకుపోతున్న
తరుణంలో ...షెంక్
పుంజుకుని గేమ్ ను 19-19తో
సమం చేసింది. దీంతో
మూడో గేమ్ కు వెళ్లిన వీరు
అధిపత్యం కోసం సర్వశక్తులు
ఒడ్డారు.. ఈ
సమయంలో సైనా పదునైనా స్మాష్
లతో షెంక్ ను గ్రౌండ్ మొత్తం
తిప్పింది. దీంతో
షెంక్ సైనాకు తలవంచక తప్పలేదు..
Wednesday, 28 August 2013
మువ్వన్నెలను ముద్దాడిన క్రీడా కారులు...
హైదరాబాద్:
భారత దేశం!
మువ్వన్నెల
జండాను ప్రపంచ వేదికలపై
రెపరెపలాడించిన ఎందరో క్రీడా
కారులున్నారు. నాటీ
హాకీ మాంత్రికుడు, థ్యాన్
చంద్ నుంచి ఇప్పటి క్రికెట్
దేవుడు సచిన్ టెండూల్కర్
వరకు ఎందరో ఎందరో వీరులను
కన్నది మన పుణ్య దేశం...!కానీ
థ్యాన్ చంద్ తరువాత ఇప్పటికి
భారత హాకీ జట్టులో మరో థ్యాన్
చంద్ లాంటి ఆటగాడు లేకపోవడం
దురదృష్ట కరం..!అంటే
నేటి రాజకీయ క్రీడాల్లో
....దేశ
క్రీడలు ఏవిదంగా శాషిస్తున్నాయో
తెలుసుకోవచ్చు..!ఏక
చక్రాదిపత్యంగా భారత్ ను
మూడు సార్లు స్వర్ణాలు ముద్దాడిన
థ్యాన్ చంద్, ఆయన
పుట్టిన రోజు ప్రతి ఏట ఆగస్టు
29న జాతీయ క్రీడా దినోత్సవంగా గుర్తించి,
జాతీయ అంతర్జాతీయ
స్థాయిలో గుర్తింపు తెచ్చినవారిని
సన్మానిస్తారు. మన
భారత ప్రభుత్వం. అయితే
భారత్ ప్రపంచ జనాభాలో రెండో
అతిపెద్ద దేశం. కానీ
ప్రపంచ క్రీడా రికార్డుల
ప్రకారం ఎంతో వెనుక బడి ఉంది.
1928 ఆస్టర్
డ్యాం నుంచి ఇప్పటి వరకు కేవలం
హాకీ ద్వార మాత్రమే భారత్
మూడు స్వర్ణాలు సాధించింది.
మరో వ్యక్తి
గత విభాగాల్లో సైతం స్వర్ణ
పథకాలు సాధించే స్థాయికి
ఎదిగింది. అయితే
వంద కోట్లకు పైగా భారత
పౌరులున్నా...కేవలం
అతి తక్కువ మంది క్రీడా కారులు
మాత్రమే భారత దేశానికి పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టారు.
మతంగా
క్రికెట్.....!
క్రికెట్
పుట్టింది ఇంగ్లాండులో అయితే
దాన్ని హక్కున చేర్చుకుంది మాత్రం భారత్,
ఎందుకంటే
తొలిసారిగా భారత్ 1983లో
కపిల్ దేవ్ సారథ్యంలో ప్రపంచ
కప్ ను ముద్దాడింది.
అప్పటి నుంచి
ఇండియాలో క్రికెట్ పై మక్కువ
ఏర్పడింది. ఇప్పటి
వరకు దాన్ని ఓ మతంగా ఆరాదిస్తున్నారంటే
అతిశయోక్తి కాదు....
మువ్వన్నెలను
ఎగుర వేసిన 'మాంత్రికుడు'...
అయితే
మన జాతీయ క్రీడా హాకీ,
ఒలింపిక్
చరిత్రలో భారత్ ఇప్పటి వరకు
తొమ్మిది బంగారు పథకాలు
సాధిస్తే... అందులో
కేవలం హాకీ ద్వారా వచ్చినవి
మూడు.అంటే
అప్పట్లో హాకీ మాంత్రికుడు
ఎంత మాయ చేశాడో అర్థం అవుతుంది.
భారత హాకీ ని
భారత ఆటగాడు థ్యాన్ చంద్ ను
వేరిచేసి చూడటం సాధ్యం కాని
పని , థ్యాన్
చంద్ దేశానికి చేసిన ఎనలేని
సేవను గుర్తిస్తు ప్రతి ఏట
థ్యాన్ చంద్ పుట్టిన రోజున
ఆగస్టు 29న
దేశ క్రీడా దినోత్సవాన్ని
జరుపుకుంటారు. ఈరోజున
రాజీవ్ కేల్ రత్న, ద్రోణా
చార్య, అర్జున, ధ్యాన్ చంద్
అవార్డులతో క్రీడా కారులను
సన్మానిస్తారు.
క్రికెట్
పై ఆదరణ....
అయితే
భారత్ లో ఎక్కువగా ఆదరిస్తున్న
క్రీడా క్రికెట్ మాత్రమే
...! భారత్
తొలి కెప్టెన్ తెలుగు తేజం
సికే నాయుడు నుంచి ప్రపంచ
కప్ ను సాధించి పెట్టిన కపిల్
దేశ్ , సునీల్
గవాస్కర్, అనీల్
కూంబ్లే, సచిన్
టెండూల్కర్, వివిఎస్
లక్ష్మణ్, సౌరవ్
గంగూలీ, ధోనీ,
విరాట్ కోహ్లీ
ఇలా ఎందో ఆల్ టై గ్రేడ్లను
అంధిచిన ఘనత భారత్ కు దక్కుతుంది.
అయితే క్రికెట్
ఎంత మంది యువ ఆటగాళ్లు వచ్చినా...!
అందరు సచిన్
తరువాతే నని చెప్పుకోవాలి.
మన దేశంలో
మాస్టర్ బ్లాస్టర్ సచిన్
టెండూల్కర్ ఓ దేవుడిగా
కొలుస్తారు. ఇంకా
చెప్పాలంటే సచిన్ భారత్ క్రీడా
రంగానికే ఓ ఐకాన్ ప్లేయర్ గా
వెలుగు వెలిగుతున్నాడు.
తన ఆట తో అంతగా
మాయ చేశాడు ఈ లిటిల్ మాస్టర్,
సచిన్ ప్రపంచ
బ్యాట్ మెన్స్ లో ఓ నెంబర్
వన్ ప్లేయర్ గా కొనసాగుతున్నాడు.
అంతే కాదు
భారత్ కు ప్రపంచ కప్ అందించాలని
కలలు కన్నాడు... పరితపించాడు...
సుదీర్ఘ కాలం
పాటు వేచి చూశాడు..! చివరికి
2011లో తన
కల సకారం చేసుకున్నాడు...
, కలలు కనండీ
..వాటిని
సాకారం చేసుకోవడానికి
పరితపించడండీ... అని
సచిన్ ప్రపంచానికి చెప్పకనే
చెప్పాడు..!తన
ఆట తీరుతో ఎందరో అభిమానులను
చొరకొన్న సచిన్, తరువాత
అంతటి పేరు ప్రత్యేకతలు
సంపాధించాడు.. కూల్
కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ
...ఇతను
ఇండియాను రెండు ఫార్మాట్
లల్లో విశ్వ విజేతలు నిలిపాడు.
టెస్టుల్లో
ఇండియాను నెంబర్ వన్ ర్యాంక్
కు చేర్చిన ఘనత అతనికే సొంతం!
ఒలింపిక్
దీరులు...
అయితే
వ్యక్తి గ విభాగాల్లోను భారత్
ను విశ్వ విజేతలు గా నిలిచిన
వారు చాలా మంది ఉన్నారు. చెస్ విభాగంలో విశ్వనాద్
ఆనంద్ ఇప్పటి వరకు ఐదు సార్లు
ప్రపంచ కప్ లను సొంతం చేసుకుని
రికార్డు సృష్టించాడు.
ఇక బ్యాడ్మింటన్
లో ప్రకాశ్ పడుకునే ఎన్నో
అరుదైన రికార్డులను సొంతం
చేసుకున్నాడు.. ఆదరణ
ప్రోత్సాహం ఏ మాత్రం లేని
రోజుల్లోనే 1980లో
ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ టైటిల్
ను సొంతం చేసుకున్న క్రీడా
కారుడిగా చరిత్ర సృష్టించారు.
అంతే కాదు
ప్రకాశ్ ఓ వరల్డ్ కప్ టైటిల్
ను సాధించి పెట్టారు.
బ్యాడ్మింటన్
లో ఇప్పటి వరకు ఎందరో బ్యాడ్మింటన్
లు వస్తున్నారు. పోతున్నారు.
కానీ ప్రకాశ్
పదుకునే లాంటి వారు ఇప్పటికి
దేశానికి దొరకలేదు.
అయితే 28ఏళ్ల
తరువాత భారత దేశానికి బంగారు
పథకం అంధించి అరుదైన రికార్డు
సృష్టించాడు అభినవ్ బింద్ర,
2008 బీజింగ్
ఒలింపిక్ లో పది మీటర్ల ఎయిర్
రైఫిల్ విభాగంలో భింద్రా
గోల్డ్ మెడల్ సాధించాడు..
ఇప్పటి వరకు
భారత దేశం మొత్తం 29పథకాలుమాత్రమే
సాధించ కలిగింది. ఇందులో
9 బంగారు
పథకాలు, ఆరు
వెండి పథకాలు.11కాంస్య
పథకాలు ఉన్నాయి . ఇక
ఒలింపిక్ టెన్నిస్ పురుషుల
విభాగంలో లియాండ్ ఫేస్ కాంస్య
పథకం సాధించాడు. 2000సిడ్నీ ఒలింపిక్స్ లో మనతెలుగు
తేజం కరుణం మల్లీశ్వరీ వేయిట్
లిఫ్టింగ్ విభాగంలో పథకం
సాధించింది. 2012 భారత్
ఒలింపిక్స్ లో భారత్ ఏకంగా
ఆరు పథకాలు సాధించింది.
భారత దేశానికి
వచ్చిన అత్యదిక ఒలింపిక్
పథకాలు ఇవే కావడం విషేశం..
కబడ్డీ
హవా....
ఇక
మన దేశంలోనే పుట్టిన కబడ్డీ
హవా కొనసాగుతోంది.
కబడ్డీలో
నెంబర్ వన్ మన భారత జట్టే..!2004నుంచి
2012వరకు
జరిగిన ఐదు ప్రపంచ కప్ టైటిల్స్
ను మన దేశమే సొంతం చేసుకుంది.
ఈ విషయం ఎక్కువ
మందికి తెలియదు. 2012లో
వరల్డ్ కప్ ను సైతం భారత జట్టే
సొంతం చేసుకుంది. ఇక
బిలీయర్డ్స్ లోని భారత్ కు
ప్రత్యేక స్థానం ఉంది.
ఈ పేరు వింటే
గుర్తుకొచ్చే క్రీడా కారుడు
పంకజ్ అద్వానీ , ఇప్పటి
వరకు రికార్డు లెవల్లో పంకజ్
అద్వాని ఏడు సార్లు ప్రపంచ
కప్ ను సొంతం చేసుకున్నాడు.
ట్రాక్ అండ్
ఫీల్డ్ లో అశ్వని నాచప్ప..
పేరు
తెచ్చిపెట్టారు... ఏది
ఏమైనా కొంత మంది క్రీడా కారులు
మాత్రం..భారత్
పేరు ప్రతిష్టలు నిలబెడుతూ
వస్తున్నారు...... ఆగస్టు
29ప్రపంచ
క్రీడా దినోత్సవాన్ని
పురష్కరించుకుని ఇక నైనా మన
దేశంలో క్రీడా అభివృద్ది
సాధించాలని అశిద్దాం..................
మీ ....!

Tuesday, 27 August 2013
ఓ ధైర్యం..నన్ను తట్టింది..
ఓ ధైర్యం నన్ను తట్టింది....నాలో నిద్రిస్తున్న భయాన్ని లేపింది...!
ఓ జాలి గుండె నన్ను పలకరించింది....నాలో స్వార్థాన్ని తుడిచి పెట్టడానికి...
నా కష్టాలను తన కష్టాలు పలకరించాయి... కష్టాల్లో మనం ఒక్కటేనని...
చేయి పట్టి నడిపించింది... నా భుజాలపై తన అభయ హస్తాలను తట్టింది..
ప్రాణం...! రెండు గుండెలు కలిసాయి... మా స్నేహం...!
నిత్యం నీ ప్రేమను కోరుకునే నీ........
ఓ జాలి గుండె నన్ను పలకరించింది....నాలో స్వార్థాన్ని తుడిచి పెట్టడానికి...
నా కష్టాలను తన కష్టాలు పలకరించాయి... కష్టాల్లో మనం ఒక్కటేనని...
చేయి పట్టి నడిపించింది... నా భుజాలపై తన అభయ హస్తాలను తట్టింది..
ప్రాణం...! రెండు గుండెలు కలిసాయి... మా స్నేహం...!
నిత్యం నీ ప్రేమను కోరుకునే నీ........
Monday, 26 August 2013
యుఎస్ ఓపెన్ కు రంగం సిద్ధం...
న్యూయార్క్: గ్రాండ్ స్లామ్ టోర్ని యుఎస్ ఓపెన్ టెన్నిస్ పోటీలు అమెరికాలోని ఆర్థర్ ఆష్ స్టేడియంలో ప్రారంభం కానున్నాయి. ప్రతి ఏటా టెన్నిస్ మహా సమరం ఆస్ట్రేలియా టోర్నితో ప్రారంభమై యుఎస్ టోర్నితో ముగిస్తుంది.. ప్రపంచంలోని నాలుగు గ్రాండ్ స్లామ్ టోర్నిగా అమెరికా టోర్నికి పేరుంది. ఈ టోర్నిని ఆగస్టు సెప్టెంబర్ నెలలో నిర్వహస్తుంటారు. తొలిసారిగా 1881లో ప్రారంభమైన యుఎస్ ఓపెన్ కు ఓ ప్రత్యేకత ఉంది. వింబుల్డన్ , ఆస్ట్రేలియా ఓపెన్, టోర్నమెంట్ లలో ఆఖరిసెట్ తప్పా... మిగతా సెట్ లో మాత్రమే టై బ్రేక్ ఉంటుంది . కానీ యుఎస్ ఓపెన్ లో మాత్రం అన్ని సెట్ లలో టై బ్రేక్ ఉంటుంది. ఇది ఈ టోర్ని ప్రత్యేకత. 1881నుంచి 1967వరకూ ఈ టోర్నీని అమెరికన్ నేషనల్ ఛాంపియన్ టోర్నీగానే నిర్వహించేవారు. అయితే తొలిసారిగా 1968లో తొలిసారిగా ఈ టోర్నీని ఓపెన్ ఫార్మాట్ లోకి మార్చారు. 1987లో యుఎస్ ఓపెన్ సమరాన్ని నాలుగవ ప్రధాన గ్రాండ్ స్లామ్ టోర్నీగా మార్చారు. యుఎస్ ఒపెన్ టోర్నీని 1881నుంచి 1974వరకు గ్రాస్ కోర్టులో నిర్వహించారు. ఆతరువాత 1975నుంచి 1977వరకు క్లే కోర్టులో పోటీలను నిర్వహించారు. ఇక ఆతరువాత నుంచి ఇప్పటి వరకు సింతటిక్ డెకోటర్ఫ్ కోర్టులో నిర్వహిస్తున్నారు. ఈ డెకోటర్ఫ్ మామూలు కోర్టులు కాకుండా చాలా ఫాస్ట్ గా ఉంటుంది. బౌన్స్ తక్కువగా ఉండే ఈ టోర్నీలో రణించాలంటే టెన్నీస్ ప్లేయర్లకు పెద్ద సవాలే.. మురో వైపు ఈ అమెరికన్ ఓపెన్ లో ప్రైజ్ మనీ కూడా భారీ గా ఉంటుంది. ఈ పోటీల్లో విజేతగా నిలిచిన వారికి 25లక్షల అమెరికన్ డాలర్లు అందజేస్తారు. రన్నరఫ్ గా నిలిచిన వారికి తొమ్మిదిన్నర లక్షలు ప్రైజ్ మనీ గా అంధిస్తారు.
మరో పోరుకు సిద్దం...

ఒలింపిక్ కు దూరంగా ఉంచండీ...

ఐదో టెస్టు డ్రా..సిరిస్ కైవసం చేసుకున్న ఇంగ్లాండ్...

Sunday, 25 August 2013
కల నీరుగారే...
లండన్: యాషెస్ సిరిస్ లో కనీసం చివరి టెస్టులోనైనా గెలిచి తీరుదామని పట్టుదలతో ఉన్న కంగారులకు, కంగారు తప్పలేదు... వర్షం కారణంగా ఐదో టెస్టు నాలుగో రోజు మ్యాచ్ నిలిచిపోయింది. దీంతో ఐదో రోజు మ్యాచ్ జరిగినా డ్రాగా ముగిసే ఛాన్స్ ఉండటంతో ఆస్ట్రేలియా ఆశలు సన్నగిల్లాయి. ఉదయం నుంచి వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుంది. దీంతో మైదాపం పై కప్పిఉంచిన కవర్లును తొలగించలేదు. ఫలితంగా ఒక్క బంతి ఆట కూడా సాధ్యపడలేదు. చివరకు స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4గంటలకు మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మ్యాచ్ కు ఆదివారం చివరి రోజు కావడంతో ఫలితం రావడం కష్టం. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 492/9 వద్ద డిక్లేర్ చేయగా ప్రస్తుతం ఇంగ్లాండ్ 247/4 స్కోరుతో ఉంది.

ఇంకా సత్తాఉంది...యువీ
న్యూఢిల్లీ:తనకు ఇంకా క్రికెట్ ఆడే సత్తా ఉందని క్రికెటర్ యువరాజ్ సింగ్ అన్నారు. తన వయస్సు ఇంకా 32సంవత్సరాలే నని మూడు ఫార్మాట్ లో ఆడగలనని తెలిపారు. ఆయన శనివారం తన నూతన అకాడమీ ప్రారంభించిన సందర్భంగా యువి పలు విషయాలు మాట్లాడారు. తన తిరిగి జట్టులోకి రావడానికి తీవ్ర కృషి చేస్తున్నానని వ్యాఖ్యానించారు. దేశవాలి క్రికెట్ కోసం ఆత్రుతతో ఎదురు చూస్తున్నానన్నారు. భారత జట్టులోకి కుర్రాల్ల రాక శుభ పరిణామమని , వాళ్లు అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉమేష్ యాదవ్, ఇషాంత్ లాంటి మంచి బౌలర్లు ఉన్నారన్నాడు. తాను సాధన చేసేటప్పుడు అన్ని వసతులు ఒకే చోట ఉండేవికాదని , ప్రాక్టీస్ ఓ చోట , జిమ్, స్విమ్మింగ్ ఓచోట చేసేవారమని వివరించాడు. ఇప్పుడు క్రికెటర్లకు అలాంటి పరిస్థితి లేదని , అన్ని వసతులు ఒకే చోట ఉన్నాయన్నాడు.

ఒమన్ హాకీ పై భారత్ హాకీ అద్భుతం...
ఇఫో:నవదీప్ సింగ్ అద్భుత హ్యాట్రిక్ గోల్స్ తో భారత్ హాకీ జట్టు సంచలన విజయం సాధించింది. 8-0గోల్స్ తేడాతో పసికూన 'ఒమన్'ను చిత్తుగా ఓడించింది. మొదటి నుంచి ఆటలో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన భారత్, రెండు అర్థ బాగాల్లో నాలుగేసి గోల్స్ కొట్టింది. మన్ దీప్ (4వ, 40వ, 44వ,నిమిశాల్లో) మూడు గోల్స్ చేయగా....రమణ్ దీప్ 17వ, రఘునాథ్ 28వ, రూపిందర్ సింగ్ 34వ, మలక్ సింగ్ 47వ, ఉతప్ప 69వ తలా ఓ గోల్ సాధించారు. ప్రపంచ కప్ కు అర్హత సాధించాలంటే, టోర్నీ తప్పక గెలవాల్సిన భారత్,..ఒమన్ పై ఎదురుదాడికి దిగింది. వూహించినట్లుగానే ఆట ఎక్కువగా ఒమన్ హాఫ్ లోనే సాగింది. పదేపదే దాడులు చేస్తు భారత్ ఒమన్ జట్టును డిఫెన్స్ లోకి నెట్టింది. అయితే పెనాల్టీ కార్నర్ లను సద్వినియోగం చేయడం భారత్ కు ఇప్పటికీ సమస్యగానే ఉంది.ఈ మ్యాచ్ లో భారత్ కి మొత్తంఆరు పెనాల్టీ కార్నర్ దక్కగా అందులో కేవలం రెండు మాత్రమే సద్వినియోగం చేసుకుంది. మూడో నిమిషయంలో భారత్ కి తొలి పెనాల్టీ లభించగా దాన్ని ఒమన్ గోల్స్ కీపర్ అడ్డుకున్నారు.
ఫిట్ నెస్ కీలకం....
ముంబై:
సరైన ఫిట్ నెస్ లేకే జాతీయ జట్టుకు దూరమయ్యానని భారత పేసర్ జహీర్ ఖాన్ అన్నాడు. ఆయన శనివారం ఫిట్ నెస్ కోసం ప్రాక్టీస్ చేస్తుండగామీడియాతో పలు విషలు చర్చించారు. ఫిట్ నెస్ సమస్యలను అధిక మించడానికి త్వరలో రంజీ సీజన్ లో ఆడనున్నట్లు తెలిపారు. తన పూర్తి స్థాయిలో ఫిట్ నెస్ సాధించానని, త్వరలో జట్టులోకి తిరిగి వస్తానని తెలిపారు.

మాస్టరే మేటి....క్లార్క్
ముంబై: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పై ఆస్ట్రేలియా సారథి మైకేల్ క్లార్క్ ప్రశంసల వర్షం కురిపించారు. అంతర్జాతీయ క్రికెట్ లో సుదీర్ఘ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న సచిన్ టెండూల్కర్ తాను చూసిన క్రికెటర్లలో గొప్ప వాడని కితాబిచ్చాడు. సచిన్ బ్యాటింగ్ ను తాను ఇష్టపడతానని చెప్పాడు. రెస్టు ఆఫ్ ఇండియాతో జరిగిన మ్యాచ్ లో సచిన్ ఇటీవల 140 పరుగులు చేశాడు. ఆ ఆటను తాను చూసినట్లు క్లార్క్ చెప్పాడు రాహుల్ ద్రావిడ్ , వివిఎస్ లక్ష్మణ్, లాంటి దిగ్గజ ఆటగాళ్లు లేకున్నా సచిన్ వంటి ఆటగాళ్లు ఆస్ట్రేలియా విజయాలను ప్రభావితం చేస్తాడని మైకేల్ క్లార్క్ తెలిపారు.

Wednesday, 21 August 2013
కోర్టులో హాజరు....
హైదరాబాద్ : లేపాక్షి నాలెడ్జ్ హబ్ కు భూములు కేటాయించిన వ్యవహారంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావును సీబీఐ అధికారులు సుమారు ఐదు గంటల పాటు విచారించారు. విచారణ అనంతరం బయటకు వచ్చిన ధర్మాన మీడియాతో మాట్లాడారు. లేపాక్షి భూముల వ్యవహారంలో సీబీఐ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చానన్నారు. అప్పటి రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు జారీ చేసిన జీఓలకు సంబంధించిన వివరాలను సీబీఐ అధికారులకు వెల్లడించానని పేర్కొన్నారు. ఇదే విషయంలో అప్పటి ప్రిన్సిపల్ భూముల దుర్వినియోగం గురించి తనకు తెలియదని చెప్పానన్నారు. సెక్రటరీ శ్యామూల్ ను కూడా సీబీఐ పిలిచిందని తెలిపారు. విచారణకు ఎప్పుడు పిలిస్తే అప్పుడు సీబీఐ అధికారుల ఎదుట హాజరవుతానని ధర్మాన పేర్కొన్నారు.
Subscribe to:
Posts (Atom)