రాంచీ:
ఎంఎస్ ధోనీ
నాయకత్వంలోని చెన్నై సూపర్
కింగ్ జట్టు సభ్యులు 2013
చాంపియన్
లీగ్ కు సన్నాహకాలు ప్రారంభించింది.
ధోనీ నేతృత్వంలోని
చెన్నై సూపర్ కింగ్ రాంచీ
లో తన తొలి మ్యాచ్ ఆడ నుంది.
అయితే ఇప్పటికే
ధోనీ బృందం రాంచీలో ప్రాక్టీస్
మ్యాచ్ ఆడింది. అయితే
ట్వీ20 మ్యాచులో
మొదటి సారి రాంచీ స్టేడియంలో
ధోనీని ఆయన అభిమానులు
వీక్షించనున్నారు. తన
సొంత నగరంలో రాంచీ లో ధోనీకి
పెద్ద యెత్తున అభిమానులు
ఉన్నారు. చెన్నై
సూపర్ కింగ్స్ రాంచీలో మూడు
మ్యాచ్ లు ఆడనుంది. మొదటి
మ్యాచ్ లో ఈ నెల 22వ
తేదీన దక్షిణాఫ్రికా టైటాన్స్
తో తలపడనుంది.
ఈ అక్షరాలు ఓ పేదవాడికి అన్నం పెట్టాలి...! నిండు జీవితాలకు ప్రాణం పోయాలి..! ఓ విద్యార్థికి ఆయుధాన్ని ఇవ్వాలి..! ప్రేమికులకు ఓదార్పునివ్వాలి..! అప్పుడే కలలకు ఓ దారి దొరుకుతుంది....
Friday, 20 September 2013
వంద శాతం అర్హుడు... గుంగూలీ..
కోల్
కతా: భారత
ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్
మళ్లీ ఇండియా జట్టులోకి రావడం
ఖాయమని భారత మాజీ కెప్టెన్
సౌరప్ గంగూలీ అన్నారు.
యువరాజ్ తన
ఫామ్ అందుకోవడం తనకు ఆశ్చర్యానికి
గురిచేయలేదని తెలిపాడు..
యువి అప్పటికి
ఇప్పటికి గొప్ప క్రికెటరని
కొనియాడారు. అయితే
ప్రస్తుతం కుర్రాలతో కూడిన
జట్టు భాగుందని అదే విధంగా
యువి కూడా మిడిలార్డర్ లో
కీలకంగా కానున్నాడని వివరించారు.
గంగూలీ
పేస్ లకు అవార్డులు...
భారత
క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్
సౌరభ్ గంగూలీ, టెన్నిస్
స్టార్ లియాండర్ పేస్ లకు
ప్రభుత్వం జీవిత సాఫల్య
పురస్కారాలను ప్రధానం చేయనుంది.
ఈ అవార్డును
ఎంపిక ఆనందం వ్యక్తం చేసిన
దాదా నా జీవితంలో ఇది గొప్ప
సాఫల్యం అన్నాడు. వయస్సు
పై పడుతున్నా... పేస్
అద్భుతఫామ్ ను కొనసాగిస్తుండటంపై
స్పందిస్తూ... 40 అనేది
ఓ సంఖ్య మాత్రమే నేనైతే ఇంకా
చాలాకాలం ఆడాలని అంటా నని
అతని ఫిట్ నెస్ ను కొనియాడాడు.
ఈనెల 28న
జరిగే ప్రత్యేక కార్యక్రమంలో
దాదా, పేస్
లకు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్
పుట్ బాల్ కోచ్ సభాష్ బో వ్రిక్
కు గురు రత్న అవార్డును
అందజేస్తారు..
Saturday, 14 September 2013
మరణ శాసనమిది....!
మరణ
శాసనం మానవ మృగాలకు......
ఇది
కావాలి మహిళలకు అభయ శాసనం....
ఆడదని
అలుసా....! అది
ఎందుకు తెలుసా...
ఈ
రాక్షస నర లోకంలో బ్రతకలేవు
తెలుసా...!
ఆగ్రహించు
వనితా.... అడుగై
ముందొరసా....!
ఆపే
దమ్మెవడికుంది ...అదినీకు
తెలుసా...
ఈ
దేశమే ఆడదమ్మ మగవాడెంతమ్మా....
పాలించే
కర్కశులను నిలదీసడుగమ్మా...
ఇది
నాశాసనం.....మీ...
Wednesday, 11 September 2013
సిఎల్టీ20కి పాక్ ఔట్...
బెంగళూర్:
ఛాంపియన్స్
లీగ్ టీ20 2013టోర్నమెంట్
ప్రారంభానికి ముందే పాకిస్తాన్
కి షాక్ తగిలింది. భారత
ప్రభుత్వం వీసా నిరాకరించడంతో
పాకిస్తాన్ ఛాంపియన్స్ లీగ్
లో పాలు పంచుకోవడంలేదు.
పాక్ కు చెందిన
జట్టుకు వీసా ఇవ్వక పోవడం
ద్వారా ఛాంపియన్స్ లీగ్
నిర్వామకులకు ఎదురు దెబ్బతగిలింది.
సిఎల్టీ 20
కి పాకిస్తాన్
జట్టు పైసలాబాద్ వోల్వ్స్
అర్హత సాధించింది. ఈ
జట్టుకు మిస్భావుల్ హక్
సారథ్యం వహిస్తున్నాడు.
అయితే ఆ జట్టు
ఆటగాళ్లుకు భారత ప్రభుత్వం
తాజాగా వీసానిరాకరించింది.
దీంతో ఆ జట్టు
టోర్నీ నుంచి వైదొలగింది.
అయితే దీనికి
కారణం లేకపోలేదు.. భారత
పాక్ సరిహద్దుల్లో ప్రస్తుతం
ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన
నేపథ్యంలో పాక్ ఆటగాళ్లుకు
వీసాలు నరాకరించినట్లు
ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుత
పరిస్థితిలో పాక్ ఆటగాళ్లుకు
భద్రత కల్పించడం పెద్ద సమస్య
అవుతోందని ప్రభుత్వం భావిస్తోంది.
పరుగుల దాహంతో ఉన్నాడు...
ఢిల్లీ:
రెండేళ్ల
నుంచి సచిన్ ఖాతాలో సెంచరీలు
లేకపోవడంతో , సింహం
ఆకలితో ఉన్నట్టే నని భారత
మాజీ ఓపెనర్ చేతన్ చౌహాన్
అభిప్రాయపడ్డాడు. మాస్టర్
వయస్సు మీదపడుతున్నా తనలో
ఇంకా క్రికెట్ ఆడే సత్తా ఉందని
తెలిపాడు. తన
రిటైర్మెంట్ పై వస్తున్న
ఊహాగానాలను కొట్టిపారేశారు.
ఈవిషయాన్ని
సచిన్ కే వదిలేయాలని ఆయన
అన్నారు. మరో
వైపు భారత జట్టులోకి సీనియర్
ఆటగాళ్లు సెహ్వాగ్,
గంభీర్,
జహీర్ లు మళ్లీ
జట్టులోకి వస్తారని ఆశాభావం
వ్యక్తంచేశారు. కోహ్లీలో
చక్కని క్రికెటర్ ఉన్నాడని
అతను మునుముందు దేశానికి
మంచి పేరు సంపాదిస్తాడని
అన్నాడు. అతన్ని భావి కెప్టెన్ గా చౌహాన్
అభివర్ణించాడు.
చాన్స్ ను అందిపుచ్చుకుంటారా...!
ముంబై:
ఒంటి చేత్తో
మ్యాచ్ స్వరూపాన్నే మార్చగల
ఆటగాళ్లు..! జట్టుకు
ఎన్నో చిరస్మరణీయమైన
విజయాలందించిన దిగ్గజాలు !
కానీ నేడు
జట్టులో చోటుకోసమే పోరాడాల్సిన
పరిస్థితి.. ఫామ్
లేమితో టీం ఇండియాలో చోటు
కోల్పోయిన సీనియర్లు జహీర్,
గంభీర్,
సెహ్వాగ్,
వీరు ముగ్గురు
తిరిగా జట్టులోకి రావాలని
తీవ్రంగా శ్రమిస్తున్నారు.
దీని కోసం
విదేశాల్లో శిక్షణ పొంది
వచ్చారు. కానీ
వీళ్లు ఒకప్పుడు జట్టులో
స్టార్ ఆటగాళ్లుగా వెలుగు
వెలిగారు. ఒకరు
2011ప్రపంచ
కప్ లో బౌలింగ్ విభాగంలో
పెద్దన్న పాత్ర పోషించాడు.
గంభీర్,
సెహ్వాగ్
ప్రపంచలోనే అత్యుత్తమ ఓపనింగ్
బ్యాటింట్స్ మెన్ గా
పేరుతెచ్చుకున్నారు.
కానీ వారి
ఉనికి కనుమరుగైపోతోంది.
జాతీయ జట్టులోకి
రావడానికి శ్రమించాల్సివస్తుంది.
జట్టులో
కుర్రాల్ల పోటీ ఎక్కువగా
ఉండటంతో ఎంతటి ఆటగాడైనా ఫామ్
లేకపోతే జట్టునుంచి ఉద్వాసన
తప్పడంలేదు. మాజీలు
మాత్రం సీనియర్ల సేవలను
మరవోద్దంటూ చేసిని ప్రకటనకో!
లేక మరే అవకాశమో!
తెలియదు
కానీ... సీనియర్లకు
మరో చాన్స్ బిసిసిఐ ఇచ్చింది.
త్వరలో
స్వదేశంలో జరిగే వెస్టిండీస్
సిరీస్ కోసం భారత్ ఎ జట్టుకు
బిసిసిఐ ప్రకటిచింది.
ఇందులో సీనియర్
ఆటగాళ్లకు పిలుపునిచ్చింది.
ఇద్దరి
మధ్యే పోటీ....
భారత
ఓపెనింగ్ బ్యాట్ మెన్ గా పేరు
ప్రక్యాతలు తెచ్చుకున్న
ఢిల్లీ బాంబులు....సెహ్వాగ్,
గంభీర్ ల మధ్యే
పోటీ ఉంటుంది. ఎందుకంటే,
ఇప్పటికే
భారత జట్టులో ఓపెనింగ్
బ్యాట్స్ మెన్ గా నయ సంచలనం
ధావన్ ఇరగదీస్తున్నాడు.
అయితే ఇతనికి
రెండో ఎండ్ లో మరో ఓపెనర్
పెద్దగా రాణించక పోవడంతో
వారి స్థానంలో గంభీర్,
లేదా సెహ్వాగ్
ఎంపికయ్యే అవకాశం ఉంది.
కానీ ఇద్దరు
మళ్లీ ఓపెనింగ్ గా చూడాలంటే
వారు వెస్టిండీస్ తో జరగనున్న
అనధికార మ్యాచ్ లో మాత్రం
రాణించాల్సి ఉంటుంది.
జహీర్
ఈజీ చాన్స్...
గత
కొద్దికాలంగా ఫిట్ నెస్ కోసం
తీవ్రంగా శ్రమిస్తున్న జహీర్
ఖాన్ కు తిరిగి భారత జట్టులోకి
రావడానికి మార్గం సుగమంగానే
కనిపిస్తోంది. పేస్
బౌలింగ్ విభాగానికి సరైన
నాయకుడు లేకపోవడంతో జహీర్
కు చోటు కాయంగా కనిపిస్తుంది.
కొత్త చరిత్ర....సెరెనా.
న్యూయార్క్:
ఈ టోర్నిలో
కచ్చితమైన ఫేవరెట్ గా బరిలోకి
దిగిన ప్రపంచ నంబర్ వన్ సెరెనా
అంచనాలను నిజం చేసింది.
గత ఏడాది
ఫైనల్లో నమోదైన ఫలితాన్ని
పునరావృతం చేసింది.
వరుసగా రెండో
ఏడాది అజరెంకాను ఓడించింది.
ఐదోసారి
యూఎస్ ఓపెన్ టైటిల్ ను హస్తగతం
చేసుకుంది. ఈ
క్రమంలో ఓపెన్ శకం మొదలయ్యాక
యూఎస్ ఓపెన్ టైటిల్ నెగ్గిన
పెద్ద వయస్కురాలిగా సెరెనా
31ఏళ్ల
347 రోజులు
కొత్త చరిత్ర సృష్టించింది.
ఇంతకాలం
మార్గరెట్ కోర్ట్ పేరిట ఉన్న
రికార్డును బద్దలు కొట్టింది.
ద్రావిడ్ పాఠాలు...
బెంగళూరు:
భారత జట్టుకు
రిటైర్మెంట్ ప్రకటించిన
అనంతరం ద్రావిడ్ సమాజ సేవతో
తన వంతుగా దూసుకుపోతున్నాడు.
తనలో ఉన్న
గొప్పక్రికెట్ లక్షణాలను
ఇతరులకు అంధించాలని తపనే
తనను ముందుకు నడిపిస్తోంది.
ఈ స్టార్
ఆటగాడు 25 మంది
అనాథ పిల్లలకు క్రికెట్
మెళకువలు నేర్పించాడు.
మంగళవారం
ఏర్పాటు చేసిన క్యాంప్ విత్
ద చాంప్, కార్యక్రమంలో
భాగంగా అతను రోజంతాయ పిల్లలకు
క్రికెట్ పాఠాలు చెబుతూ
గడిపాడు ఈ ఎస్ పీ ఎన్ క్రిక్
ఇన్ఫో, టెలికామ్
బ్రాండ్ ఐడియా ఈ కార్యక్రమాన్ని
చేపట్టింది. ఆటకు
సంబంధించిన ప్రాథమికాంశాలను
నేర్చుకోవాలనుకునే వారికి
నియమ నిబంధనలను తెలియజేస్తూ
కొన్ని వీడియోలను రూపొందించారు.
మరో వైపు
సెహ్వాగ్ , జహీర్,
గంభీర్ లాంటి
సీనియర్ ఆటగాళ్లు జాతీయ
జట్టులోకి తిరిగి వస్తారని
ద్రావిడ్ అశాభావం వ్యక్తం
చేశాడు. విండీస్
తో తలపడే భారత్ 'ఎ'
జట్టులో ఈ
ముగ్గురికి చోటు దక్కింన
సంగతీ తెలిసిందే. అయితే
ఈ అవకాశాన్ని వాళ్లు సద్వినియోగం
చేసుకోవాలని సూచించాడు.
సత్తా చాటేందుకు మరో చాన్స్...
విశాఖ:
ఫామ్ లేమితో
భారత జట్టుకు దూరమైన సీనియర్
ఆటగాళ్లు యువరాజ్,
సెహ్వాగ్,
గంభీర్,
జహీర్ ఖాన్,
తమ సత్తా
చాటేందుకు మరో చాన్స్ రానుంది...
సొంత గడ్డపై
వెస్టిండీస్ -ఎ
తో జరగనున్న అనధికార టెస్టు,
వన్డే,
మ్యాచ్ లకోసం
ఈస్టార్ ఆటగాళ్లకు మరో చాన్స్
ఇవ్వాలని బిసిసిఐ బావించింది.
దీనిలో
భాగంగా... మొత్తం
మూడు టెస్టులకు గానూ,
రెండు టెస్టులకు
గౌతమ్ గంభీర్, సెహ్వాగ్,
జహీర్ ఖాన్
లకు ఎంపిక చేశారు. మూడు
టెస్టులకు గానూ కాశ్మీర్ అల్
రౌండర్ పర్వేజ్ రసూల్ ఒక్కడే
ఎంపికయ్యారు. వన్డే
జట్టు కెప్టెన్ గా యువరాజ్
సింగ్ వ్యవహరించనున్నాడు.
అయితే ఈ
సిరీస్ లు ఇప్పుడు సెప్టెంబర్
15నుంచి
21వరకు
బెంగళూరు లో జరగనున్నాయి.
అదే నెల
25నుంచి
అక్టోబర్ 12 వరకు
మైసూర్ షిమోగా, హుబ్లీలలో
జరగనున్నాయి.
Sunday, 8 September 2013
ఇప్పట్లో సచిన్ రిటైర్ కాడు...రవిశాస్త్రి..
ముంబై:
అభిమానుల
కోరిక మేరకు సచిన్ టెండూల్కర్,
వచ్చే ఏడాది
ఇంగ్లాండ్ తో జరిగే లార్డ్స్
టెస్టు వరకు కొనసాగుతాడని
భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి
అన్నారు. అయితే
సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్
పై వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో
రవిశాస్త్రి ఇలాంటి సంచలన
వ్యాఖ్యాలు చేశాడు.
ముంబై లో ఓ
ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన
రవిశాస్త్రి మీడియాతో
మాట్లాడారు.. సచిన్
టెండూల్కర్ ఆటను కొనసాగించాలని
అన్నారు. వచ్చే
ఏడాది సచిన్ లార్డ్స్ లో ఆడాలనుకుంటున్నాడని ఆయన
తెలిపారు. కాగా
మరో మాజీ భారత క్రికెట్ క్రీడా
కారుడు కపిల్ దేవ్ సినియర్లు
తమ వ్యక్తి ప్రయోజనాలు పక్కన
పెట్టి రిటైర్మెంట్ పై నిర్ణయం
తీసుకోవాలనడం గమనార్హం...
భారత్ తో సిరీస్ లేక పాక్ విలవిల....
ఇస్లామాబాద్:
భారత్ పాకిస్తాన్
మ్యాచ్ లు లేకపోవడంతో పాకిస్తాన్
బోర్డు ఆర్థికంగా భారీగా
నష్ట పోయింది. భారత్
పాకిస్తాన్ మ్యాచ్ లంటే
అభిమానులకు ఎప్పుడు పండగే...
అయితే ముంబై
బాంబు పేలుళ్ల తర్వాత ఆ
దేశంతోగానీ ఆ దేశ వేదికలపై
ఆడవద్దని భారత క్రికెట్ బోర్డు
నిర్ణయించింది. దీంతో
2008 నుంచి
పాకిస్తాన్ ద్వైపాక్షిక
సిరీస్ లు జరగలేదు. దీంతో
పాకిస్తాన్ బోర్డు కు భారీగా
నష్టం వాటిళ్లిందని ఆ దేశం
క్రికెట్ బోర్డు వెళ్లడించింది.
గత డిసెంబర్
లో భారత పర్యటనలో ఎలాంటి
లాభాపేక్ష లేకుండా సిరీస్
ఆడామని ఆ తర్వాత కనీసం తటస్ట
వేదికలపై అయినా సిరీస్ ఆడదామంటూ
ప్రతిపాదించినా భారత్ నుంచి
స్పందన రాలేదని వివరించారు.
ద్వైపాక్షిక
సిరీస్ ఆడేందుకు భారత్
తిరస్కరించడం వల్ల ప్రసార
కర్త దుబాయ్ కు చెందిన తాజ్
ఎంటర్ టైన్ మెంట్ నెట్ వర్క్
చానెల్ కు పిసిబి 10.5కోట్లు
చెల్లించాల్సిఉంటుంది.
Saturday, 7 September 2013
హుర్రే....ముర్రే...!
న్యూయార్క్:
యుఎస్ ఓపెన్
లో అతిపెద్ద సంచలనం పురుషుల
సింగిల్స్ డిఫెండింగ్ చాంపియన్
ఒలింపిక్ హీరో ఆండీ ముర్రేకు
షాక్ హాట్ ఫేవరేట్ గా టైటిల్
నిలబెట్టుకుంటాడనుకున్న
అందరి అంచనాలను తారుమారు
చేస్తూ...ఈ
బ్రిటన్ కింగ్ క్వార్టర్స్
లోనే ఇంటిబాట పట్టాడు
స్విట్జర్లాండ్ కు చెందిన
టాప్ టెన్ ఆటగాడు స్టానిస్లాస్
వారింకా 6-4, 6-3,తో
విబుల్డన్ విజేత, మూడో
సీడ్ ముర్రేను బోత్తాకొట్టించి
సంచలన విజయాన్ని అందుకున్నాడు.
గతంలో ఫెదరర్,
జొకోవిచ్
లాంటి స్టార్లను చిత్తుచేపసిన
ముర్రే ఇక్కడ మాత్రం వారింకా
ధాటికి వరుససెట్లలో కంగుతిని
టోర్నీ నుంచి నిరావగా
నిష్ర్కమించాడు. రెండు
గంటలా 15 నిమిషాల
పాటు జరిగిన మ్యాచ్ లో ఆరంభసెట్
మినహా మరేదశ లోనూ వారింకాకు
పోటీ ఇవ్వలేకపోయిన ముర్రే...మ్యాచ్
లకు గాను ఇలా ఒక్క బ్రేక్ పా
యింట్ ను కూడా దక్కించుకోకపోవడం
ముర్రే 15 విన్నర్లతో
సిరిపెట్టుకోగా,, వారింకా
ఏకంగా 45 విన్నర్లతో
విరుగుకుపడ్డాడు. వరుసగా
గత ఆరు గ్రాండ్ స్లామ్స్ లో
సెమీఫైనల్ చేరిన ముర్రేకిదే
అత్యంత చెత్త ప్రదర్శన కూడా
ఈ ఏడాది. ఆరంభ
గ్రాండ్ స్లామ్ ఆస్ట్రేలియన్
ఓపెన్ లో రన్నరప్ గా నిలిచిన
ముర్రే గాయంతో ఫెంచ్ ఓపెన్
కు దూరమైనా వింబుల్డన్ లో
విజేతగా నిలిచి అద్భుతఫామ్
తో యుఎస్ ఓపెన్ లో అడుగుపెట్టాడు.
కానీ ఇక్కడ
ఏమాత్రం అంచనాలు లేని
తొమ్మిదోసీడ్ వారింకా దెబ్బకు
చిత్తయ్యాడు వారింకాకిదే
తొలి గ్రాండ్ స్లామ్ సెమీ
ఫైనల్ కావడం విశేషం.
శనివారం జరిగే
సెమీస్ లో తనకు ఎదురుపడతాడనునకున్న
ముర్రే నిష్క్రమణతో టాప్
సీడ్ జొకోవిచ్ కు ఫైనల్ ప్రపంచ
నెంబర్ వన్ నొవాక్ జొకోవిచ్
తో వారింకా అమీతుమి తేల్చుకోనున్నారు.
జొకోజోరు....
ఇక
సోమీస్ లో తనకు ఎదురుపడతాడనుకున్న
ముర్రే నిష్ర్కమణతో టాప్
సీడ్ జొకోవిచ్ కు ఫైనల్ మార్గం
సులువైనట్లే ఈ సెర్భియా
యోధుడు టోర్నీలో తన జైత్రయాత్రను
కొనసాగిస్తూ క్వార్ట ర్ ఫైనల్
లో అధిగమించి 2011 విన్నర్
అయిన జొకోవిచ్ 6-3 రష్యా
6-2, 3-6, 6-0 తో
రష్యాకు చెందిన 21వ
సీడ్ మైకేల్ యోజ్నీపై విజయంసాధించి
సెమీఫైనల్లో ప్రవేశించాడు.
జొకో కింది
వరుసగా 14వ
గ్రాండ్ స్లామ్ సెమీస్ కావడం
విశేషం కాగా. తొలిసారి
గ్రాండ్ స్లామ్ సెమీస్ చేరిన
వారింకాతో ముఖా ముఖి పోరులో
11-2 రికార్డుతో
జొకోవిచ్ దే ముందంజ అందులోనూ,
గతేడాది ఇక్కడే
నాలుగో రౌండ్లో జొకో చేతిలో
ఓడిన వారింకాకు ఈ సీజన్
ఆస్ట్రేలియన్ ఓపెన్ లో నూ
సెర్భియా స్టార్ చేతిలో
పరాభవమే ఎదురైంది. ఆ
తర్వాత జరిగిన రెండు గ్రాండ్
స్లామ్స్ లోనూ క్వార్టర్స్
దాటలేకపోవడం వారింకాకు
ప్రతికూలాంశమే ఈ నేపథ్యంలో
జోరుమీదున్న జొకోవిచ్ ను
వారింకా ఏ మేరకు ప్రతిఘటిస్తాడన్నది
వేచిచూడాలి. మరో
సెమీఫైనల్లో స్పెయిన్ బుల్
రఫెల్ నాదల్ తో ఫ్రాన్స్
సీడెడ్ క్రీడాకారుడు రిచర్డ్
గాస్కెట్ తలపడనున్నాడు.
Friday, 6 September 2013
ధూమపాన నియంత్రన ప్రచారకర్త..ద్రావిడ్.
న్యూఢిల్లీ:
మాజీ క్రికెటర్
రాహుల్ ద్రావిడ్ కొత్త అవతార
మెత్తాడు. జాతీయ
పొగాకు ఉత్పత్తుల వాడకానికి
వ్యతిరేకంగా ద్రావిడ్ ప్రచార
కర్తగా వ్యవహరించనున్నాడు.
ఈ మేరకు
ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం
విడుదల చేసిన ప్రకటనలో
తెలిపింది. ' ఈ
సందర్భంగా కుంటుంబ సంక్షేమ
శాఖ కార్యదర్శి సీకే మిశ్రా
మాట్లాడుతూ.... ధూమపానాన్ని
నియంత్రించలేకపోతున్నామని
ఆయన అన్నారు. తాము
అనుకున్న లక్ష్యాలను చేరుకునే
వరకు దీనిపై తమ పోరాటం
కొనసాగిస్తామని అన్నారు.
'200'మేమంటే మేము...
న్యూఢిల్లీ:
భారత్ లో
వెస్టిండీస్ పర్యటన వచ్చే
నెలాఖరులో మొదలవనుంది.
ఇక్కడ ఆడేందుకు
విండీస్ బోర్డు సమ్మతించడంతో
భారత క్రికెట్ నియంత్రణ మండలి
(బిసిసిఐ)పర్యటనను
ఖరారు చేసింది. మొత్తం
మీద బ్యాటింగ్ గ్రేట్ సచిన్
టెండూల్కర్ 200వ
టెస్టు స్వదేశంలోనే జరగనుందనే
విషయం అధికారికంగా స్ఫష్టమైంది.
నాలుగు వారాల
పాటు జరిగే ఈ టూర్ లో వెస్టిండీస్
అతిథ్య జట్టుతో రెండు టెస్టులు
మూడు వన్డేలు ఆడుతుంది.
ఒక మూడు రోజుల
వార్మప్ మ్యాచ్ కూడా జరగనుంది.
అక్టోబర్
31 నుంచి
నవంబర్ 27 వరకు
పర్యటన సాగుతోంది. అయితే
తేదీలు, వేదికల
విరాలను తర్వాత వెల్లడిస్తామని
బోర్డు కార్యదర్శి సంజయ్
పటేల్ తెలిపారు. సచిన్
200వ
టెస్టును తన పుట్టింటిలో
(వాంఖాండే)
లో నిర్వహించేందుకు
ముంబై క్రికెట్ సంఘం
(ఎంసీఎ)తహతహలాడుతున్నప్పటికీ
రొటేషన్ పద్దతి ప్రకారం ఈ
టెస్టు మొతేరా స్టేడియం లో
జరగాల్సి ఉంది. కానీ
ముంబైతో పాటు కోల్ కతా కూడా
మాస్టర్ ఘనతను కొట్టేయాలనుకుంటున్నాయి..
Thursday, 5 September 2013
రెండో అనధికార టెస్టు డ్రా....
విశాఖ:
భారత్-ఎ
, న్యూజిలాండ్
ఎ జట్ల మధ్య జరిగిన రెండో
అనధికార టెస్టు డ్రా గా
ముగిసింది. దీంతో
రెండు మ్యాచ్ ల సిరీస్ ఎలాంటి
ఫలితం తేలకుండానే ముగిసింది.
విశాఖ
స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్
లో గురువారం, ఆఖరి
రోజు రెండో ఇన్నింగ్స్
ప్రారంభించిన న్యూజిలాండ్
ఆట ముగిసే సమయానికి 51.2
ఓవర్లలో
3వికెట్లకు
176 పరుగులు
చేసింది. డి
బోర్డర్ (11నాటౌట్),
కొరి జే
అండర్సన్ (26నాటౌట్)
క్రీజులో
ఉన్నారు. లాథమ్
61 , కార్ల్
కచోపా 76 వేగంగా
ఆడారు. మొత్తానికి
ఈ మ్యాచ్ ద్వారా కివీస్ టాప్
ఆర్డర్ బ్యాట్స్ మన్ కు
బ్యాటింగ్ పాక్టీస్ లభించింది.
రాకేష్ ధ్రువ్
2, ధావల్
కులకర్ణీ ఒక్క వికెట్ తీశారు.
అంతకుముందు
408/7ఓవర్
నైట్ స్కోరు తో ఆఖరి రోజు ఆట
కొనసాగించిన భారత తొలి
ఇన్నింగ్స్ లో 135.3 ఓవర్లలో
430 పరుగులకు
ఆలౌటైంది. మన్
ప్రీత్ జునేజా డబుల్ సెంచరీ
చేజార్చుకున్నాడు..
లోయర్ ఆర్డర్
లో ఎవరు పెద్దగా రాణించలేదు.
ఉదయం లభించన
22 పరుగుల్లో
జూనే జానే 15 పరుగులు
చేశాడు. చివరకు
మార్క్ గిలెస్పీ బౌలింగ్ లో
అండర్సన్ కు క్యాచ్ ఇచ్చి
అవుటయ్యాడు. కివీస్
బౌలర్లలో గిలెస్సీ 4,
బ్రాస్ వెల్
3, ఆస్టలే
2 వికెట్లు
తీశారు...
నాదల్''జోరు....
న్యూయార్క్:
గాయంతో ఏడు
నెలల పాటు ఆటకు దూరమైన స్పెయిన్
బుల్ రఫెల్ నదల్ మళ్లీ గాడిలో
పడ్డాడు. కచ్చితమైన
సర్వీస్ , బలమైన
గ్రౌండ్ స్ట్రోక్స్ తో బ్యాక్
హాండ్ ఫోర్ హ్యాండ్ షాట్లతో
మునుపటి ఆట తీరును ప్రదర్శిస్తున్నాడు.
ఫ్రిబ్రవరిలో
పునరాగమనం తర్వాత తొమ్మిది
టైటిల్స్ గెలిచిన ఈ ప్రపంచ
రెండో ర్యాంకర్, యుఎస్
ఓపెన్ లోనూ అదరగొడుతున్నాడు.
భారత కాలమానం
ప్రకారం బుధవారం అర్థరాత్రి
జరిగిన పురుషుల సింగిల్స్
క్వాటర్ ఫైనల్లో రెండో సీడ్
నాదల్ 6-0, 6-2,6-2తో
సహచరుడు, 19వ
సీడ్ టోమి రొబ్రెడో (స్పెయిన్)పై
విజయం సాధించాడు. తద్వారా
ఐదోసారి సెమీ ఫైనల్లోకి
ప్రవేశించాడు. గంటా
40 నిమిషాల
పాటు జరిగిన ఈ మ్యాచ్ యుఎస్
ఓపెన్ లో అతి తక్కువ సమయం
జరిగిన క్వార్టర్స్ మ్యాచ్
గా రికార్డులకెక్కింది.
టోర్నీ
మొత్తంలో ఒక్కసారి కూడా
సర్వీస్ కోల్పోని నాదల్ ఈ
మ్యాచ్ లోనూ అదే ఊపును
కొనసాగించాడు. సహచరుడి
నుంచి పెద్దగా ప్రతిఘటన
లేకపోవడంతో తొలిసెట్ ను 22
నిమిషాల్లోనే
ముగించాడు. మూడు
బ్రేక్ పాయింట్లను కాపాడుకుని,
రెండు సార్లు
సర్వీస్ ను నిలబెట్టుకున్నాడు.
రెండో సెట్
లో రొబ్రెడో కాస్త పుంజుకున్నట్లు
కనిపించినా... ప్రత్యర్థి
బలమైన స్ట్రోక్స్ ముందు
నిలవలేకపోయాడు. నాదల్
నెట్ వద్ద నాలుగు పాయింట్లు
గెలుచుకుని రెండు బ్రేక్
పాయింట్లను సద్వినియోగం
చేసుకున్నాడు. రెండు
ఏస్ లను సంధించడంతో పాటు ఏడో
గేమ్ ను నిలబెట్టుకుని సెట్
ను సొంతం చేసుకున్నాడు.
మ్యాచ్
మొత్తంలో నాదల్ 28 విన్నర్లు
సాధిస్తే..రొబ్రెడో
డబుల్ ఫాల్ట్ (4)చేయడంతో
పాటు 21 సార్లు
అనవసర తప్పిదాలు చేసి మూల్యం
చెల్లించుకున్నాడు.
Wednesday, 4 September 2013
కెప్టెన్సీలో రికార్డు సృష్టించనున్న ధోనీ..
చెన్నై:
మహేంద్ర సింగ్
ధోనీ ఛాంపియన్ లీగ్ లో సరికొత్త
రికార్డు సృష్టించబోతున్నాడు.
అత్యధిక
మ్యాచులకు కెప్టెన్ గా
వ్యవహరించిన క్రికెటర్ గా
ధోనీ చరిత్ర సృష్టించబోతున్నాడు.
అయితే సెప్టెంబర్
22 తేదీన
తన సొంత మైదానంలో జరిగే మ్యాచ్
సందర్భంగా ఆయన ఈ రికార్డును
నెలకోల్పనున్నాడు. ధోనీ
నాయకత్వంలో 2010 లో
చెన్నై సూపర్ కింగ్ సిఎల్
టి ఛాంపియన్ షిప్ గెలుచుకుంది.
అప్పుడు చెన్నై
సూపర్ కింగ్స్ టైటాన్స్ ,
బ్రిస్పేన్
హీట్, ట్రినిడాడ్
టోబాగోలతో పాటు బి గూపులో
ఉంది. ఈ
ఛాంపియన్ లీగ్ లో చెన్నై సూపర్
కింగ్ తొలి మ్యాచ్ టైటాన్స్
పై సెప్టెంబర్ 22వ
తేదీన తలపడనుంది.
భద్రతా దృష్యా నిర్వహించలేం....
హైదరాబాద్:
భద్రతా కారణాల
దృష్యా హైదరాబాద్ లో జరగాల్సిన
ఛాంపియన్ క్వాలీ ఫైయింగ్
మ్యాచ్ లను మొహాలీకి తరలిస్తున్నట్లు
బిసిసిఐ ప్రకటించింది.
అయితే తెలంగాణ
ప్రకటన నేపథ్యంలో రాష్ట్రంలో
నెలకొన్న పరిస్థితుల కారణంగా
తాము భద్రత కలిగించలేమని
హెచ్ సిఎ తెలిపింది. ఈ
మెరకు బిసిసిఐ ఈ నిర్ణయం
తీసుకున్నట్లు సమాచారం.
తాజా షెడ్యూల్
ప్రకారం హైదరాబాద్ రాజీవ్
గాంధీ ఇంటర్ నేషనల్ క్రికెట్
స్టేడియంలో జరగాల్సిన 12క్వాలీ
ఫైయింగ్ మ్యాచ్ లను మొహాలీ,
అహ్మాదాబాద్,
రాంచీలు
పంచుకుంటున్నాయి. దీంతో
హైదరాబాద్ క్రికెట్ సంఘానికి
భారీ మొత్తంలో ఆదాయం గండీ
పడనుంది.
ఇక 'నో' ఛీర్ లీడర్స్...
.
ముంబై:
ఇండియన్
ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)
అంటే అభిమానులకు
, పరుగుల
వేట, వికెట్ల
దాహం, కళ్లు
చెదిరే ఫీల్డింగ్,
మైమరిపించే
ఛీర్ లీడర్స్ ...ఇవన్నీ
అభిమానులకు హంగామా పుట్టించేవి..
కానీ ఇక నుంచి
ఐపిఎల్ ల్లో ఛీర్ లీడర్స్
ఉండరని భారత క్రికెట్ నియంత్రణ
మండలీ (బిసిసిఐ)తెలిపింది.
సెప్టెంబర్
1న కోల్
కతాలో జరిగిన బిసిసిఐ వర్కింగ్
కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం
తీసుకున్నట్లు సమాచారం.
అయితే ఈ నెల 17 నుంచి ఆరంభం కానున్న ఛాంపియన్ ట్రోపి
నుంచి ఛీర్ లీడర్స్ నిషేదం
అమలు అవుతుందని తెలుస్తుంది.
ఇప్పటికే
స్పాట్ ఫిక్సింగ్ పాల్పడకుండా
కట్టిన నిర్ణయాలు తీసుకున్న
సంగతీ తెలిసిందే.!
డేర్ డెవిల్స్ కోచ్ గా కిర్ స్టన్..
హైదరాబాద్:
ఇండియాకు
ప్రపంచ కప్ అంధించడంలో ముఖ్య
భూమిక పోషించిన భారత క్రికెట్
మాజీ కోచ్ గ్యారీ కిర్ స్టన్ మళ్లీ ఐపిఎల్ రూపంలో ఢిల్లీ
డేర్ డెవిల్స్ జట్టుకు చీఫ్ కోచ్ బాధ్యతలు చేపట్టనున్నాడు.
అంతర్జాతీయ
టెస్టు ర్యాకింగ్స్ లో భారత్
ను అగ్రస్థానంలో నిలిపిన
కిర్ స్టన్ , ఆ
తర్వాత 2011లో
జరిగిన ప్రపంచ కప్ వన్డే టోర్న
మెంట్ లో ఇండియాను విజయ పథంలో
నడిపించాడు. అయితే
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో
అత్యంత ప్రజాదరణ పొందినజట్లలో
ఒకటిగా ఉన్న ఢిల్లీ డేర్
డెవిల్స్ ఈ ఏడాది జరిగిన ఆరో
ఎడిషన్ ఐపిఎల్ టోర్నీమెంట్
లో ఘోరంగా విఫలమైంది. మొత్తం 16 మ్యాచ్ లు ఆడిన ఢిల్లీ, 13మ్యాచ్ లో ఓడి మూడింట గెలిచింది.దీంతో పాయింట్ల పట్టికలో చివరిస్థానం సరిపెట్టుకుంది. అయితే ఈ సారి
ఢిల్లీ డేర్ డెవిల్స్ అదృష్టాన్ని
మార్చేందుకు కిర్ స్టన్ ను
ప్రధాన కోచ్ గా నియమించారు.
ఈ సందర్భంగా
కిర్ స్టన్ మాట్లాడుతూ...
ఇండియాకు
గతంలో కోచ్ గా పనిచేయడం తన
అదృష్టంగా భావిస్తున్నట్లు
తెలిపారు. మళ్లీ
తన పాత శిష్యులను కలుసుకునే
అవకాశం దొరుకుతోందని ఆనందం
వ్యక్తం చేశారు.. విరాట్
కోహ్లీ గురించి ప్రస్తావిస్తూ...
అంతర్జాతీయ
క్రికెట్ లో విరాట్ ఓ సంచలనంగా
మారాడని, తనను
ఔట్ చేయడం బౌలర్లకు పెద్ద
సమస్యగా మారిందని వ్యాఖ్యానించారు.
కోహ్లీ పై
తనకు మొదటి నుంచే ప్రత్యేకమైన
అభిమానం ఉందని తెలిపారు.
అతనొక అసాధారణ
క్రికెటర్ అని వివరించారు...
సచిన్ స్థానాన్ని
విరాట్ పూడ్చుతాడా..!అనే ప్రశ్నకు కిర్ స్టన్ ఆచితూచి
స్పంధిస్తూ... సచిన్
స్థానంలో మరొకర్నీ ఊహించడం
కష్టమని, ఆపని
నేను చేయలేనని అన్నారు.
ఊహాగానాలన్ని
మీడియానే సృష్టిస్తుందని
ఆది కేవలం మీడియాకే సాధ్యమని
ఆయన అన్నారు.
Monday, 2 September 2013
వన్డే అగ్రస్థానంలో టీమ్ ఇండియా..
దుబాయ్:
ఐసిసి వన్డే
ర్యాంకింగ్స్ లో భారత్
అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది.
ఆదివారం దుబాయ్
లో ఐసిసి ఈ మెరకు ఓ ప్రకటనను
విడుదల చేసింది. 123పాయింట్లతో
భారత్ అగ్రస్థానాన్ని
నిలబెట్టుకోగా, ఆస్ట్రేలియా
114పాయింట్లతో
రెండో స్థానంలో కొనసాగుతుంది.
112పాయింట్లు
సంపాధించిన ఇంగ్లాండ్ మూడో
స్థానంలో కొనసాగుతోంది.
టాప్ టెన్
బ్యాటింగ్ లో భారత జట్టు నుంచి
మహేంద్ర సింగ్ ధోనీ,
విరాట్ కోహ్లీలు
మాత్రమే కొనసాగుతున్నారు.
ప్రస్తుతం
భారత్ టెస్టుల్లో,
టీ20లోనూ
మూడో స్థానంలో కొనసాగుతోంది.
ఫిక్సింగ్ కు అన్ని దారులు బంద్...
కోల్
కతా: త్వరలో
జరగబోయో ఛాంపియన్ లీగ్ మ్యాచ్
లో క్రీడా కారులు మ్యాచ్
ఫిక్సింగ్ కు పాల్పడకుండా
ఐదు నిబంధనలను బిసిసిఐ ప్రతిపాదించింది. ఈ మెరకు
ఆదివారం జగ్మోహన్ దాల్మీయా
అధ్యక్షతన జరిగిన బిసిసిఐ
వర్కింగ్ కమిటి సమావేశంలో
ఈ నిర్ణయాని కి సభ్యులు ఏక
గ్రీవంగా తీర్మాణం తెలిపారు.
: టోర్నీలో
ప్రతీ జట్టుకు సెక్యూరిటీ
విభాగంతో పాటు అవినీతి నిరోధక
బృందం వెన్నంటే ఉంటుంది.
:మ్యాచ్
అధికారులు సంచరించే చోట
మిగతావారు సంచరించకుండా
కట్టుదిట్టమైన నిఘా ఉంటుంది.
:ఈ
టోర్నీలో ఆటగాళ్లు.మ్యాచ్
సిబ్బంది ఎలాంటి బహుమతులు
స్వీకరించరాదు. ఒక
వేళ్ల వాటిని స్వీకరించినా, దానికి సంబంధించిన పూర్తి
వివరాలు వెల్లడించాల్సి
ఉంటుంది.
:టోర్నీ
సందర్భంగా తమ సెల్ ఫోన్స్ ను
ఆటగాళ్లు , అధికారులకు
అప్పగించాలి. వీరి
కోసం వచ్చే కాల్స్ అన్నీ టీమ్
మేనేజర్ చూసుకుంటారు.
:ఈ
5 నిబంధనల్నీ
అమలు చేసే విషయంలో వీలైతే
అవినీతి నిరోదక భద్రత విభాగం
స్థానికపోలీసుల సహాయాన్ని
తీసుకుంటుంది.
Sunday, 1 September 2013
ఆసియా కప్ సొంతం చేసుకున్న కొరియా..
మలేషియా:
దక్షిణ
కొరియా ఆసియా కప్ ను ఎగరేసుకు
పోయింది.
ఆదివారం
జరిగిన ఫైనల్లో భారత్ పై
కొరియా 4-3గోల్స్
తేడాతో ఘన విజయం సాధించింది.
లీగ్
దశలో దక్షిణ కొరియాను మట్టి
కరిపించిన భారత్,
ఫైనల్లో
మాత్రం ఆ ప్రభావం చూపలేక
పోయింది.
అయితే
ఇప్పటికే భారత్ ప్రపంచ కప్ కు
అర్హత సాధించడంతో ఆ జట్టు
ఊపిరి పీల్చుకుంది.
వరుస
మ్యాచ్ లో విజయంసాధించి ఫైనల్
ట్రోపి తీసుకొస్తారని ఆశించిన
అభిమానులకు నిరాశే మిగిలింది.
2007 చెన్నై
లో జరిగిన టోర్నీలో విజేతగా
నిలిచి,
ఆ
తర్వాత ఘోరంగా విఫలమైంది.
ఆ
టోర్నీలో భారత్ ఏడో స్థానంలో
నిలబెట్టుకుంది.
అయితే
ఈ ఏడాది మాత్రం అనూహ్య విజయాలతో
దూసుకుపోయినా, ఫైనల్లో
మాత్రం చేతులెత్తేసింది.
కానీ
అభిమానులకు ఊరట నిచ్చే
అశం...ప్రపంచ కప్ కు అర్హత సాధించడం...!
రిటైర్మెంట్ కోసమేనా....!
ముంబై:
సచిన్
టెండూల్కర్ తన 200వ
టెస్టు మ్యాచ్ ను స్వదేశంలోనే
ఆడనున్నాడు...
ఈ మెరకు బిసిసిఐ ఓ ప్రకటన
విడుదల చేసింది.
ఆదివారం
సాయంత్రం సర్వ సభ్య సమావేశమైన
బిసిసిఐ,
భారత్
వెస్టిండీస్ టెస్టు మ్యాచ్ షెడ్యూల్ ను ఖరారు చేశారు.
రెండు
టెస్టు మ్యాచ్ లు,
ఐదు
వన్డే మ్యాచ్ ల సిరీస్ కోసం వెస్టిండీస్
కు ప్రతిపాదన పంపింది.
అయితే
ఈ ఏడాది చివర న భారత్ సౌతాఫ్రికా
తో టెస్టు సిరిస్ ఆడటానికి
వెళ్లనుంది.
అయితే
సౌతాఫ్రికా టూరు కంటే ముందు
భారత్ లోనే వెస్టిండీస్ తో
టెస్టు సిరిస్ నిర్వహించాలని
చూస్తుంది.
ఈ
సవరణ భారత క్రికెట్ లెజండర్
మాస్టర్ బ్లాస్టర్ సచిన్
టెండూల్కర్ గురించేనని
తెలుస్తుంది.
సౌతాఫ్రికా
టూరు తరువాత టెస్టు క్రికెట్
కు గుడ్ బై చెపుతాడని వస్తున్న
కథనల నేపథ్యంలో, ఇప్పుడు
వెస్టిండీస్ సిరిస్ సచిన్
కోసమేనని బిసిసిఐ చెప్పకనే చెప్పడంతో, ఆతని రిటైర్మెంట్ పై ఊహాగానాలు
ఊపందుకున్నాయి.
అయితే
క్రికెట్ నిపుణులు మాత్రం సచిన్
ఎక్కడైనా, ఏ
దేశంలోనైనా ఆడగలడని ప్రత్యేకించి
సచిన్ కోసం టెస్టు షెడ్యూల్
మార్చాల్సిన పనిలేదని వారు
అభిప్రాయపడుతున్నారు.
కానీ
కొందరు మాత్రం సచిన్ కు
స్వదేశంలో నే సగర్వంగా రిటేర్
మెంట్ ప్రకటించే సువర్ణ అవకాశం
దొరికిందని అంటున్నారు.
ఏదేమైనా సచిన్
భారత్ క్రికెట్ కు చేసిన
సేవలను గుర్తించి,
బిసిసిఐ
ఈ నిర్ణయం తీసుకుందని అభిప్రాయాలు
వెలువడుతున్నాయి.
పాక్ వన్డే సిరిస్ కైవసం...
హరారే:
మూడు
మ్యాచ్ ల వన్డే సిరిస్ ను
పాకిస్తాన్ కైవసం చేసుకుంది.
జింబాంబ్వే
తో జరుగుతున్న ఈ సిరిస్ పాక్
2-1తేడాతో
సిరిస్ ను ఎగరేసుకుపోయింది.శనివారం
హరారే స్పోర్స్ట్ క్లబ్
వేదికగా జరిగిన మూడో వన్డే
పాకిస్తాన్ 108పరుగుల
తేడాతో ఘన విజయం సాధించింది.
టాస్
గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన
పాకిస్తాన్ 50ఓవర్లలో
6వికెట్ల
నష్టానికి 260పరుగులు
చేసింది.
మిస్బా
(67),
అహ్మద్
షెహజాద్ (54)అర్థ
సెంచరీతో చెలరేగారు.
అయితే
మిగతా బ్యాట్ మెన్స్
పర్వాలేదనిపించిన చివర్లో
సర్ఫార్రాజ్ అహ్మద్ (22)
వేగంగా
ఆడాడు.
జింబాంబ్వే
బౌలర్లలో టెండి చతరాకు మూడు
వికెట్లు దక్కాయి.
అనంతరం
261పరుగుల
లక్ష్యంతో బరిలోకి దిగిన
జింబాంబ్వే ఏమాత్రం విజయం
వైపు దూసుకుపోకుండా చతికీలపడింది.
40ఓవర్లలో
152పరుగులు
చేసి ఆలౌటై ఓడింది.
వాలర్
(48)తో
టాప్ స్కోరర్ గా నిలిచాడు.
పాక్
బౌలర్లలో మహ్మద్ హఫీజ్,
అబ్దుల్
రెహమాన్ ,
అజ్మల్
తలా రెండేసి వికెట్లు తీశారు.
67పరుగులు
చేసిన మిస్బాకు మ్యాన్ ఆఫ్
ద మ్యాచ్ , హాఫీజ్
కు ప్లేయర్ ఆఫ్ ద సిరిస్
అవార్డులు అభించాయి.
''హాట్ షాట్'' అదుర్స్...
:. మొదటి
టైటిల్ కైవసం...
:. హైదరాబాద్ సంచలనం...
:. సైనా ఆట అద్భుతం...
:. సైనా ఆట అద్భుతం...
ముంబై:
హైదరాబాద్
హాట్ షాట్ తొలి ఐబిఎల్ టైటిల్
ను అందుకుంది. శనివారం
ముంబై సార్థార్ స్టేడియంలో
జరిగిన ఫైనల్ మ్యాచ్ లో
హైదరాబాద్ తిరుగులేని విజయం
సాధించింది. దీంతో
తొలి ఐబిఎల్ టైటిల్ దిక్కించుకున్న
టీంగా హైదరాబాద్ హాట్ షాట్
చరిత్ర సృష్టించింది.
అవధె వారియర్స్
పై తిరుగులేని అధిపత్యాన్ని
ప్రదర్శించిన సైనా కో అండ్
టీం....టైటిల్
ఎగరేసుకుపోవడంలో కీలక పాత్ర
పోషించారు. మొదట
పురుషుల సింగిల్స్ లో హైదరాబాద్
ఆటగాడు తనాంగ్ సాంగే...అవధె
వారియర్స్ ఆటగాడు శ్రీకాంత్
పై 21-10, 21-20,తేడాతో
విజయం సాధించాడు. అనంతరం
జరిగిన మహిళల సింగిల్స్ లో
సింధూ పై సైనా 21-15,
21-17తేడాతో
విజయం సాధించింది. అయితే
ఇంకో మ్యాచ్ మిగిలుండగానే
హైదరాబాద్ టైటిల్ ను
చేజిక్కించుకుంది.
తిరుగులేని
సైనా...
ఐబిఎల్
తొలి సిజన్ నుంచి తిరుగులేని
ఆదిపత్యాన్ని ప్రదర్శిస్తున్న
సైనా నెహ్వాల్ ....ఫైనల్లో
సైతం అదే జోరును కొనసాగించింది.
ఐబిఎల్ లో
సైనా అత్యుత్తమ షట్లర్ గా
కొనసాగింది. జట్టు
ఆడిన ప్రతీ మ్యాచ్ లోను బరిలోకి
దిగి..అన్నింట్లోనూ
నెగ్గిన ఏకైక క్రీడాకారిణి
ఆమే. నెహ్వాల్
మొత్తం 7విజయాలు
సాధించింది. సైనా
కాకుండా ఆడిన ప్రతీ మ్యాచ్
లో నెగ్గిన క్రీడా కారుడు
చాంగ్ వీ మాత్రమే . ఐతే
అతను 4 సింగిల్స్,
ఓ మిక్స్ డ్
డబుల్స్ మాత్రమే ఆడాడు.
విజేతలకు
ఫ్రైజ్ మనీ...
తొలి
ఐబిల్ గెలిచిన హైదరాబాద్
హాట్ షాట్ రూ 3.25 కోట్లు
దక్కించుకుంది. అయితే
ఈ టోర్నిలో రన్నరప్ గా నిలిచిన
అవధె వారియర్స్ కు 1.75
కోట్లు
చేజిక్కించుకుంది. అంతే
కాకుండా ఈ టోర్నీలో అత్యంత
వేగవంతమైన సర్వీస్ 279
కిలో మీటర్లలో
ముంబయి ఆటగాడు ఇవనోవ్ కొట్టాడు...........
Subscribe to:
Posts (Atom)